Pages

Subscribe:

Ads 468x60px

Friday, 21 September 2012

‘పాలిప్స్’కు హోమియో చికిత్స

మానవ శరీర నిర్మాణంలో మక్కుకు అత్యంత ప్రాధాన్యత వుంది. మనము నిత్యం శ్వాస తీసుకోవటం వదలటం ముక్కు ద్వారానే చేస్తుంటాము. ముక్కులో ఎటువంటి అడ్డంకి లేనంత వరకు ప్రతి ఒక్కరు శ్వాసను తేలికగా తీసుకోగలుగుతారు. కాని కొంతమందిలో ఇన్‌ఫెక్షన్స్, ఇతరత్రా కారణాలవల్ల ముక్కులోని మ్యూకస్ మెంబ్రేన్ ఉబ్బి కాయలాంటి నిర్మాణాలు ఏర్పడి ముక్కు శ్వాసకి అడ్డంకిగా మారుతున్నాయి. ఇటువంటి కాయల వంటి నిర్మాణాలనే వైద్యపరిభాషలో ‘పాలిప్స్’ అంటాము.
పాలిప్స్ ముక్కులో ఉండుట వలన ఊపిరిసరిగా ఆడకుండా ఉండి, ఏదో అడ్డుపడినట్టుగా ఉంటుంది. జలుబు అప్పుడప్పుడు చేయడం సహజం. అలా కాకుండా సంవత్సరం పొడవునా కాలంతో సంబంధం లేకుండా దీర్ఘకాలంగా జలుబుతో బాధపడేవారు ఎక్కువగా ‘పాలిప్స్’ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను సకాలంలో గుర్తించి హోమియో వైద్య చికిత్స తీసుకోవటంవలన పాలిప్ సమస్యను శస్తచ్రికిత్స లేకుండానే నివారించవచ్చును.

కారణాలు
  • తిరచుగా నాసల్ ఎలర్జీ ఇన్‌ఫెక్షన్, లేదావైరస్ బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ వలన, 
  • దిర్ఘకాలికంగా జలుబుతో బాధపడటంవలన
లక్షణాలు
  • మిక్కులోని సబ్‌మ్యూకోసా జిగురు పొరలు ఉబ్బి ముక్కులు దిబ్బడవేసి రాత్రి పడుకున్నప్పుడు ఊపిరాడకుండా ఉండును.
  • తిమ్మినప్పుడు కొన్ని సందర్భాలల్లో రక్తం పడుచుండును.
  • శ్విస సరిగా ఆడకపోవటంవలన నోటితోని గాలి తీసుకోవటంవలన గురకవచ్చును.
  • విసన తెలియకుండా ఉండును. పలుచని శ్రావాలు ముక్కునుండి కారుతుండును.
  • మిట ముక్కుతో మాట్లాడుతున్నట్లుగా ఉండును.
  • మిక్కులో మంట దురదగా ఉండటం.
  • శరీరం వేడిగా జ్వరంలాగా ఉండటం, గొంతులో నొప్పిగా ఉన్నట్లు అనిపించటం.
జాగ్రత్తలు
  • వ్యాధి ఆరంభంలోనే వైద్యుల దగ్గరకు వెళ్ళటంవలన పాలిప్స్ పెరగకుండా జాగ్రత్తపడవచ్చును.
  • శితల పానీయాలు, చల్లటి పదార్థాలు, ఫాస్ట్ఫుడ్స్, కేక్స్ మానివేయాలి.
  • దిమ్ము, ధూళి పరిసర ప్రాంతాలలోకి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ వెళ్ళవలసి వస్తే మార్కు తప్పనిసరిగా ధరించాలి.
  • సరిపడని పదార్థాలను గుర్తించి వాటిని కొద్ది రోజులు తినకుండా ఉండాలి.
  • వ్యిధి నిరోధక శక్తి పెరగటానికి పౌష్టికాహారం నిత్యం తీసుకోవాలి.
  • ప్రతిరోజు వ్యాయామం, బ్రీతింగ్ ఎక్స్‌ర్‌సైజులు చేయడం వలన వ్యాధి తీవ్రత తగ్గుతుంది.
చికిత్స
హోమియో వైద్యంలో పాలిప్స్‌కు మంచి చికిత్స కలదు. వ్యాధి లక్షణాలను మరియు వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులను ఎన్నుకొని వైద్యం చేసిన పాలిప్స్ నుండి విముక్తి పొందవచ్చు.
మందులు

ట్యూక్రియం మారంవీరం:
ముక్కులో కాయల వంటి నిర్మాణాలు ఉండి పురుగులు పాకుతున్నట్లుగా అనిపించును. ముక్కులు దిబ్బడ వేసి ఊపిరాడకుండా ఉండును. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.

లెమ్నామైనర్:
ముక్కులో కాయలు ఏర్పడి ముక్కు ఉబ్బి ఉండును. ముక్కునుండి నొప్పి చెవి వరకు వ్యాపించి ఉండును. శరీరం వేడిగా జ్వరంలాగా ఉండటం, గొంతులో నొప్పిగా ఉన్నట్లు అనిపించును. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు ప్రయోజనకారి.

తూజా:
ముక్కులో కాయలవంటి నిర్మాణాలుండి ఊపిరాడకుండా ఉండును. అలాగే తలనుండి తెల్లటి పొట్టు రాలుతూ, శరీరంపై ‘వార్ట్స్’ (పులిపిరికాయలు) ఉండి డెండ్రాఫ్‌తో బాధపడేవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.

కాలిబైక్రోమికం:
ముక్కులో పాలిప్స్ ఉబ్బి ఉండి ముక్కు పైభాగంలో తీవ్రమైన నొప్పి, ముక్కు పొడి ఆరిపోయి ఉంటుంది. ముక్కునుండి చిక్కని జిగురుతోకూడిన స్రావాలు, తీగలుగా సాగుతుంటాయి. స్రావం తెల్లగా, పసుపుగా, ఆకుపచ్చగా కారుతుంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు ప్రధానమైనది.

ఈ మందులే కాకుండా కాల్కేరియాఫోర్, టుబర్కులినం, ఫెర్రంఫాస్, కాలిమోర్, లేకసిస్, కాల్కేరియా కార్బ్, సల్ఫర్ వంటి కొన్ని మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి డాక్టర్ సలహా మేరకు వాడుకుని ‘పాలిప్స్’ బాధనుండి ఉపశమనం పొందవచ్చును.

సేకరణ: ఆంధ్రభూమి, సంజీవిని


Enter your email address:

0 comments:

Post a Comment