డిఫ్తీరియా వ్యాధి బారిన పడుతున్న పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చిన్న పిల్లలోనే ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి ప్రాణాంతకంగా కూడా పరిణమించవచ్చు. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? వ్యాధి లక్షణాలేమిటి? హోమియో చికిత్స ద్వారా ఈ వ్యాధిని ఎలా నయం చేయవచ్చో తెలుసుకుందాం.
మహమ్మారి వ్యాధులలో డిఫ్తీరియా ఒకటి. దీనినే మనం కోరింత దగ్గు అని పిలుస్తాం. ఈ వ్యాధికి చికిత్స కన్నా, వ్యాధి రాకుండా నివారణా మార్గాలే ఎంతో సులువు. చిన్న పిల్లలే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుంటారు.
అప్పటిదాకా ఆడుతూ పాడుతూ కనిపించిన పిల్లలే హఠాత్తుగా గొంతు వాచిపోయి శ్వాస తీసుకోవడమే కష్టమైపోవడం ఏ తల్లిదండ్రులకైన గగుర్పాటు కలిగించే విషయమే. అయితే వ్యాధి ముదిరే దాకా చూస్తూ ఉండిపోవడం కన్నా, వ్యాధి రాకుండా నివారించే హోమియో మందులు వేసుకోవడం ఉత్తమం అంటున్నారు హోమియో వైద్యులు.
బ్యాక్టీరియాతో ప్రాణసంకటం 12 ఏళ్ల లోపు పిల్లలు డిఫ్తీరియా వ్యాధి బారిన పడుతున్నారని వైద్య వర్గాలు వెల్లడిస్తున్నాయి. 1990లో 6,300 మంది మరణిస్తే, 2010 నాటికి ఈ సంఖ్య 2,900కు తగ్గిందని పేర్కొంటున్నారు. డిఫ్తీరియా వ్యాధి రావడానికి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడమే ప్రదాన కారణం. టీకాల ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే వివిధ కారణాల వల్ల ఆ ప్రక్రియ జరగడం లేదు. ఆ కారణంగానే ఈ వ్యాధి వేగంగా పెరిగే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ వ్యాధి కారకమైన కోరినే అనే బ్యాక్టీరియా పసిపిల్లల పాలిటి ప్రాణసంకటంగా మారింది. ఈ వ్యాధి వైరస్ సోకిన 7 రోజులలో డిఫ్తీరియా లక్షణాలు కనిపిస్తాయి.
వ్యాధి లక్షణాలు:
డిఫ్తీరియా సోకిన పిల్లల్లో జ్వరం వస్తుంది. నీరసంగా ఉంటుంది. మెడ, గొంతు బాగాలలో వాపు కనిపిస్తుంది. అలాగే పసుపు, తెలుపు కలగలసిన ట్లుండే బూడిద రంగులో ఒక జిగురు లాంటి పదార్థం నోటిలోంచి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకే వస్తువు రెండుగా కనిపించడం, మాట తడబడటం, గుండె దడ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి శ్వాసకోశాలు పనిచేయకుండాపోవడం, స్పృహ కోల్పోవడం, గుండె కండరాలు పక్షవాతానికి గురికావడం వంటి కారణాలతో ప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడవచ్చు. డిఫ్తీరియా ప్రాణాంతక వ్యాధే అయినా దాన్ని అసలు రాకుండానే నివారించగలిగే మందులు హోమియోపతిలో ఉన్నాయి. ప్రత్యేకించి డిఫ్తీరినమ్-30 మందు రోజూ ఉదయం ఒక మోతాదు చొప్పున మూడు రోజులు మూడు డోసులు వేసుకోవడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చు.
సేకరణ: ఆంధ్రభూమి







0 comments:
Post a Comment