Pages

Subscribe:

Ads 468x60px

Sunday, 11 August 2013

మైగ్రేన్‌కు విరుగుడు ఆయుర్వేదమే

తలను గోడకేసి కొట్టుకోవాలనిపించేంత తల నొప్పి ఉందంటే దానికి మైగ్రేన్ (పార్శ్వపు నొప్పి) ఒక్కటే కార ణం. ఎన్ని స్కానింగ్‌లు తీసినా ఏమాత్రం కనిపించని సమస్య కూడా ఇదే. నాడీ వ్యవస్థకు సంబంధించిన ఈ వ్యాధిని 15 శాతం మందిని ఆ నొప్పి ఉన్నంత కాలం నిద్రాహారాలకు దూరం చేస్తుంది. ఆధునిక వైద్య విధానాల శక్తి సామర్థ్యాలన్నీ మైగ్రేన్ నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని ఇవ్వడానికే సరిపోతున్నాయి. దానికి కారణం ఈ వ్యాధి రావడానికి అసలు కారణమైన వాత వికృతిని వారు గుర్తించకపోవడమే. ఆయుర్వేదం ఒక్కటే ఆ కారణాన్ని గుర్తించింది. అందుకే ఆయుర్వేదం ఒక్కటే మైగ్రేన్‌ను సమూలంగా, శాశ్వతంగా మాయం చేయగలుగుతోంది అంటున్నారు, ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ వర్ధన్


మనిషి ఎంత బలిష్టంగా ఉన్నా, ఏ పనీ చేయకుండా ఒక చీకటి గదిలో ఒక మూలన నక్కి కూర్చోవడం ఎక్కడైనా చూశారా? శబ్దాలకూ, వెలుతురుకూ దూరం దూరంగా పారిపోయేవాళ్లు ఎక్కడైనా ఎదురయ్యారా? ఒకవేళ చూసి ఉంటే అతని సమస్య కచ్చితంగా మైగ్రేన్ అయి ఉంటుంది. సుమారు 30 నుంచి 50 ఏళ్ల వయసు వారిలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇక ఇది ప్రతి నాలుగు కుటుంబాల్లో ఒక్కరైనా మీకు ఈ మైగ్రేన్ భాధితులుగా ఎదురవుతారు. పైగా ఈ బాధితుల్లో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా ఉంటారు. మౌలికంగా మెదడులోని అయాన్ ఛానల్స్‌లో వచ్చే తేడాల వల్ల ఈ సమస్య వస్తుంది. అంటే మెదడులో సహజంగా జరిగే విద్యుత్ ప్రక్రియలో కొన్ని లోపాలు ఏర్పడటమే ఇందుకు కారణం. మామూలుగా అయితే, మనం వాతావరణ కాలుష్యాల్లోకి వెళ్లినా, పెద్ద శబ్దాలకు చేరువైనా, ఎండలోకి వెళ్లినా, దూరప్రయాణాలు చేసినా, శరీరం అతిగా శ్రమకు లోనయినా వాటి తాలూకు ఒత్తిడిని తట్టుకునే శక్తి శరీరానికీ, మెదడుకు సహజంగానే అలవడుతుంది. కానీ, పార్శ్వపు (తల) నొప్పి కారణంగా మెదడు బాగా సున్నితమైపోయి, అతిగా స్పందించే స్థితికి చేరుకుంటుంది. ఈ లక్షణాన్నే మనం ఇంగ్లీషులో మైగ్రేన్ అంటాం. ఈ వ్యాధి బాధితులు వాతావరణ కాలుష్యాలకూ, శబ్ద కాలుష్యాలకూ, ఘాటు వాసనలకూ ఏమాత్రం తట్టుకోలేరు.

మైగ్రేన్ తో ఏమవుతుంది?
మెదడులోని దాదాపు 12 కేంద్రాల్లో విద్యుత్ ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. ఈ కేంద్రాల్లో నొప్పిని, స్పందనలను మెదడు నియంత్రిస్తూ ఉంటుంది. అయితే, ఆయా కేంద్రాల్లోని విద్యుత్ ప్రక్రియల్లో లోపాలు ఏర్పడినప్పుడు ఆ కేంద్రాలు బాగా సున్నితమైపోయి, శబ్దాన్ని గానీ, వెలుతురును గానీ భరించలేని స్థితిలో పడిపోతాయి. అందుకే వీరు శబ్దానికీ, వెలుతురుకూ దూరంగా ఒక చీకటి గదిలో ఉండిపోవడానికి ఇష్టపడతారు. మైగ్రేన్ బాగా తగ్గిపోయేదాకా
వారికి ఆ గదిలోంచి బయటికి రావాలనిపించదు. మెదడులోని దృష్టికి సంబంధించిన కేంద్రం సున్నితంగా మారిన ప్పుడు నిప్పు రవ్వలు ఎగిసిపడుతున్నట్లు, కళ్ల ముందు ఏవో అలలు వెళుతున్నట్లు అనిపించవచ్చు.

ఏవో నాలుగు చుక్కలు తప్ప మరేమీ కనిపించవచ్చు. లేదా కొద్ది సేపు పూర్తిగా చీకటి పడిపోయినట్లు అసలేమీ కనిపించకపోవచ్చు. ఇక మెదడులోని కార్టెక్స్‌లో జరిగే విద్యుత్ ప్రక్రియలోనే లోపం ఏర్పడితే ఒక అయోమయత్వం కమ్ముకుంటుంది. తాను ఏం చేస్తున్నాడో తనకే అర్థం కాదు. ఆ స్థితిలో తాను ఏం మాట్లాడుతోందీ తనకే బోధపడదు. పార్శ్వపు నొప్పే కదా అని ఎవరైనా నిర్లక్ష్యంగా ఉండిపోతే ఒక్కోసారి అది పక్షవాతానికి కూడా దారితీసే ప్రమాదం ఉంది. మైగ్రేన్ తీవ్రత 20 నిమిషాల కన్నా ఎక్కువ సమయం ఉంటే, రక్తనాళాలు మెదడులో కొన్ని హానికారక రసాయనాలను విడుదల చేస్తాయి. ఇదే సమయంలో రక్తనాళాల్లో ఒక కంపరం మొదలై వాపునకు గురై ఒక్కోసారి ఆ రక్తనాళాలు చిట్లిపోయే ప్రమాదమూ ఉంది.

మైగ్రేన్ ప్రేరకాలు
మైగ్రేన్‌ను కలిగించే వాటిలో వాతావరణ కారణాలు, ఆహార కారణాలు, మానసిక కారణాలు ఈ మూడూ ఉంటాయి. వాతావరణ కారణాల్లో ప్రత్యేకించి శబ్దాలు, వెలుతురు, వాతావరణ కాలుష్యాలు ప్రధానంగా కనిపిస్తాయి. మైగ్రేన్ బాధితుల్లో దాదాపు 40 శాతం మందికి ఈ వాతావరణ కార ణాలే ఉంటాయి. వాతావరణం మారినప్పుడు కూడా ఈ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. ఆహారపరమైన కారణాల్లో.... మనం తినే ఆహార పదార్థాలే కొందరికి ఈ సమస్య కలిగించవచ్చు. మరికొందరిలో తినే వేళలు మారినా సమస్య రావచ్చు. మధ్య మధ్యలో ఆహారం తీసుకోవడం మానేసినా, పస్తులుండిపోయినా ఈ సమస్య రావచ్చు. ఒక నిర్ణీత వేళంటూ లేకుండా ఎప్పుడు బడితే అప్పుడు భోజనం చేసే వారు మైగ్రేన్‌కు ఎక్కువగా గురవుతుంటారు. నిజానికి మైగ్రేన్‌కు దారి తీసే కారణాలు 100కు పైగానే ఉంటాయి.

ఎక్కువ సేపు నిలువ ఉంచిన పదార్థాలను తిన్నా ఈ సమస్య రావచ్చు. పదార్థాలు పాడైపోకుండా, ఎక్కువ రోజులు నిలువ ఉంచేందుకు వాడే ప్రిజర్వేటర్లు కూడా ఈ సమస్యను కలిగిస్తాయి. మరీ చల్లని పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా మైగ్రేన్ రావచ్చు. మానసిక కారణాల్లోకి వెళితే, తీవ్రమైన ఒత్తిళ్లు కూడా మైగ్రేన్‌కు దారి తీసే ప్రమాదం ఉంది. అతిగా శ్రమించడం, శరీరం నీరసించిపోవడం, నిద్రలేమి వంటివి కూడా మైగ్రేన్‌కు కారణమవుతాయి. వేళకు భోజనం చేయకుండా ఎక్కువ సేపు ఆకలితో ఉండిపోవడం కూడా మైగ్రేన్‌కు కారణం కావచ్చు. వీటితో పాటు అతినిద్ర కూడా మైగ్రేన్‌కు కారణం కావచ్చు.

హార్మోన్లలో వచ్చే తేడాలు... ముఖ్యంగా బహిష్టు సమస్యలు, మెనోపాజ్‌కు ముందు, తరువాత శరీరంలో చోటు చేసుకునే పరిణామాలు కూడా ఇందుకు కారణమవుతాయి. మెనోపాజ్ సమస్యల కారణంగా హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ తీసుకునే వారు, అలాగే గర్భనిరోధక మాత్రలు వాడేవారు కూడా ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతుంటారు. వీటితోపాటు, దీర్ఘకాలికంగా ఉండే మెడ నొప్పి, సైనసైటిస్‌లు కూడా మైగ్రేన్‌కు దారి తీసే ప్రమాదం ఉంది. ఔషధ కారణాల్లో... గర్భనిరోధక మాత్రలు, హార్మోన్ రిప్లేస్‌మెంట్ మాత్రలతో పాటు, రక్తాన్ని పలుచబరిచే ఆస్పిరిన్ లాంటి మాత్రలు, అధిక రక్తపోటుకు వాడే మందులు, స్టెరాయిడ్లు వాడేవారు కూడా ఈ సమస్యకు గురికావచ్చు. అవయవ మార్పిడి చేసుకున్న కారణంగా ఇమ్యూనో సప్రెసర్ మాత్రలు వేసుకునే వారు కూడా మైగ్రేన్‌కు గురికావచ్చు. కేన్సర్ కారణంగా ఇచ్చే రేడియేషన్, కీమోథెరపీ తీసుకున్న వారు కూడా ఈ సమస్య బారిన పడతారు.

రెండు రకాల మైగ్రేన్లు
కామన్ మైగ్రేన్: నాడీ కొట్టుకున్నట్లు తలంతా కొట్టుకుంటుంది. ఇది 4 గంటల నుంచి 72 గంటల దాకా కొనసాగుతూనే ఉంటుంది. కొందరిలో ఇది కొన్ని వారాల దాకా కొనసాగ వచ్చు. వికారంగా ఉండడమే కాకుండా వాంతులు కూడా కావచ్చు. ఈ సమస్య తీవ్రస్థాయికి చేరుకుంటే ఏ పనీ చేయలేని ఒక నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది. అన్‌కామన్ మైగ్రేన్: ఈ మైగ్రేన్‌లో శరీరం బాగా నీరసించిపోతుంది. మైగ్రేన్ తగ్గిపోయాక ఏ మాత్రం కదల్లేని స్థితికి చేరుకుంటారు. ఆకలి తగ్గిపోతుంది. శబ్దాన్ని, వెలుతురునూ తట్టుకోలేకపోవడమే కాకుండా, శరీరమంతా మొద్దుబారినట్లుగా ఉంటుంది. అతిమూత్ర సమస్య, మాటల కోసం వెతుక్కునే పరిస్థితి ఉంటాయి.

ఇతర వైద్య విధానాల్లో...
అనాల్జిసిక్స్, స్టెరాయిడ్స్, ఆర్కోటిక్స్, ఎర్గాట్ ఇలా కొన్ని మందులు రాస్తారు. వికారం, వాంతులు తగ్గడానికి యాంటీ-నాసియా మందులు ఇస్తారు. వీటికి తోడు న ల్లమందుతో తయారుచేసిన మందులు ఇస్తారు. రోగి డిప్రెషన్‌లో ఉన్నాడనుకుంటే యాంటీ-డిప్రెషంట్ మందులు ఇస్తారు. కొన్ని సంద ర్బాల్లో మూర్ఛ సంబంధితమైన మందులూ ఇస్తారు. ట్రై జెమైనల్ నరానికి ఇచ్చేందుకు, చెవి వెనుక భాగం నుంచి ఇంజెక్షన్ చేస్తారు. ఈ ఇంజెక్షన్‌ను ప్రతి 12 వారాలకు ఒకసారి ఇస్తారు. నాసల్ స్ప్రేలూ ఇస్తారు. అయితే ఇవన్నీ తాత్కాలిక ఉశపమనాన్నే ఇస్తాయి. కారణం ఈ వైద్యం సమస్య మూలాల్లోకి వెళ్లకపోవడమే. ఈ మందుల దుష్ప్రభావాలు జీర్ణవ్యవస్థను, మూత్రపిండాల వ్యవస్థనూ దెబ్బ తీస్తాయి. వరుసగా స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల శరీరం నిర్జీవంగా మారిపోవచ్చు. వ్యాధి తగ్గని కారణంగా నిరంతరంగా మందులు వాడటం వల్ల అంతకు ముందే ఉన్న మైగ్రేన్ సమస్య మరింత సంక్లిష్టంగా మారి, మరిన్ని ఎక్కువసార్లు, మరింత తీవ్రంగా రావడం మొదలవుతుంది.

ఇతర వైద్యాల్లో...
మైగ్రేన్‌ను ఆయుర్వేదంలో 'అర్ధావభేదకం' అంటారు. మెడ నుంచి తలదాకా సగ భాగమంతా వచ్చే నొప్పి ఇది. ఈ సమస్యకు అసలు కారణం వాతం వికృతి చెందడమే. అయితే, కొందరిలో కేవలం వాతమే కారణం కావచ్చు. మరికొందరిలో వాతం కఫంతో కలిసి కూడా ఈ నొప్పిని కలిగిస్తుంది. వాస్తవానికి మైగ్రేన్ మూలాలు కేవలం తలకే పరిమితమై కాదు, మొత్తం శరీరాన్ని వ్యాపించి ఉంటాయి. అంతేకాక మైగ్రేన్ కేవలం మెదడు భాగానికే పరిమితమైంది కాదు. అది అత్యధికంగా రెండవ మెదడుతో వచ్చే సమస్య. ఇందులో జీర్ణాశయ వ్యవస్థే కాకుండా, ఎంటరిక్ నరాల వ్యవస్థలోని లోపాలు కూడా ఇందులో భాగమవుతాయి. ఈ కారణాలే మైగ్రేన్‌కు మూలమవుతాయి. అందుకే ఆయుర్వేద వైద్య చికిత్సలో జీర్ణాశయానికే కాకుండా, ఎంటరిక్ నర్వెస్ సిస్టమ్‌కు కూడా వైద్యం చేయాలి. కానీ, ఇతర వైద్య విధానాల్లో అదేమీ జరగడం లేదు. ఈ నొప్పి తలలో వస్తోంది కాబట్టి సమస్య అంతా తలలోనే ఉందనుకోవడంలో అర్థం లేదు కదా .

ఆయుర్వేదంలో....
మైగ్రేన్ రావడానికి వాత, కఫాల్లోని తేడాలే ప్రధాన కారణం. వాతాన్ని సమస్థితికి తేవడంతో పాటు ఆయుర్వేదం మెదడులో పేరుకుపోయిన కఫాన్ని, ఆమాన్ని అంటే, వ్యర్థ విష పదార్థాలను బయటికి పంపిస్తుంది. అందుకు నస్య కర్మ చికిత్సను ఉపయోగిస్తాం. ముక్కు రంధ్రం మెదడుకు ముఖద్వారం కాబట్టి, కొన్ని ఔషధ తైలపు చుక్కల్ని ముక్కులో వేస్తాం. ముక్కు నుంచి అవి మెదడుకు చేరి మైగ్రేన్‌కు ప్రధాన కారకమైన కఫాన్ని తొలగిస్తుంది. దీనితో పాటు విరేచనం, కర్ణపూరణం, శిరోవస్తి, శిరోపిచ్చు ఈ చికి త్సలన్నీ చేస్తాం. మెదడులో జరిగే విద్యుత్ ప్రక్రియలో లోపాలు ఏర్పడినప్పుడు సెరటోనిన్ హార్మోన్ పరిమాణం పడిపోతుంది.

అది కూడా మైగ్రేన్‌కు దారి తీస్తుంది. పంచకర్మ చికిత్సల ద్వారా మలినాల్ని పూర్తిగా తొలగించాక శరీరంలోని ప్రతి విభాగమూ తిరిగి ఉత్తేజం పొందడానికి అవసరమైన అన్ని చికిత్సలూ చేస్తాం. మైగ్రేన్ లక్షణాలను తగ్గించడానికే పరిమితమైపోవడం కాదు. మైగ్రేన్‌కు దారి తీసిన సమస్త కారణాలనూ సమూలంగా తొలగిస్తాం. నాడీ వ్యవస్థను సమస్థితిలో ఉంచే వాతం ప్రకోపితం కావడమే ఇక్కడ సమస్య కాబట్టి, వాతాన్ని తిరిగి సమస్థితికి తీసుకురావడం ద్వారా మైగ్రేన్‌ను వేళ్లతో సహా పెకలించి వేయగలుగుతున్నాం. దీనివల్ల మైగ్రేన్ తగ్గిపోవడమే కాదు, ఇతరమైన మరే వ్యాధీ మీ దరి చేరకుండా పోతుంది. ఆపైన సంపూర్ణ ఆరోగ్యంతో, పరిపూర్ణ ఆనందంతో మీ జీవితం సాగిపోతుంది.

డాక్టర్ వర్ధన్,
ది కేరళ ఆయుర్వేదిక్ కేర్,
స్పెషాలిటీ, పంచకర్మ సెంటర్, స్కైలేన్ థియేటర్ లేన్, బషీర్‌బాగ్, హైదరాబాద్, బ్రాంచీలు: దానవాయి పేట - రాజమండ్రి, ఎన్ ఆర్ పేట- కర్నూలు
ఫోన్: 9866666055, 8686848383

సేకరణ, ఆంధ్రజ్యోతి, సకల

0 comments:

Post a Comment