చల్లని వాతావరణం, దుమ్ము, ధూళి, కాలుష్యం, ఇన్ఫెక్షన్‌ల వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు వస్తున్నాయి. ఊపిరితిత్తుల సమస్యలు సాధారణ అలర్జీ నుంచి కేన్సర్‌ల వరకు దారితీస్తున్నాయి. అల్లోపతి, హోమియోపతి వైద్యవిధానాల్లోని మేటిసారంతో రూపొందించిన ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఒక్కటే ఈ ఊపిరితిత్తుల సమస్యకు శాశ్వత పరిష్కారం అంటున్నారు ప్రముఖ వైద్యనిపుణులు డాక్టర్ కె.శ్రీధర్, డాక్టర్ సుప్రియ.
నానాటికి పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్న రోగుల సంఖ్య పెరుగుతుంది. అధిక సంఖ్యాకుల్లో దీర్ఘకాలికంగా ఉంటూ జీవితకాలం బాధించే ఈ వ్యాధి వల్ల ఊపిరాడని పరిస్థితి కలిగినపుడు రోగికి ప్రాణాంతకంగా మారుతుంది. వాతావరణం చల్లబడగానే రోగులు ప్రతి సంవత్సరం ఈ వ్యాధుల బారిన పడుతుంటారు. అన్ని ఊపిరితిత్తుల వ్యాధుల బారినుంచి శాశ్వత విముక్తి కలిగించడానికి వైద్యరంగంలోనే నూతన అధ్యాయంగా ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ప్రభవించింది.
అల్లోపతి, హోమియోపతి వైద్యనిపుణులు రోగిని పరీక్షించి, రోగికి వాడాల్సిన మందులను చర్చించి నిర్ణయిస్తారు. విదేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ వైద్య విధానం ఎందరో రోగులకు ఊపిరితిత్తుల వ్యాధిని శాశ్వతంగా నయం చేసింది. వైద్యరంగంలోనే విప్లవాత్మకమైన ఇంటిగ్రేటెడ్ మెడిసిన్‌ను మన దేశంలో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్నది. వ్యాధి ముదరక ముందే ఈ విధానంలో వైద్యం పొందితే ఊపిరితిత్తుల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆస్తమా, బ్రాంకైటీస్ వ్యాధులు
వాతావరణం చల్లబడినపుడు దుమ్ము పీల్చినపుడు కొంతమందికి ఊపిరాడని పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని ఉబ్బసం లేక ఆస్తమా అంటారు. కొంతమందికి ఊపిరితిత్తుల్లోని నాళాల ఆపు వల్ల కూడా ఇలాంటి పరిస్థితి కలుగుతుంది. దాన్ని బ్రాంకైటీస్ అంటారు. చిన్న పిల్లల్లోనైతే ఒక్కోసారి ఈ వ్యాధి ఊపిరితిత్తుల్లోని చిన్న నాళాలకు సోకి ప్రాణాంతకమైన బాంక్రియోలైటిస్‌గా మారుతుంది. ఉబ్బస సంబంధమైన ఈ వ్యాధులన్నిటికీ రోగి ఎంతో దీర్ఘకాలంగా మందులు వాడుతున్నా పెద్దగా ఫలితం కనిపించటంలేదు. ఇలాంటి వారికి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ద్వారా శాశ్వత పరిష్కారం కలిగించవచ్చు. రోగికి వచ్చే ఈ ఉబ్బస వ్యాధిని క్రమంగా తగ్గించి పూర్తిగా నయం చేసేలా వైద్యం వుంటుంది. అల్లోపతి, హోమియోపతి మందులను ఒకేచోట కలిపి వాడించటం వల్ల రెట్టింపు ఫలితం ఉంటుంది.
సి.ఒ.పి.డి., ధూమపానం
సి.ఒ.పి.డి., అనే దీర్ఘకాల ఊపిరితిత్తుల వ్యాధి సాధారణంగా ధూమపానం చేసే వారిలో చూస్తుంటాం. ఈ వ్యాధిలో లంగ్ టిష్యూ, ఊపిరితిత్తుల కండరాలు పాడైపోవుట వల్ల రోగికి ఆయాసం, రొంప, కఫం పడటం వంటి సమస్యలు కలుగుతాయి. ఈ వ్యాధికి జీవితకాలం మందులు వాడాల్సిందే. మందులు వాడుతున్న వారిలో కూడా ఈ వ్యాధి మధ్యమధ్యలో అప్పుడప్పుడు ఉధృతరూపం దాలుస్తుంటుంది. అప్పుడు హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి కూడా వస్తుంది.
ఎన్ని మందులు వాడినా ఈ వ్యాధి నానాటికి ముదురుతుంది. అప్పుడు దాన్ని కార్‌పల్మనేల్ అంటారు. ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ద్వారా ఈ వ్యాధిని ముదరకుండా కాపాడుకోవచ్చు. ఈ వ్యాధి ఉన్నవారికి మాటిమాటికి ఇన్ఫెక్షన్‌లు కలగకుండా నివారించవచ్చు. ఊపిరితిత్తులకు కలిగే సాధారణ ఇన్ఫెక్షన్‌లు మొదలుకొని ప్రాణాంతకమైన టీబీ, న్యుమోనియా వరకు ఎలాంటి ఇన్ఫెక్షన్ కైనా సరే ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ద్వారా చక్కటి వైద్యం చేయవచ్చు. మళ్లీ మళ్లీ వచ్చే ఇన్ఫెక్షన్‌లు మరెన్నటికీ రాకుండా అరికట్టవచ్చు.
లంగ్ కేన్సర్
ఊపిరితితుత్ల కేన్సర్‌తో బాధపడుతున్న వారు కీమోథెరపీతో పాటుగా ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ విధానాన్ని అవలంభిస్తే వారికి కీమోథెరపీ వల్ల కలిగే దుష్ఫరిణామాలను తగ్గించుకోవచ్చు. కేన్సర్ రాకుండా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ పద్ధతి ద్వారా పాటిస్తూ, లంగ్ కేన్సర్ బారిన పడకుండా ఉండేందుకు ప్రయత్నించవచ్చు. లంగ్స్‌లోని గడ్డలను కరిగించే ప్రయత్నం కూడా చేయవచ్చు.
ఇతర రకాల వ్యాధులు
ఊపిరితిత్తులకు సంబంధించి ఇంకా ఎన్నో వ్యాధులున్నాయి. అస్బెస్టోసిస్, సిలికోసిస్, సార్కాయిడోసిస్, ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్‌లు వంటి దీర్ఘకాల వ్యాధులకు కూడా ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ద్వారా శాశ్వత పరిష్కారం పొందవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే లంగ్స్‌కు సంబంధించిన ఎలాంటి వ్యాధినైనా సరే ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ తో నయం చేయవచ్చు. ఈ వైద్యం ఎంత త్వరగా మొదలు పెడితే అంత మెరుగైన ఫలితం పొందవచ్చు.
డాక్టర్ కె. శ్రీధర్, డాక్టర్ సుప్రియ
బాడీ అండ్ మైండ్ ఇంటిగ్రేటెడ్
మెడికల్ సెంటర్
కేపీహెచ్‌బీ, హైదరాబాద్
ఫోన్స్ : 040-64630606
92465 50606
సేకరణ: ఆంధ్రజ్యోతి, సకల







0 comments:
Post a Comment