వ్యాయాయం ఫిట్‌నెస్ యుగం ఇది. ఉదయాన్నే వాకింగ్, జాగింగ్ లేదా కాసేపు షటిల్ ఆడటం అలా వీలుకాకపోతే థ్రెడ్‌మిల్ మీద ఓ గంట పరిగెట్టడం వంటివి చేస్తూ నాజూకుగా వుండేందుకు అన్ని వయసుల వారూ ప్రయత్నిస్తున్న కాలం ఇది. కొందరు ఫిట్‌నెస్ పేరుతో ఇంటినే జిమ్‌గా మార్చేస్తారు. నిజానికి అంత హంగామా అవసరం లేదు. ఎలాంటి పరికరాలు లేకుండానే ఇంట్లోనే వ్యాయామం చేయవచ్చంటున్నారు నిపుణులు. ఇంట్లోనే మ్యూజిక్ వింటూ, టీవీ చూస్తూనే రకరకాల వ్యాయామాలు చేయవచ్చంటున్న ఎక్స్‌పర్ట్స్ మాటలు విందాం రండి.
వాకింగ్ : వాతావరణం అనుకూలంగా ఉంటే ఇంటి సమీపంలోనే రోడ్డుపై వాకింగ్‌కు వెళ్లవచ్చు. వర్షం కురుస్తున్నా, వాతావరణం అనుకూలించకున్నా, ఇంట్లోనే టెర్రస్‌పైకెక్కి ఓ పది రౌండ్లు కొట్టండి. దీనివల్ల మీ శరీరానికి మంచి వ్యాయామం అవుతుంది. దీనివల్ల 3.0 కేలరీల శక్తి బర్న్ అవుతుంది.
జంపింగ్ : మీరు చిన్నతనంలో చేసిన జంపింగ్‌లను గుర్తుకు తెచ్చుకోండి. ఇంట్లోనే జంపింగ్‌లు చేయండి. తాడు సాయంతో స్కిప్పింగ్ చేయండి. ఆహ్లాదంతోపాటు సంతోషం మీ సొంతమవుతుంది. ఇలా జంపింగ్ ఎక్స్‌ర్‌సైజ్ చేయడం వల్ల మీ గుండె పదిలంగా ఉంటుంది.
పుష్అప్స్ : పుష్అప్స్ చేయడం చాలామందికి ఇష్టం వుండదు. అంత కష్టమైన బస్కీలు తీసి మేం ఏమైనా కండలు పెంచాలా అనుకుంటారు. కానీ ఈ వ్యాయామం వల్ల మీ శరీరంలోని మజిల్స్ చురుకుగా మారుతాయి. మీ ఇంటి గోడ వద్ద ఒక స్తంభాన్ని పట్టుకొని పుష్అప్స్ చేయండి చాలు. సేటపుడు మీ కాళ్లను నిటారుగా ఉంచటం మరువకండి.
లెగ్ లిఫ్ట్స్ : మీరు టెర్రస్‌పై లేదా హాలులో కింద పడుకొని కాళ్లను పైకెత్తి వ్యాయామం చేయడం వల్ల మీ కాళ్లతోపాటు నడుము కండరాలు బలోపేతమవుతాయి.
జాగింగ్ ఇన్ ప్లేస్ : జాగింగ్ మీ గుండె రక్షణకు గొప్ప వ్యాయామం. ఇంట్లోనే హాలులో టీవీ చూస్తూ లేదా టెర్రస్‌పై మ్యూజిక్ వింటూ జాగింగ్ చేయవచ్చు. కేవలం దీనికి కావాల్సింది మీ కాళ్లకు రక్షణగా మంచి నాణ్యత గల షూ ఒక్కటే.
కూర్చొవటం, నిలబడటం : మీరు రోజూ కూర్చొనే కుర్చీలో కూర్చోవడం, లేవటం ఇలా కొన్ని సార్లు చేయడం కూడా కాళ్లు, నడుముకు మంచి వ్యాయామం అవుతుంది. మొదట్లో కొంచెం కష్టమనిపించినా రోజూ చేయడం వల్ల అలవాటు పడుతుంది.
లైట్ వెయిట్ లిఫ్టింగ్ : ఈ వ్యాయామం చేయడానికి ఎలాంటి డంబుల్స్ కొననవసరం లేదు. ఇంట్లో ఉన్న మిల్క్ జగ్ లేదా వాటర్ జగ్ కావచ్చు ఏదైనా లైట్‌వెయిట్ ఉన్న ఏదైనా ఇంట్లోని వస్తువును పైకెత్తి కిందకు దింపుతుండటం కూడా మంచి వ్యాయామం అవుతుంది.
డ్యాన్సింగ్ : మీకు ఇష్టమైన పాటకు లయబద్ధంగా నృత్యం చేయడం కూడా గొప్ప వ్యాయామమే. డ్యాన్స్ చేయడం మీ గుండె పదిలంగా ఉండేందుకు ఉపకరిస్తుంది. నృత్యం చేయడం వల్ల మీకున్న అలసట తగ్గి ఆహ్లాదాన్ని పొందవచ్చు.
స్టెప్ ఎక్స్‌ర్‌సైజ్ : మీ ఇంట్లోని మెట్లను ఎక్కి, దిగుతుండటం కూడా మంచి ఎక్స్‌ర్‌సైజ్. మెట్లు ఎక్కి, దిగుతున్నపుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. మీరు జిమ్‌లో చేరనక్కరలేదు. డబ్బు కట్టి ఎలాంటి క్లబ్‌హౌస్‌లలో మెంబర్‌షిప్ తీసుకోనక్కరలేదు.
విలువైన వ్యాయామ పరికరాలు కొననక్కరలేదు. మీ ఇంట్లోనే ఉదయం లేదా సాయంత్రం కొంత సమయాన్ని కేటాయించి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఫిట్‌నెస్ మీ సొంతమతుందనేది నిపుణుల మాట. ఇంకెందుకు ఆలస్యం. ఈ రోజు నుంచే ఇంట్లోనే వ్యాయామం మొదలుపెట్టండి.
సేకరణ: ఆంధ్రజ్యోతి, సకల







0 comments:
Post a Comment