"మినియర్స్ డిసీజ్" ఇది చెవిలోపలి భాగంలో వచ్చే సమస్య. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇందులో వ్యాధి లక్షణాలు ఎల్లప్పుడూ ఉండవు. అప్పుడప్పుడు లక్షణాలు అధికమవుతుంటాయి. లక్షణాలు సాధారణంగా 20 నిమిషాల నుంచి 2 గంటల పాటు ఉండవచ్చు. సాధారణంగా ఈ వ్యాధి ఒక చెవికే వస్తుంది. ఇది ప్రాణాలకు హాని కలిగించే వ్యాధి కాదు.
కారణాలు:
ఈ వ్యాధి సాధారణంగా చెవి లోపలి భాగంలో (ఇన్నర్ ఇయర్) ద్రవపదార్థం అధికమవడం వల్ల వస్తుంది.
- ఆహారంలో ఉప్పు మోతాదు ఎక్కువ కావడం వల్ల శరీరంలో నీటి నిల్వలు ఎక్కువై ఈ సమస్య రావచ్చు.
- పొగతాగడం, మద్యం సేవించడం, కెఫైన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది.
- మానసిక ఆందోళన అధికంగా ఉండటం కూడా కారణమే.
- చెవి అంతర్భాగంలో ఏదో బరువుగా, నిండినట్లు ఉండటం
- చెవిలో శబ్ధాలు వినపడటం, వికారం, అప్పుడప్పుడు సమస్య ఎక్కువ కావడం వల్ల వాంతులు కావచ్చు. సమస్య ఎక్కువైనపుడు చెమటలు పట్టడం, శబ్ధాలు సరిగ్గా వినపడకపోవడం.
చెవి వినికిడి శక్తి తెలుసుకునేందుకు ప్యూర్ టోన్ అడియోమెట్రి పరీక్ష ఉపయోగపడుతుంది. సీబీపీ, ఈఎస్ఆర్ వంటి రక్తపరీక్షలు చేయించాలి. ఎమ్ఆర్ఐ, సీటీస్కాన్ వంటి పరీక్షలు చేయించడం వల్ల చెవి అంతర్భాగము, తలలో ఏదైనా సమస్య ఉంటే గమనించవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- ఆహారంలో ఉప్పు మోతాదు తగ్గించాలి. - పొగతాగడం మానివేయాలి.
- ఆల్కహాల్ అలవాటు ఉంటే మానుకోవాలి,
- కాఫీ ఎక్కువగా తాగకూడదు.
- మానసిక ఆందోళన తగ్గడానికి యోగా, మెడిటేషన్ చేయాలి.
కాక్యులస్: ఇది సాధారణంగా పెళ్లికాని లేదా పిల్లలు పుట్టని మహిళలకు, నిద్రలేమితో బాధపడుతున్న వారికి మంచి మందు. సమయం తొందరగా గడిచినట్లు అనిపించడం, దిగులు, తలనొప్పి, కళ్లు తిరగడం, వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి.
ప్రయాణం చేస్తున్నప్పుడు, కదిలే వస్తువులను చూసినపుడు, చల్లటి పదార్థాలను తీసుకున్నప్పుడు ఎక్కువగును. ఆకలి మందగించడం, చల్లటి నీళ్లు తాగాలనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. పొగతాగడం వల్ల, శబ్ధాలు, కదలికలకు, మధ్యాహ్నం వేళ, మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు సమస్య ఎక్కువగా ఉంటుంది.
ఛీనోపోడియమ్: అకస్మికంగా తల తిరగడం, మినియర్స్ డిసీజ్, పెద్దశబ్ధాలే వినగలరు, చెవిలో హోరు, చెవికి సంబంధించిన నరాల బలహీనత వల్ల సమస్య తలెత్తుతుంది. చెవి సమస్య వల్ల తలతిరగడం, కుడి భుజం నుంచి వెన్ను వరకు నొప్పి ఉంటుంది.
బెల్లడోనా: సమస్య అకస్మికంగా వస్తుంది. దయ్యాలను, లేని వ్యక్తుల్ని చూస్తున్నట్లు భావిస్తారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎంత బాగుంటారో, జబ్బు వచ్చినపుడు అంత చిరాకుగా ఉంటారు. పారిపోవాలనిపించడం, బట్టలు చింపేయడం, పక్కవారిని కొట్టడం, కొరకడం వంటివి చేస్తారు. తలనొప్పి, తలతిరగడం, కళ్లుతిరిగినపుడు వెనక్కి లేదా ఎడమ పక్కకి పడిపోతున్నట్లు అనిపిస్తుంది. వాంతులు, వికారం, ఆకలి తగ్గడం, చల్లటి నీళ్లు ఎక్కువగా తాగాలనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. సమస్య చిన్న శబ్ధాలకి, చల్లగాలికి మధ్యాహ్నం వేళ ఎక్కువగా ఉంటుంది.
చైనా సల్ఫ్: తలనొప్పి, ఎడమ పక్క ఎక్కువగా ఉండటం, తలతిరగడం, నడుస్తున్నప్పుడు పడిపోవడం, సరిగ్గా నిలబడలేకపోవడం , చెవిలో హోరు, వినికిడి శక్తి తగ్గటం వంటి లక్షణాలు ఉంటాయి.
థెరిడియాన్: తలతిరగడం, వాంతులు, వికారం, తలనొప్పి, చిన్న శబ్ధాలు కూడా తట్టుకోలేరు. సమస్య కళ్లు మూసినపుడు, వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు శబ్ధాలకు ఎక్కువగా ఉంటుంది.
నైట్రిక్ఆసిడ్: చిరాకు, నీరసం, వినికిడి కష్టంగా ఉండటం, నములుతున్నప్పుడు చెవిలో శబ్ధాలు రావడం, వాహనంలో ప్రయాణిస్తున్నపుడు హాయిగా అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. మానసిక ఆందోళన, మలబద్దకం, అర్షమొలలు, రక్తంపడటం వంటి లక్షణాలు ఉంటాయి. రాత్రివేళ, చల్లని వాతావరణంలో సమస్య ఎక్కువగా ఉంటుంది.
స్పైజిలియా: పిన్నులు, పదునైన వస్తువులంటే భయం, తలనొప్పి, తలతిరగడం, వినికిడి శక్తి లోపించడం, గుండె దడ, కదిలినపుడు ఛాతిలోనొప్పి, వేడి నీళ్లతో కొంచెం ఉపశమనంగా అనిపిస్తుంది. ఆయాసం, కుడి పక్కకు పడుకుంటే ఉపశమనంగా ఉండటం, కదిలినపుడు, శబ్ధాలకు, స్నానం చేసిన తరువాత సమస్య ఎక్కువగా ఉంటుంది.
డా. శ్రీకాంత్
సీఎండీ(హోమియో)
మేనేజింగ్ డైరెక్టర్
హోమియోకేర్ ఇంటర్నేషనల్
ఫోన్ : 9550003399
సేకరణ: ఆంధ్రజ్యోతి, సకల









0 comments:
Post a Comment