Pages

Subscribe:

Ads 468x60px

Monday, 6 August 2012

గుండెపోటును 50 శాతం తగ్గించే సముద్ర ఆహారం!

సముద్ర ఆహారం తీసుకుంటే గుండెపోటును 50 శాతం వరకు తగ్గించవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. వారానికి ఒకసారి లేదా రెండుసార్లు సీ ఫుడ్‌ను ఆహారంగా తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత రోగాలకు చెక్ పెట్టవచ్చునని లండన్ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) సూచిస్తున్నట్లు డెయిల్ మెయిల్ ప్రచురించింది.

రొయ్యలు, పీతలు, స్క్విడ్, ఆక్టోపస్‌లలో విటమిన్స్, మినరల్స్ మెండుగా ఉన్నాయని ఎన్‌హెచ్ఎస్ తెలిపింది. సల్మోన్ అనే సముద్ర చేప నుంచి వచ్చే చేపనూనె గుండెపోటును నియంత్రిస్తుంది. సముద్రపు ఆహారంలో కీలక ఫ్యాటీ యాసిడ్ ఉందని ఇది.. గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుందని ఎన్‌హెచ్ఎస్ తెలిపింది.
సముద్రపు ఆహారంలో కొవ్వు శాతం ఇతర మాంసాహారంతో పాటు చీజ్, ఫాస్ట్‌ఫుడ్‌లకంటే తక్కువగా ఉంటుంది. ఇంకా రక్తంలోని కొవ్వు శాతాన్ని నియంత్రించడంలో సముద్రపు ఆహారం తీసుకోవడం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, గర్భధారణ సమయంలో ముడి షెల్ల్ఫిష్ మరియు రా సీ ఫుడ్‌ను తీసుకోకూడదని ఎన్‌హెచ్ఎస్ వ్యతిరేకిస్తోంది.
Enter your email address:

0 comments:

Post a Comment