Pages

Subscribe:

Ads 468x60px

Monday, 17 June 2013

సర్వేద్రియానం నయనం ప్రధానం


ఒకప్పుడు, 50, 60 ఏళ్ల వయస్సులో ఉన్నవారు మాత్రమే కళ్లజోళ్లు పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు పిల్లలు కూడా కళ్లజోళ్లతో స్కూలుకెళ్లడం మనం చూస్తున్నాం. మన అస్థవ్యస్థమైన జీవనశైలి వల్లే అనారోగ్యాలు మనల్ని చుట్టుముడుతున్నాయి. అన్ని అవయవాలు వీటి బారినపడతున్నాయి. అందులో కళ్లుకూడా ఉన్నాయి. మన చూపు బలహీనమవడానికి మనమే కారణమవుతున్నాం. మెరుగైన చూపుకు మనం ఏం చేయాలో తెలుసుకుందాం....

చేపల ఆహారం
మీరు తీసుకునే ఆహారంలో వారానికోసారి చేపలను కలిపితే 'డ్రై-ఐ సిండ్రోం' కళ్లు పొడిబారే రుగ్మతను నివారించే వీలుంది. ఎందుకంటే చేపల్లో సహజసిద్ధమైన ఓమెగా 3 ఫ్యాటీ ఆసిడ్లు ఉంటాయి.

కంటి పరీక్ష
చూపు బాగున్నా, బాగానే చదువగలుగుతున్నా ఏడాదికోసారైనా కంటి పరీక్షలు చేయిం చుకోవాలి. దీనివల్ల ఏదైనా సమస్య ఉంటే తెలు స్తుంది. కంటికి సంబంధించిన అనారోగ్యాలను ముందుగా తెలుసు కునే అవకాశం ఉంది. జబ్బులు ముదర కుండా నివారించడమే కాకుండా తొలిదశలోనే చికిత్స చేయడం సులభమవుతుంది.

కళ్లు మిటకరించాలి
నిరంతరం కళ్లు మిటకరించడం (బ్లింకింగ్‌) వల్ల కళ్లు తాజాగా ఉంటాయి. అంతేకాదు కళ్లపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. కానీ కంప్యూటర్‌ ముందు కూర్చుని పనిచేసేటప్పుడు తీక్షణంగా కనురెప్పలు కదల్చకుండా ఉంటాం. దీనివల్ల కళ్లు ఎండిపోయి, కళ్ల మంటలు వస్తాయి. కంప్యూటర్‌ను వినియోగించేవాళ్లు చాలా తక్కువసార్లు కళ్లు మిటకరిస్తారు. ప్రతీ మూడు నుంచి నాలుగు సెకన్లకోసారి కళ్లు మిటకరించాలి.

రిలాక్సేషన్‌ వ్యాయామం

రిలాక్సేషన్‌ వ్యాయామం చేయాలి. అంటే రెండు చేతులను దగ్గరికి తీసుకుని, రెండు అరచేతులను రుద్దుకోవడంవల్ల కొంత వేడిపుడుతుంది. ఆ వేడి చేతులను కళ్లపై పెట్టడంవల్ల కళ్ల ఒత్తిడిని తగ్గించే అవకాశముంది. కళ్లు రిలాక్స్‌ అవడానికి ఇంకోపద్ధతి ఉంది. కొన్ని క్షణాలు కళ్లు మూసుకుని మీకిష్టమైన ప్రదేశాన్ని, బట్టలను, వస్తువులను ఊహించుకోవాలి.

దూరపు వస్తువులపై దృష్టి
రోజులో మనం చాలా సమయం దగ్గర ఉన్న వస్తువులనే చూస్తుంటాం. కానీ దూరంగా ఉన్న వస్తువులను, దృశ్యాలను చూడటం అలవాటు చేసుకోవాలి. నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు దూరదృశ్యాలు చూడండి. ఫలితం మీకే కనిపిస్తుంది.

సూర్యరశ్మిని చూడండి
నగరాల్లో ఉన్నవారు సూర్యోద యాన్ని చూడడటం చాలావరకూ అరుదు గానే జరుగుతుంది. ఇంటి నుంచి బస్టాప్‌ కు, అక్కడి నుంచి ఆఫీసుకు, రోజంతా ఆఫీసులోనే ఉండటం, మళ్లీ సాయంత్రం ఇంటికెళ్లడం.. ఇది రోజువారీ కార్యక్రమం. దీనివల్ల సూర్యరశ్మి మన చర్మంపైనే కాదు, కళ్లపైనా పడటం లేదు. సూర్యరశ్మి కంటికి అందించే ఉచిత, మెరుగైన చికిత్స వంటిది. ఉదయం సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమయాలను చూడటంవల్ల కళ్లు, కంటిపాప మెరుగవుతాయి. గట్టిపడ్డ కంటినాడులు వదులవుతాయి.

మసక చూపుకు నీళ్లు
అన్నికంటే కంటి సమస్యలకు నీళ్లు మెరుగైన నివారణగా పనిచేస్తాయి. డీహైడ్రేషన్‌వల్ల కళ్లు మసక బారతాయి. అందుకని మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నీళ్లను ఎక్కువసార్లు తాగాలి.

పొడిగాలి
ఆఫీసులో ఏసి ఉంటే ఎంత హాయిగా ఉంటుందో అనుకుంటాం. కానీ ఏసి మన కళ్లను పొడిబారేలా చేస్తుంది. ఆఫీసులో, కారులో ఉన్నప్పుడు ఏసి ఆన్‌ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే కళ్లలోని తేమనంతా ఏసిలు పీల్చేస్తాయి. ఒకవేళ ఏసి ఆన్‌చేస్తే గాలి మీ ముఖంవైపు కాకుండా, కిందివైపుకు పెట్టు కోవాలి. ఏసికి ముఖాన్ని దూరంగా ఉంచుకోవాలి. ఏసి నుంచి వచ్చే చల్లటిగాలి తీవ్రంగా కళ్లు పొడి బారడానికి కారణమవుతుంది. దీనివల్ల అంధత్వం లేదా కార్నియా జబ్బు వచ్చే అవకాశముంది. 

సేకరణ: ప్రజాశక్తి, జీవన

0 comments:

Post a Comment