Pages

Subscribe:

Ads 468x60px

Wednesday, 19 September 2012

నెలసరి నొప్పి.. హోమియోతో దూరం!


ఈ రోజుల్లో చాలామంది స్ర్తిలలో బహిష్టు సమయంలో పొత్తికడుపు నొప్పి బాధిస్తుంది. ఇటువంటి నొప్పినే వైద్య పరిభాషలో డిస్మెనోరియా (పెయిన్‌ఫుల్ మెనె్సస్) అంటారు. బహిష్టు కనపడిన తర్వాత మొదటి రెండు మూడు సంవత్సరముల వరకూ బహిష్టు సమయంలో పొత్తికడుపు నొప్పిరావడం సాధారణంగా జరుగదు. డిస్మెనోరియాను ప్రధానంగా రెండు రకాలుగా చెప్పవచ్చును. మొదటిది ప్రైమరీ డిస్మెనోరియా, రెండవది సెకండరీ డిస్మెనోరియా. 


ప్రైమరీ డిస్మెనోరియా యుక్త వయస్సులోని స్ర్తిలలో ఎక్కువగా కనిపిస్తుంది. వీరికి బహిష్టు సమయంలో పొత్తికడుపు నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీనికి ముఖ్యంగా హార్మోనుల అసమతుల్యతే కారణం. సెకండరీ డిస్మెనోరియా వయస్సు మీరిన స్ర్తిలలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి గర్భాశయ కణుతులు, పెల్విక్ ఇన్‌ఫెక్షన్స్ ఉండటం కారణం.
అలాగే బహిష్టు సమయంలో కండరాల సంకోచంవల్ల, గర్భకోశ ముఖద్వారం వంగి ఉండటంవలన, ఓవేరియన్ సిస్టులవల్ల కూడా బహిష్టు సమయంలో కడుపునొప్పి ఎక్కువగా వస్తుంటుంది.

మానసిక ఒత్తిడి, హార్మోనుల అసమతుల్యత, గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్, జన్యులోపాలుఇవి ప్రధాన కారణాలు. హోమియో వైద్యంలో బహిష్టు సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పికి మంచి చికిత్స కలదు.
మందులు

మెగ్నిషియం ఫాస్, లేకసిస్, బెల్లడోనా, సెపియా, నైట్రోమోర్, కామామిల్లా, కాల్మియా, సెబైనా, ఎకోనైట్, కోలోసింత్, కాల్కేరియా కార్బ్ వంటి మందులను లక్షణాలను బట్టి ఎన్నుకొని వైద్యం చేసిన నెలసరి నొప్పి నుండి విముక్తి పొందవచ్చును.

డాక్టర్ పావుశెట్టి శ్రీ్ధర్
సెల్‌నెం. 9440229646
హోమియోఫిజిషియన్, అంజనా హోమియోక్లినిక్ ఇం.నెం. 7-1-62/1
శ్రీదేవి థియేటర్ వెనుక, బస్‌స్టాండురోడ్
హన్మకొండ, వరంగల్-506001
E-mail: drpsreedhar@ymail.com

సేకరణ: ఆంధ్రభూమి

0 comments:

Post a Comment