ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతోమంది అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిలో గర్భాశయ సమస్యలూ ఉన్నాయి. గర్భాశయ సమస్యల్లో ఇప్పుడు ప్రస్తావించాల్సిన విషయం కణుతుల గురించి. గర్భాశయంలో కణుతులు ఏర్పడటం వల్ల స్త్రీలు మరిన్ని అనారోగ్య సమస్యలకు గురవడమే కాకుండా, మానసికంగానూ కుంగిపోతున్నారు. నిజానికి గర్భాశయ కణుతులను క్యాన్సర్ గడ్డలుగా పొరపాటు పడుతున్నవారు కూడా చాలామంది ఉన్నారు.
అయితే సంతాన లేమికి కూడా దారి తీసే ఈ యూట్రిన్ ఫైబ్రాయిడ్స్ గురించి సరైన అవగాహన ఉండటం అవసరం. అంతేకాదు, గర్భాశయంలో కణుతులకు హోమియో వైద్యమే సరైనదని అంటున్నారు ప్రముఖ హోమియో వైద్యనిపుణురాలు డాక్టర్ వాణి రవికిరణ్.
అయితే సంతాన లేమికి కూడా దారి తీసే ఈ యూట్రిన్ ఫైబ్రాయిడ్స్ గురించి సరైన అవగాహన ఉండటం అవసరం. అంతేకాదు, గర్భాశయంలో కణుతులకు హోమియో వైద్యమే సరైనదని అంటున్నారు ప్రముఖ హోమియో వైద్యనిపుణురాలు డాక్టర్ వాణి రవికిరణ్.
గర్భాశయంలో కణితి..దీన్ని యూట్రిస్ ఫైబ్రాయిడ్ అంటారు. చాలామంది వీటిని క్యాన్సర్ కణుతులుగా భ్రమపడి భయపడుతుంటారు. కానీ, 70-80 శాతం వరకు అవి క్యాన్సర్ కణుతులు కావు. ఇవి స్త్రీ గర్భాశయంలో ఒకటి రెండు గానీ, అంతకు మించి గానీ అంటే..ఎన్నైనా ఏర్పడవచ్చు. ఒక సంఖ్య అంటూ చెప్పలేం. స్త్రీలలో ముఖ్యంగా మధ్య వయసు వారిలో అంటే రీ ప్రొడక్షన్ ఏజ్ అయిన ఇరవై ఐదు నుంచి నలభై సంవత్సరాల వయసులో ఈ సమస్య ఏర్పడటం గమనించవచ్చు.
లక్షణాలు:
ఈ గర్భాశయ కణుతుల లక్షణాలు ఎలా ఉంటాయి? వాటిని ఎలా గుర్తించాలి? ఇలాంటి సందేహాలకు కచ్చితమైన సమాధానం దొరకదు. గర్భాశయ కణుతులు చాలా వరకు చిన్నవిగా ఉంటాయి. అందువల్ల తొందరగా గుర్తించడానికి గానీ, వాటి లక్షణాలు తెలుసుకోవడానికి గానీ అవకాశం ఉండదు. పైగా గర్భాశయ కణుతులకు సంబంధించిన లక్షణాలు అంత త్వరగా ప్రభావం చూపించవు. అందుకే గర్భాశయ కణుతులు సాధారణంగా రెగ్యులర్ చెకప్‌లోనే బయటపడుతుంటాయి. అయితే కణుతుల్లో క్రమంగా పెరుగుదల కనిపిస్తుంది. ఎప్పుడైతే పెరుగుతాయో ఆ స్త్రీలలో నెలసరి ఎక్కువ రోజులు అవడం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో నొప్పిగా ఉండటం, శృంగారంలో పాల్గొన్నప్పుడు నొప్పి ఎక్కువ అవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అంతేకాదు, మూత్రాన్ని ఆపుకోలేకపోవడం, ఎక్కువసార్లు యూరిన్‌కు వెళ్లడం జరుగుతుంటుంది. ఇరవై నుంచి ముప్ఫయ్ శాతం కేసుల్లో గర్భాశయ కణితులు సంతానలేమికి దారితీయవచ్చు. ఈ గర్భాశయ కణుతుల వల్ల అబార్షన్ అయ్యే అవకాశమూ ఎక్కువగానే ఉంది. ఇది మాత్రమే కాదు, నడుం నొప్పి వస్తుండటం, మలబద్ధకం ఏర్పడటం వంటి ఇతర సమస్యలు కూడా మొదలవుతాయి.
రకాలు:
గర్భాశయంలో ఈ కణుతులు ఉండే ప్రదేశాన్ని బట్టి వాటి లక్షణాలుంటాయి. ముఖ్యంగా ఇవి నాలుగు రకాలుగా ఉంటాయి. అంటే కణుతులు ఉండే నాలుగు ప్రదేశాలను బట్టి వాటికో పేరు ఉంటుంది.
ఇంట్రామ్యురల్ ఫైబ్రాయిడ్స్: ఇవి గర్భాశయం గోడలలో ఏర్పడతాయి. ముఖ్యంగా కండర పొరలో ఉంటాయి. సాధారణంగా కనిపించే గర్భాశయ కణుతుల్లో ఈ రకం కణుతులే ఎక్కువ.
సబ్‌సెరోజల్ ఫైబ్రాయిడ్స్: ఈ రకం కణుతులు గర్భాశయపు ఉపరితలంలో మ్యూకోజా పొర కింది భాగంలో ఏర్పడుతాయి. వెలుపలి వైపు పెరిగి పెడామ్యులేటెడ్ ఫైబ్రాయిడ్స్‌గా మారుతాయి.
సబ్ మ్యూకోజల్ ఫైబ్రాయిడ్: ఇవి గర్భాశయ ఎండోమెట్రియల్ పొర కింది భాగంలో ఉంటాయి. ఇవి చిన్నగా ఉన్నప్పటికీ వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువసార్లు అబార్షన్‌కు దారి తీసి సంతానలేమికి గురిచేసే ప్రమాదమూ కలిగిస్తాయి.
సర్వైకల్ ఫైబ్రాయిడ్: గర్భాశయంలోని సెర్విక్స్ ప్రాంతం(మెడ)లో ఈ కణుతులు ఏర్పడతాయి. వీరిలో ఎక్కువగా బ్లీడింగ్ అవడం వలన సిజేరియన్ సెక్షన్ అవసరం అవుతుంది.
పరీక్షలు:
పైన చెప్పిన లక్షణాలను బట్టి, గైనకాలజిక్ అల్ట్రా సొనొగ్రఫీ, కణుతుల సైజ్ ఉన్న ప్రాంతాన్ని కనుక్కోవడానికి ఎంఆర్ఐ పరీక్ష నిర్వహిస్తారు.
హిస్టరెక్టమీ చేయడం వలన స్త్రీలు ఆర్టిఫిషియల్ మెనోపాజ్ సిండ్రోమ్‌కు గురవడం జరుగుతుంటుంది. ఆ తరువాత హాట్ ఫ్లాషెస్, డిప్రెషన్, స్త్రీత్వాన్ని కోల్పోవడం, ఎముకల్లో సాంద్రత తగ్గడం వంటి లక్షణాలను గమనించవచ్చు.
హోమియో చికిత్స
ఈ గర్భాశయ కణుతుల సమస్య నుంచి బయటపడటానికి హోమియో చికిత్స ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ హోమియో చికిత్స వల్ల ఫైబ్రాయిడ్ సైజ్ పెరగకుండా చేయవచ్చు. అదొక్కటే కాదు, గర్భాశయంలో కొత్తగా కణుతులు ఏర్పడకుండా చేసి హిస్టెరెక్టమీ అవసరం లేకుండా చేయవచ్చు. హోమియోలో చాలా రకాల మందులున్నాయి. మెడోరినమ్, తుజ, సైలీసియా, హెపర్‌సల్ఫ్, లాకెసిస్, కల్కెరియా, మిరిస్టికా, ఫాస్పరస్. అయితే ఇవన్నీ అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్ పర్యవేక్షణలో వాడితేనే మంచిది.
డాక్టర్ వాణి రవికిరణ్
ప్రముఖ హోమియో వైద్యనిపుణురాలు
మాస్టర్స్ హోమియోపతి
అమీర్‌పేట్, కూకట్‌పల్లి, హైదరాబాద్, విజయవాడ
ఫోన్ : 7842 106 106, 9032 106
సేకరణ: ఆంధ్రజ్యోతి, సకల







0 comments:
Post a Comment