Pages

Subscribe:

Ads 468x60px

Sunday, 11 August 2013

నోటి దుర్వాసన వెనుక ఉన్న కారణాలు అనేకం

నలుగురిలో ఉన్నప్పుడు నోరు తెరిచి మాట్లాడాలంటే భయపెట్టే సమస్య నోటి దుర్వాసన. దీని వెనుక అనేక కారణాలుండొచ్చు. దంతాలు సరిగా శుభ్రం చేసుకోకపోవడమే కాదు.. చిగుళ్ల వ్యాధులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, హార్మోన్లలో తేడాలు.. ఇలా రకరకాల కారణాలుండొచ్చు. కాబట్టి నోటి దుర్వాసన సమస్య నుంచి బయటపడాలంటే మూలకారణాన్ని తెలుసుకుని పరిష్కరించుకోవాలంటున్నారు నిపుణులు.


చిగుళ్ల సమస్యలు
చిగుళ్ల వాపు, ఎర్రగా మారడం, నొప్పి, నోటిలో నుంచి రక్తం పడటం, నాలుక రుచి కోల్పోవడం వంటి లక్షణాలతో పాటు నోటి దుర్వాసన కూడా ఉంటుంది. మొదట్లో ఎటువంటి నొప్పి ఉండదు. కాబట్టి చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. కాని చిగుళ్ల వ్యాధి ముదిరిన కొద్దీ దంతాలు కదిలిపోవడం, పళ్ల మధ్య ఖాళీలు రావడం, చిగుళ్లు కిందికి జారిపోయి నొప్పి, పళ్లు జివ్వుమనడం వంటి సమస్యలు బాధిస్తాయి. మధుమేహం, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యల ముప్పులకూ చిగుళ్ల వ్యాధి దోహదం చేస్తుంది. కాబట్టి చిగుళ్ల వాపు సమయంలోనే జాగ్రత్త పడాలి.

కిడ్నీజబ్బులు
నోటి దుర్వాసన వెనుక కిడ్నీ సమస్యలు ఉండే అవకాశం ఉంది. రుచి తగ్గిపోతుంది. దీర్ఘకాల కిడ్నీ జబ్బులను తగ్గించడంలో నోటి శుభ్రత కూడా కీలకమైనదని అధ్యయనాలు చెబుతున్నాయి. దంతాలు ఆరోగ్యంగా ఉన్నవారితో పోలిస్తే పళ్లు ఊడిపోయినవారిలో కిడ్నీల సమస్యల అవకాశం ఎక్కువ ఉన్నట్టు అధ్యయనాల్లో తేలింది. 

హార్మోన్లు
ఆడపిల్లలకు నెలసరి సమయంలో స్త్రీ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల చిగుళ్లు ఎర్రబడడం, వాపు,
బ్రష్‌తో పళ్లు తోముకునేటప్పుడు రక్తం రావడం వంటివి కనిపిస్తాయి. గర్భధారణ సమయంలో కూడా హార్మోన్ ఎక్కువగా విడుదల కావడం వల్ల చిగుళ్ల వ్యాధి వచ్చే అవకాశం ఉంది. తద్వారా నోటి దుర్వాసన రావచ్చు.

జీర్ణ సమస్యలు
నోట్లోని బాక్టీరియా కొన్నిసార్లు జీర్ణాశయంలోకి చేరుకుని సమస్యలు తేవచ్చు. వీటివల్ల నోటి దుర్వాసన వస్తుంది. 

ఆహారంలో రకాలు
మనం తినే ఆహారంలోని కొన్ని రకాల పదార్థాలు కొన్ని రకాల బాక్టీరియాను వృద్ధి చేస్తాయి. ఈ బాక్టీరియా విడుదల చేసే సల్ఫర్ సంబంధిత పదార్థాలు నోటి దుర్వాసనకు దారితీస్తాయి. కాఫీలోని ఆమ్లాలు నోటి కణజాలంలోకి ఆక్సిజన్ వెళ్లకుండా అడ్డుకుని బాక్టీరియా పెరిగేలా చేస్తాయి. చక్కెరతో కూడిన చూయింగ్‌గమ్ వంటి వాటితో కూడా బాక్టీరియా పెరుగుతుంది. మసాలాలు, వెల్లుల్లి, ఉల్లి లాంటివి తిన్నప్పుడు వాటిలోని సల్ఫర్ పదార్థాలు రక్తంలో కలుస్తాయి. వీటిని ఊపిరితిత్తులు శ్వాస ద్వారా బయటకు పంపిస్తాయి. ఇది నోటి దుర్వాసనకు దారితీస్తుంది. 

పరిష్కారం?
నోటి దుర్వాసన రాకుండా రోజూ ఉదయం, రాత్రి శుభ్రంగా దంతాలు శుభ్రం చేసుకోవాలి. దంతాల మధ్య పేరుకునే పాచిని ఫ్లాసింగ్ వంటి విధానాల ద్వారా ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. ఆరునెలలకు ఒకసారి దంతవైద్యులను సంప్రదించి స్కేలింగ్ చేయించుకోవాలి. చిగుళ్ల వ్యాధికి ఈ గార ప్రధాన కారణం. ఆహారంలో పాల పదార్థాలు, విటమిన్ సి ఉండేలా చూసుకోవాలి. స్వీట్లు, టీ, కాఫీ, కూల్‌వూడింకులు పరిమితంగా తీసుకోవాలి.

సేకరణ: నమేస్తే తెలంగాణ

0 comments:

Post a Comment