మన శరీరంలో కాలేయము శరీర క్రియలో ప్రధాన భూమిక నిర్వహిస్తుంది. అది రక్తవహ స్రోతస్సులకు ముఖ్యస్థానముగా ఆయుర్వేదం చెబుతుంది.
దోష, ధాతువులకు సంబంధించిన సక్రమ పోషణ క్రమాన్నికూడా నిర్వహిస్తుంది. సాధారణ ఆహారంలోని చక్కెరను గ్లైకోజెన్‌గా కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్ ఎంజైముల తయారీలోనూ ప్రముఖ క్రియను నిర్వహిస్తుంది.
కాలేయము (లేక) యకృత్‌లో తయారయిన పిత్తము (ఱనిజఉ) పిత్తాశయములో నిల్వ ఉంచబడి శరీర క్రియ కలాపములో పాల్గొంటుంది.
ప్రతిరోజు యకృత్ (లివర్) పాచక పిత్తము దాదాపు 500 సి.సి ఉత్పత్తి చేస్తుంది. దానిని పిత్తాశయములో నిల్వ చేస్తుంటుంది. నిలువ వుంచిన బైల్ ద్రవము త్యక్తద్రవత్వాన్ని రంజక పిత్తముగ మార్చుకొని ఆహార ప్రవాహంలో కలిసిపోతుంది.
ప్రతిరోజు యకృత్ (లివర్) పాచక పిత్తము దాదాపు 500 సి.సి ఉత్పత్తి చేస్తుంది. దానిని పిత్తాశయములో నిల్వ చేస్తుంటుంది. నిలువ వుంచిన బైల్ ద్రవము త్యక్తద్రవత్వాన్ని రంజక పిత్తముగ మార్చుకొని ఆహార ప్రవాహంలో కలిసిపోతుంది.
ఏదైనా అగ్ని వైషమ్యం ఏర్పడినప్పుడే జీర్ణశక్తిలోపం ఏర్పడి రోగకారణమవుతుంది.
ఉదరములో కుడి భాగములో లివర్ ప్రదేశంలో విపరీతమైన నొప్పి, వాంతి వచ్చేటట్లు వుండటం, వాంతులు అవడం, జ్వరం రావడం, కామెర్లు (జాండీస్) కలగటం వంటి లక్షణాలు పిత్తాశయంలోని పిత్తము రాళ్లుగా ఘనీభవించినప్పుడు కలుగుతాయి. వీటిని గాల్ స్టోన్స్‌గా వ్యవహరిస్తారు.
పిత్త ద్రవములోని కాల్షియం బిలుర్‌బునేట్, కొలెస్టరాల్‌తో కలిసి రాయిగా ఘనీభవించి ఇబ్బంది కలుగుతుంది. బైల్‌సాల్ట్, లెసిధిన్, కొలెస్టరాల్ మిశ్రమంతో పిత్తాశయంలో రాళ్ళుగా రూపొందుతాయి.
సామాన్యంగా లక్షణాలు ముందుగా కనబడవు. రాళ్ళు బాగా ఏర్పడినాక ఏదైనా రేడియోగ్రాఫిక్ పరీక్షలు రొటీన్‌గా చేయించుకునేప్పుడు బయటపడటం జరుగుతుంది.
జీర్ణశక్తిలోపం, కొవ్వుతో కూడిన ఆహారం (్ఫటీ ఫుడ్) జీర్ణం కాకపోవడం, త్రేన్పులు, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు తోడవుతాయి.
లివర్ ప్రాంతంలో కుడివైపు భాగంలో నొప్పి మొదలయి వెనుకగా హంస ఫలకము (డ్ళ-శ్రీజ) వరకు నొప్పి ప్రసరిస్తున్నట్లవుతుంటుంది.
రక్త పరీక్షలో తెల్ల కణాలు అధికమయి వుంటాయి. తరచూ జాండ్రీస్ (కామెర్లు) కనబడటం, నొప్పి కలగడం జరుగుతుంది. రక్తంలో సీరమ్ బిలురుబిన్ కూడా అధికమవుతుంది.
పిత్తాశయ నాళములో కూడా ఈ గాల్ స్టోన్స్ వుండే అవకాశం వుంది. దీనితో అబ్‌స్ట్రక్టివ్ జాండీస్ ఏర్పడే అవకాశం వుంది. దీనిని ఆయుర్వేదంలో శాఖాశ్రీతకారులా అంటారు.
గాల్‌స్టోన్స్ నివారణకు చికిత్స జాగ్రత్తగా వుండాలి. ఆహార విహారాదులను సక్రమంగా పాటిస్తే రెండు సంవత్సరాలలో కరిగిపోతాయి. ఏదైనా మధ్యలో నొప్పి తీవ్రమవడం కామెర్లు, జ్వరం, ఇన్‌ఫెక్షన్ లాంటి ఉపద్రవాలు వెంట వెంటనే తీవ్రంగా వస్తుంటే వెంటనే చికిత్స అవసరమవుతుంది. ఎంఆర్‌ఐ స్కానింగ్ ద్వారా గాల్ బ్లాడర్‌లోని రాళ్ళ వివరాలు ఎంత సైజులో ఉన్నది, ఎన్ని వున్నాయి అనే వివరాలు తెలుసుకొనవచ్చును. ఎక్స్‌రేలో రాళ్ళు పెద్దవిగా వుంటే కన్పిస్తాయి.
వెంటనే ఉపశమనానికి శస్త్ర చికిత్స లాప్రోస్కోపీ ద్వారా నిర్వహిస్తారు. కొద్దిపాటి గాటుతో శస్త్ర చికిత్స నిర్వహించి రెండో రోజు ఇంటికి పంపిస్తారు.
సర్జరీ చేయించుకున్న వారిలో కొందరిలో సర్జరీ తరువాత కూడా అవే లక్షణాలు కనబడుతున్నట్లు వారిలో ఇంకా రాళ్ళు వున్నాయనే సందేహం, ఇంకా కొత్తవి తయారయినాయనే అపోహ వుంటుంది. పూర్తిగా గాల్ బ్లాడర్ తొలగించినట్లున్నా రాళ్ళు తిరిగి ఏర్పడే అవకాశం లేదు. ఇటువంటి లక్షణాలు వున్నట్లయితే ఇతర ప్రదేశంలో అన్నవాహికలోనో క్లోమ గంధి వాపు, ఆంత్రికవాపు, బైల్‌డక్ట్ వాపు వున్నట్లయితే ఆ విధంగా వుండవచ్చు. వైద్య పరీక్షలో నిర్థారించుకొని చికిత్స తీసుకోవాలి. ఇటువంటి సందర్భంలో ఆయుర్వేదంలో సూచించిన భూమ్యామ్లకి, కటుకి, గిరిపర్పటి, మృద్వీక పాషాణ భేదితో కూడిన మందులు బాగా పనిచేస్తాయి.
వీటితోపాటు -న్హ్జ్గిని (నినిడ), ళజ్జజ (న్ళి) ళన్జిదిఉ (్ళ్హ్గ) ఉఉ్గని (నిజ) వారి ప్రసిద్ధ ఫార్ములేషన్స్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. భూమ్యామ్లకి, శే్వత పర్పటి, హజరుల్ యహుద్‌భస్మం పాషాణ భేదితో కూడిన యోగము బాగా ఉపకరిస్తుంది. హెప్రోజన్ కాలేయ రక్షణకు విశేషంగా పనిచేస్తుంది.
సమస్య చిన్నదిగా వున్నా కాలాంతరంలో అనేకమయిన కాలేయ సంబంధ సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ. స్పందించి జాగ్రత్త పడటం అవసరం.
డాక్టర్ డి. శ్రీరామమూర్తి, B.A.M.S
drmurthy9@yahoo.com
Phone: 040-23741020, 9885297983
రాఘవేంద్ర నర్సింగ్ హోం
Flat No. 502, Plot No. 29,
Vijaya Enclave, Srinagar colony,
Hyderabad - 500 073.
సేకరణ: ఆంధ్రభూమి







0 comments:
Post a Comment