Pages

Subscribe:

Ads 468x60px

Wednesday, 19 September 2012

శరీరతత్వం తెలుసుకోవడం ఎలా..?

ఒక ఇంట్లో నలుగురుంటే వారందరూ ఒకేలా ఆహారం తీసుకొన్నా సరే వారిలో ఒక సన్నగాను, మరొకరు ఊబకాయం కలవారిగాను, ఒకరు రోగాలతోనూ, మరొకరు ఆరోగ్యంగాను ఇలా రకరకాలుగా ఉంటుంటారు. దీనికి కారణం ఏది అనుకొంటున్నారా? అయతే దీనికి సమాధానం చెప్పగలిగింది ఒక్క ఆయుర్వేదమేనని ఆయుర్వేద నిపుణులు అంటారు.

ఆయుర్వేదంలో మనుషుల శరీర తత్వాలను మూడు రకాలుగా విభజించారు. వాతప్రకృతి, పిత్త ప్రకృతి, కఫప్రకృతులు. ఇవి మనో శారీరక విధులను నిర్వర్తించే అంతర్గత శక్తులు. అందరిలోనూ ఉంటాయి.
అయితే, వీటిల్లో ఏది బలీయంగా ఉంటుందో అది వారి శరీర తత్వమవుతుంది. ఎవరిది ఏరకమైన తత్వమనేది తెలుసుకోవడానికి ఒక తేలికపాటి పద్ధతి ఉంది. రంగులను ప్రాతిపదికగా తీసుకోవటం! ఉదాహరణకు, వాతం అనేది పసుపురంగును, పిత్తం అనేది ఎరుపు రంగును, కఫం అనేది ఆకుపచ్చ రంగునూ సూచిస్తాయి. ముందుగా మీ శరీర తత్వాన్ని తెలుసుకొని, దానికి అనుగుణమైన రంగుల ఆహారాన్ని తీసుకుంటే కేవలం మీకు మాత్రమే వచ్చే అవకాశం ఉన్న అనేక శారీరక మానసిక సమస్యలను ముందుగానే పసిగట్టి నివారించుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు.

ముందుగా పసుపురంగును గూర్చి తెలుసుకుందామా-
ఈ పసుపురంగు వాతాన్ని కలిగించేది అని అంటారు అదిఎంత వరకు నిజమో తెలుసుకొందాం.
లక్షణాలు: వాతం అంటే గాలి లేదా చలనం. వాత ప్రకృతి మనుషులు మార్పులను ఆహ్వానిస్తారు. గతిశీలకులు. గానిగెద్దుజీవితాన్ని ఇష్టపడరు. కల్పానికులు, సృష్టించే సత్తా కలిగినవారు. దేనినైనా త్వరగా నేర్చేసుకుంటారు. అయితే అంతలోనే మర్చిపోతారు. భయాందోళనలు ఎక్కవ. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతారు. ఒకవేళ మధ్యలో మేల్కొంటే మరి నిద్రపోలేరు. ఎంత తిన్నప్పటికీ ఒళ్లు చేయరు. ఎముకలు తేలి కనబడతారు. ఆకలి కూడా ఒక క్రమంలో ఉండదు. ఒక్కోసారి రోజుకు నాలుగైదుసార్లు తింటే మరికొన్నిసార్లు అసలు తినడమే మర్చిపోతారు. చర్మం, వెంట్రుకలు, గోళ్లు అన్నీ తడారిపోయి పొడిగా కనిపిస్తాయి. చలివాతావరణంలో చర్మం పగులుతుంది. చుట్టుప్రక్కల వేడి వాతావరణం ఉన్నప్పటికీ కాళ్లు చేతులు చల్లగా ఉంటాయి.

ఇక్కట్లు: వాతప్రకృతి మనుషులను ఎక్కువగా మలబద్ధకం చికాకు పెడుతుంటుంది. పొట్ట ఉబ్బరింపుతో ఇబ్బంది పడుతుంటారు. శరీరం తడారి ఉంటుంది కాబట్టి చల్లగా, పొడిగా ఉండే ఆహారాలు సహించవు. ఎలర్జీలు ఎక్కువ. మలబద్ధకంవల్ల కణజాలాలు విడుదల చేసే మలినాలు రక్తంలోనికి చేరి శ్వాసకోశ సమస్యలను, చర్మ సంబంధ సమస్యలను కలిగిస్తాయి. పిక్కలు పట్టేయడం, నరాలు గుంజటాలు ఎక్కువ. అయోమయం ఆవహిస్తుంది. చెవుల్లో గుయ్ మనే శబ్దాలు ఇబ్బంది పెడుతుంటాయి. భుజం, మెడ, నడుము ఇతర జాయింట్ల నొప్పులు బాధిస్తుంటాయి.
ఆహార సూచనలు: వీరి ఆహారంలో 34 శాతం పసుపు రంగులో ఉన్న ఆహారం ఉండాలి. తీసుకునే ఆహారంలో 3 శాతం తృణధాన్యాలు, పప్పుదినుసులు ఉండాలి. 33 శాతం మాంహాసారం, చేపలు, నూనెలు వాడాలి. ఆహారం క్రమం తప్పకుండా, తగిన విరామంతో తీసుకోవాలి. వేడి సూప్‌లు, పాలు తగినంతగా తీసుకోవాలి.

చల్లని ఆహార పదార్థాలు, చేదు వగరు రుచులు వీరికి సరిపడవు. వీరికి తగిన ఆహార రుచులు ఉప్పు, తీపి, పులుపులు. ఉప్పు చేపలు ఇంకా సముద్రంలో దొరికే చేపలు ఇవన్నీ వీరికి హితవు చేస్తాయి. పులుపు ఆహారం జీర్ణశక్తిని పెంచుతుంది. ద్రాక్ష, కమలాలు, దానిమ్మ, మామిడి, బొప్పాయి, యాపిల్, అరటి, నిమ్మ, నారింజ, జామ, చెర్రి, అత్తిపళ్లు, అప్రికాట్ మొదలైన పళ్లు వాతప్రకృతి మనుషులకు మంచిది. కూరగాయల విషయానికి వస్తే గుమ్మడి, క్యారెట్, పచ్చిమిర్చి, పుట్టగొడుగులు, ఉల్లిపాయ, బంగాళాదుంపలు, మొలకెత్తిన గింజలు, వెల్లుల్లి, క్యాబేజి, బచ్చలికూర మొదలైనవన్నీ మేలు చేస్తాయి.

Enter your email address:

0 comments:

Post a Comment