Pages

Subscribe:

Ads 468x60px

Friday, 21 September 2012

యోగాతో మనోనిగ్రహం...

మనం ఊహించుకునే వస్తువు సన్మార్గం వైపునకు మళ్లించేదిగా ఉండాలి. అప్పుడు కాన్‌సన్‌ట్రేషన్ ద్వారా నిశ్చలమైన ఆలోచనలు కలుగుతాయి. కాన్‌సన్‌ట్రేషన్... సాధన ద్వారా సిద్ధిస్తుంది. దీనికి ఉపయోగపడే అంశాలు అగోచరంగా ఉంటాయి. అంటే కంటికి కనిపించవు. 

ధ్యానం చేయడానికి శరీరం, మనసు రెండూ సహకరించాలి. ముందుగా శరీరాన్ని భౌతికంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అలా ఉండాలంటే... వ్యాయాయం తప్పనిసరి. నిత్య వ్యాయామం వల్ల శరీర అవయవాలు, నాడులు, ఎముకలు అన్నీ సక్రమంగా పనిచేస్తాయి.
ఎప్పుడైతే శారీరక ఆరోగ్యం చేకూరుతుందో, దానితో మనిషిలో ఉత్సాహం, ఉత్తేజం బయలుదేరతాయి. మంచి మంచి ఆలోచనలు మెదడులోకి ప్రవేశిస్తాయి. మనసు మంచిపనుల వైపు ప్రయాణిస్తుంది. అలా చేకూరిన ఆరోగ్యంతో ధ్యానం ప్రారంభించాలి. ఆరోగ్యంగా లేకపోతే ధ్యానసాధన సాధ్యం కాదు.

కొన్నిరోజుల పాటు నిరంతరాయంగా, క్రమబద్ధంగా వ్యాయామం చేస్తూంటే, అంతవరకు ఉన్న భౌతిక, మానసిక అడ్డంకులన్నీ తొలగిపోతాయి. శరీరం మీద, మనసు మీద నియంత్రణ ఏర్పడుతుంది. అలా అన్నివిధాలుగా ఆరోగ్యం సహకరించిన తరవాత మాత్రమే యోగాభ్యాసం ప్రారంభించాలి. అప్పుడే మనసును ఏకీకరణ మీదకు మళ్లించడానికి అవకాశం ఏర్పడుతుంది.

యోగాభ్యాసం చేయడానికి కొన్ని మార్గాలు అవలంబించాలి... ముందుగా మనసును ఒక చిన్న చుక్క మీద కేంద్రీకరించడం అలవర్చుకోవాలి. అలా చేయడాన్ని కాన్‌సన్‌ట్రేషన్ అంటారని ‘యోగదర్శనం’ చెబుతోంది. చిన్నచుక్క అంటే గోడ మీద పెన్నుతో చుక్క పెట్టి దాని మీద దృష్టి పెట్టడం కాదు. చూడటానికి కావలసిన వస్తువును ఎవరికి కావలసినదానిని వారు ఎంచుకోవాలి. అది బయటకు కనిపించేది కావచ్చు, మనసులో ఊహించుకునేది కావచ్చు, పెద్ద వస్తువును చిన్నగా భావిస్తూ ఎంచుకోవచ్చు. వస్తువు మాత్రం మంచిని ప్రబోధించేదిగానే ఉండాలి. అది ఆబ్‌స్ట్రాక్ట్ (ఆధ్యాత్మిక), సటిల్ (అధిదైవిక), సెన్సరీ (అధిభౌతిక) వీటిలో ఏదైనా అయి ఉండాలి. 

మనసును ఒకే వస్తువు మీద కేంద్రీకరించడాన్ని కాన్‌టెంప్లేషన్ అంటారని ‘యోగదర్శనం’ చెబుతోంది. ఒక వస్తువు వంటిది ఏదీ లేకుండా కేవలం శూన్యం మీద మాత్రమే మనసును లగ్నం చేసి, ధ్యానం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, మనసును నిశ్చలంగా నిలపలేకపోతే వస్తువుతో ప్రయత్నించవచ్చు. అంటే భగవంతుని మూర్తి కాని, మనసుకు నచ్చిన ఏదైనా మంచి వస్తువును కాని ధ్యానం చేసే ప్రదేశంలో ఉంచితే, మనసును స్థిరంగా అదే వస్తువు మీద నిలపడానికి ఆస్కారం ఉంటుంది. అలా యోగసాధన ప్రారంభించాలి. నిలకడ మీద కాన్‌సన్‌ట్రేట్ చేసే సమయం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు సమాధిస్థితికి చేరుకోవచ్చు. ఇందుకు మనోనిగ్రహం అవసరం.

సేకరణ: సాక్షి
Enter your email address:

0 comments:

Post a Comment