Pages

Subscribe:

Ads 468x60px

Sunday, 11 August 2013

థైరాయిడ్ సమతుల్యతతో స్సాండిలైటిస్ నుంచి విముక్తి

జన్యుపరమైన లోపాలకు మానసిక, శారీరక ఒత్తిళ్లు తోడైతే రోగనిరోధక వ్యవస్థ పనితీరుపై ప్రభావం పడుతుంది. దీనివల్ల మానవుడు వివిధ రకాల అనారోగ్యాలకు గురవుతున్నాడు. థైరాయిడ్ గ్రంధి అసమతుల్యత వల్ల స్పాండి లైటిస్ సమస్య తలెత్తవచ్చు. హోమియో వైద్యంతో థైరాయిడ్ సమతుల్యత వల్ల స్పాండిలైటిస్ సమస్య నుంచి విముక్తి కల్పించవచ్చంటున్నారు ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డాక్టర్ శ్రీకర్ మను.
నేటి ఆధునిక కాలంలో స్పాండిలైటిస్‌తో సతమతమయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరుగోతంది. స్పాండిలైటిస్ నొప్పి నుంచి తాత్కాలిక ఉపశమనం పొందడానికి ప్రయత్నించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభించడం లేదు. కొంతమంది పూర్తిగా మంచం పట్టడానికి కారణమవుతుంది. పైపూతలతో తాత్కాలిక ఉపశమనం కలిగించే మందుల వల్ల తాత్కాలిక ఉపశమనం పొందినా, కాలక్రమేణ దీర్ఘకాల స్పాండిలైటిస్‌కు దారితీస్తుంది. జీవ రసాయనాల చర్యల అసమతుల్యత వల్ల స్పాండిలైటిస్ వస్తుంది. దాన్ని గుర్తించి యథాస్థాయిలో సమతుల్యత ఏర్పరచటం వల్ల పూర్తిస్థాయి ఆరోగ్యం చేకూరుతుంది. శరీర ఆకృతి, శరీర కదలికలను సమర్థంగా నిర్వహించే వెన్నుముక రకరకాల ఎముకల నిర్మాణ అమరిక. ఈ నిర్మాణ క్రమాన్ని చెదరగొట్టే ఏ కారణమైనా స్పాండిలైటిస్ సమస్యను సృష్టిస్తుంది. డయాబెటిస్, ఆర్థరైటిస్, గర్భస ్థకణతులు, హార్మోనల్ అసమతుల్యత మొదలగునవి. థైరాయిడ్ గ్రంధి శరీర అవసరానికి మించి ఎక్కువ పనిచేసినా, తక్కువ పనిచేసినా వివిధ రకాల దుష్పరిణామాలు ఏర్పడతాయి. అందులో ప్రధానమైనది స్పాండిలైటిస్ సమస్య.

ప్రేరేపకాలు
థైరాయిడ్ అసమతుల్యత వల్ల కలిగే స్పాండిలైటిస్ ప్రేరేపకాలు అనేకం. ప్రేరేపకాలను గుర్తించడం వల్ల వాటిని దూరం కావటం ద్వారా వ్యాధిని తగ్గించవచ్చు. ప్రేరేపకాలు శరీర జన్యువుల నిర్మాణాన్ని బట్టి మారుతుంటాయి. చిన్నతనంలో సరైన పోషకాల కొరత, శరీర శ్రమ తగినంత లేకపోవడం వల్ల, మానసిక ఉల్లాసం లేకపోవడం వల్ల, హార్మోన్ల అసమతుల్యత వల్ల శరీరం లోపల జన్యువుల పనితీరుపై ప్రభావం పడవచ్చు. ప్రతి చిన్న అనారోగ్యానికి రకరకాల మందులు వాడటం వల్ల విషపదార్థాలు శరీరంలో పేరుకొని లివర్, కిడ్నీలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత దావ్రా ఎముకల నిర్మాణక్రమాన్ని ప్రతిక్రియల ద్వారా దెబ్బతీయవచ్చు. మధ్యవయసు వారిలో నిద్రలేమి, హార్మోన్ల అసమతుల్యత, డయాబెటిస్, ఒబేసిటీలతో కలిగే ఒత్తిడిని థైరాయిడ్ గ్రంధి తట్టుకోలేకనంతగా ఉన్నపుడు ప్రతిక్రియలు ఏర్పడి స్పాండిలైటిస్ సమస్యకు దారితీస్తుంది.

ప్రారంభ సూచనలు
అరిచేతులు, అరికాళ్లలో తిమ్మిర్లు, మంటలు, అకస్మాత్తుగా నొప్పి రావటం, సూదులతో గుచ్చుతున్నట్లు మంటలు, అప్పుడప్పుడు నొప్పి ఉండటం, చిన్న చిన్న పనులు చేస్తున్నపుడు కాళ్లు, చేతుల నొప్పి రావటం, నడుమునొప్పి, స్త్రీలలో నెలసరి సమయంలో నడుమునొప్పి, కండరాలు అకస్మాత్తుగా బిగుసుకు పోవడం, నీరసం, మెడనొప్పి, తలనొప్పి, మానసిక వేదన లాంటివి స్పాండిలైటిసకు ప్రారంభ సూచనలు పరిగణించవచ్చు.

అసలేం జరుగుతుంది?
శరీరం తీసుకున్న ఆహారం శరీరానికి అందడానికి, ప్రోటీన ్ల సమతుల్యత ఏర్పడటానికి, హార్మోన్ల పనితీరును మెరుగుపర్చడానికి క్రియాశీలక పాత్ర పోషించే థైరాయిడ్ గ్రంధి రోగనిరోధక వ్యవస్థను కూడా పటిష్ఠ పర్చును. జీవనశైలిలో జరిగే మార్పులు శరీర అవలంబనను చేకూర్చడం థైరాయిడ్ గ్రంధి చేతుల్లో ఉంటుంది.

లక్షణాలు
మెడనొప్పి పనిచేస్తున్నపుడు చేతుల్లోకి పాకడం, నడుమునొప్పి కాళ్లలోకి పాకటం, కండరాల నొప్పి ఉండటం, డిస్క్ సమస్యల వల్ల భరించలేనంత నొప్పితో కదలలేక పోవడం, కండరాలు చిక్కిపోయి పనితనం తగ్గుముఖం పట్టడం, తలనొప్పి, కళ్లు తిరగటం, చెవుల్లో శబ్ధాలు రావటం, కంటిచూపులో మార్పు రావటం, సయాటిక లక్షణాలు నరాలపై ఒత్తిడి వల్ల అవుతుంది. స్పర్శజ్ఞానం తగ్గుముఖం పట్టడం, పటుత్వం కోల్పోవడం, పురుషుల్లో లైంగిక సమస్యలు ప్రారంభం కావటం, మూత్ర, మల విసర్జనపై నియంత్రణ కోల్పోవటం, ఒక్కసారి అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, అకస్మాత్తుగా నరాల నొప్పులు రావడం, నరాల బలహీనత, నీరసం ఉండవచ్చు.

హోమియో వైద్యం
రోగి తెలిపే లక్షణాలు, ప్రత్యేకతలను బట్టి వాటిని అర్థం చేసుకొని రోగనిరోధక శక్తిని పెంపొందించి గ్రంధులను ఉత్తేజ పర్చి వ్యాధి ప్రేరేపకాలను, కారణాలను తెలుసుకొని చికిత్స అందించటం ద్వారా స్పాండిలైటిస్‌ను నయం చేయవచ్చు. తదుపరి దుష్ప్రభావాలను తొలగించి సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చడం కేవలం హోమియో మందులతోనే సాధ్యపడుతుంది. ఇతర వైద్యాల వలే వ్యాధిక చికిత్స చేయకుండా కాన్‌స్ట్యూషనల్ పద్ధతిలో వ్యక్తికి చికిత్స చేయడం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు, పునరావృతాలు లేకుండా పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవటం ఉత్తమం.

డా. శ్రీకర్ మను
ఫౌండర్ ఆఫ్ డా. మనూస్ హోమియోపతి,
ఫోన్ : 9032 108 108
9030 339 999

0 comments:

Post a Comment