లవంగాలను చైనీయులు వెక్కిళ్ల నివారణా ఔషధంగా ఉపయోగిస్తారు. అంతేగాకుండా వీటితో తామర లాంటి చర్మ సంబంధ వ్యాధులు. ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు బాగా తగ్గుతాయని వారు చెబుతుంటారు. లవంగ నూనెను పొట్టుపై రాస్తే జీర్ణ సంబంధ సమస్యలు దూరమవు తాయని మనదేశీయులు భావిస్తారు. పంటినొప్పిని నివారించటంలోనూ లవంగాలు కీలకపాత్ర పోషిస్తాయి.
గొంతునొప్పి, జలుబులను తగ్గించేందుకు లవంగాల కషాయం దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఉబ్బసం, దగ్గు, నులిపురుగులను తగ్గించేగుణం కూడా వీటికి మెండుగా ఉంది. వాంతి అవుతుందని అనిపిస్తుంటే.. నాలుగు చుక్కల లవంగ నూనెను ఓ గ్లాసు నీటిలో వేసి పుక్కిలిస్తే వాంతులు రావు. అలసటను,రుమాటిక్ నొప్పులను తగ్గించ టంలో కూడా లవంగాలు బాగా తోడ్పడతాయి. అలాగే లవంగాలతోపాటు యాలకులు కూడా దంత సంబంధ సమస్యలు తగ్గించి ఉపయోగపడతాయి. గొంతు ఇన్‌ఫెక్షన్‌ను నివారించటంలో కూడా యాలకులు బేషుగ్గా పనిచేస్తాయి. అంతే కాకుండా పొట్టనొప్పి, మలబద్ధకం తదితరాలకు యాలకులు చెక్ పెడతాయి.సేకరణ: విశాలాంధ్ర







0 comments:
Post a Comment