Pages

Subscribe:

Ads 468x60px

Thursday, 20 June 2013

వాజీకరణ ఔషధాలతో సంతాన సాఫల్యం

సంతానలేమితో బాధపడుతున్న దంపతుల మానసిక వేదన వర్ణనాతీతం. సంతానసాఫల్యం కోసం తిరగని ఆసుపత్రి, చేయించని పరీక్షలంటూ ఉండదు. కానీ ఆధునికవైద్యంలో పరిష్కారం లభించని సమస్యలకు ఆయుర్వేద వైద్యవిధానం పరిష్కారం చూపుతోంది. సంతానలేమితో బాధపడుతున్న దంపతులు ఆయుర్వేద చికిత్స తీసుకుంటే సంతానం కలిగే అవకాశాలు మెరుగవుతాయని అంటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, సెక్సాలజిస్ట్ డాక్టర్ ఎం. నరసింహ.

 సంతానలేమి సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ సమస్యతో 15 నుంచి 20 శాతం మంది బాధపడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. భార్యాభర్తలు ఎలాంటి గర్భనిరోధకాలు వాడకుండా ఏడాదిపాటు శృంగారంలో పాల్గొన్నప్పటికీ సంతానం కలగనట్లయితే సంతానలేమిగా గుర్తించాలి.

సంతానలేమికి కారణాలు
పురుషుల్లో ప్రధానంగా వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటం లేదా పూర్తిగా లేకపోవడం, ఒకవేళ ఉన్నా కదలికలు తక్కువగా ఉండటం, వీర్యకణాల స్వరూపం సరిగ్గా లేకపోవడం వంటి లోపాలు సంతానలేమికి కారణమవుతుంటాయి. మానసిక ఆందోళన, పొగతాగడం, మధ్యంసేవించడం, హార్మోన్లలో లోపాలు, గవదబిళ్లలు, వెరికోసీల్, సుఖవ్యాధులు, వాతావరణకాలుష్యం, అధికబరువు, డయాబెటిస్, అంగస్తంభన సమస్యలు సంతానలేమిని తెచ్చిపెడతాయి. స్త్రీలలో పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, అండం సరిగ్గా విడుదల కాకపోవడం,
పిసిఓడి, ఎండోమెట్రియాసిస్, ఫైబ్రాయిడ్స్, ట్యూబులు మూసుకునిపోవడం, హార్మోన్ల లోపాలు మొదలగునవి సంతానలేమికి కారణమవుతుంటాయి. మానసిక ఆందోళన, అధికబరువు, క్షయ, సుఖవ్యాధులు మొదలగునవి ప్రధాన కారణాలుగా ఉంటాయి.

చేయించాల్సిన పరీక్షలు
సంతానలేమికి కారణాలు తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు అవసరమవుతాయి. పురుషుల్లో సమస్యను గుర్తించడానికి వీర్యపరీక్ష, హార్మోన్ల పరీక్ష, స్క్రోటల్ డాప్లర్‌స్టడీ వంటి పరీక్షలు ఎంతో ఉపయోగపడతాయి. స్త్రీలలో హార్మోన్ల పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్, హెచ్ఎస్‌జి, లాప్రోస్కోపీ వంటి పరీక్షల ద్వారా సమస్యను గుర్తించవచ్చు. పురుషుల్లో సాధారణంగా వీర్యకణాల సంఖ్య 40 నుంచి 120 మిలియన్లు ఉండాలి. వీర్యకణాలలో మొటిలిటి 50 శాతం వరకు, స్వరూపం బాగున్నవి 60 శాతం వరకు ఉండాలి. వీర్యకణాల ఉత్పత్తికి సగటున 84 రోజుల నుంచి 88 రోజుల వరకు సమయం పడుతుంది.

ఆయుర్వేద చికిత్స
ఆయుర్వేదంలో సంతానలేమిని వంధ్యత్వంగా పిలుస్తారు. సంతానలేమి సమస్యను చక్కదిద్దడానికి ఆయుర్వేదంలో ఎన్నో ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. పీరియడ్స్ సమస్యలతో బాధపడుతున్న స్త్రీలకు, అండం విడుదలలో లోపాలకు, ట్యూబ్స్‌లో బ్లాక్స్ ఉన్నప్పుడు, మాటిమాటికి అబార్షన్ అవుతున్నప్పుడు ఆయుర్వేదంలో చెప్పబడిన అనువాసనవస్తి, ఉత్తరవస్తి వంటి శోధన చికిత్సలు చేసి మందులు వాడినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. పురుషుల్లో లోపం ఉన్నట్లయితే పంచకర్మ చికిత్సలు చేసి వాజీకరణ ఔషధాలు వాడినట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి.

కొందరిలో వీర్యకణాల సంఖ్య పూర్తిగా ఉండదు. ఉన్నా సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కణాలలో కదలిక ఉండదు. స్త్రీలలో ట్యూబ్స్ పూర్తిగా మూసుకుపోయి ఉంటాయి. ఇటువంటి సమయంలో ఆధునిక వైద్యంలో చెప్పబడిన ఐవిఎఫ్, ఐసిఎస్ఐ వంటి కృత్రిమ పద్ధతుల ద్వారా సంతానభాగ్యాన్ని పొందే అవకాశం ఉంది. మధ్యతరగతి ప్రజలు సైతం ఈ చికిత్సను తీసుకునేలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఇలాంటి చికిత్సలతో పాటు ఆయుర్వేదంలో ఎన్నో మంచి మందులు అందుబాటులో ఉండటం మూలంగా సంతానం పొందడం సులభమవుతోంది. పైగా ఈ మందులతో ఎటువంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు.

ఆపరేషన్ లేకుండా వెరికోసిల్ సమస్య పరిష్కారం
వెరికోసిల్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్న పురుషులకు ఎలాంటి ఆపరేషన్ లేకుండా ఆయుర్వేద మందులతో తగ్గించడం సాధ్యమవుతోంది. పిీసీఓడి సమస్యను కూడా ఆయుర్వేద మందులతో తగ్గించుకోవచ్చు. వీర్యకణాలు పూర్తిగాలేని వారికి అంటే అజోస్పెర్మియా సమస్యకు ఇతర వైద్యవిధానాలలో మంచి ఫలితాలను ఇచ్చే మందులు లేవనే చెప్పవచ్చు.

కానీ ఆయుర్వేదంలో ఈ సమస్యకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. భార్యాభర్తలు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సున్నప్పుడే సంతానం కోసం ప్రయత్నించాలి. స్త్రీలు 35 ఏళ్లు నిండినతరువాత సంతానం కోసం ప్రయత్నిస్తే పిండం గర్భాశయంలో కాకుండా ట్యూబుల్లో పెరగడం, అధిక రక్తస్రావం, అధికరక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సంతానలేమి సమస్య ఉన్నప్పుడు అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యనిపుణులను కలిసి చికిత్స తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. సంతానలేమి సమస్య తొలగిపోతుంది.

డాక్టర్ ఎం. నరసింహ
ఎం.డి (ఆయుర్వేద), సెక్సాలజిస్ట్
యస్.బి. స్పెషాలిటీ క్లినిక్
హైదరాబాద్, విజయవాడ,తిరుపతి
ఫోన్స్ : 924656 4433
939656 4433

సేకరణ: ఆంధ్రజ్యోతి, సకల

0 comments:

Post a Comment