Pages

Subscribe:

Ads 468x60px

Saturday, 28 December 2013

శీతాకాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం ఎలా

వర్ష కాలం వెళ్లి శీతాకాలం హమ్మయ్య అనుకుంటాం కాని అనుకోకుండా మనల్ని వేదించి సమస్య చర్మం పొడి బారిపోతుంది.  ఈ కాలంలో దాహం ఎక్కువగా కాకపోవడం వల్ల నీళ్లు ఎక్కువగా తాగాలనిపించిదు. దీనివల్ల చర్మంలో తేమ శాతం తగ్గిపోయి పొడిబారుతుంది. దాహం ఉన్నా లేకపోయినా విధిగా నీళ్లు తాగాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను, పండ్ల రసాలను తీసుకోవాలి. 

  • బయటికి వెళ్లే ముందు తప్పనిసరిగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. బయటికి వెళ్లి వచ్చిన తరువాత గోరు నీటితో స్నానం చేసి తిరిగి మాయిశ్చరైజర్ అపె్లై చేయాలి. 
  • మసాజ్ ఆయిల్, గంధం పొడి, రోజ్‌వాటర్, తేనె కలిపిన మిశ్రమంతో బాడీ మసాజ్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది. 
  • చర్మం పగిలిపోయినట్లుగా ఉండేవారు స్నానానికి సబ్బుకు బదులుగా సున్నుపిండిని ఉపయోగించాలి. అంతేకాదు ప్రతిరోజూ స్నానం చేసిన తరువాత వెనిగర్ కలిపిన నీళ్లను శరీరంపై పోసుకుంటే పగుళ్ల సమస్య నుంచి బయటపడవచ్చు. 
  • గ్లిజరిన్‌లో రోజ్‌వాటర్, తేనె కలిపి ఈ మిశ్రమాన్ని చేతులు, కాళ్లకు అప్లెచేయాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. 
  • పెరుగు, పసుపు, తేనె కలిపి సున్నితంగా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీనిని ముఖంపై మర్దనా చేసి పదిహేను నిమిషాల పాటు ఉంచి, ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. 
  • తేనె, రోజ్ వాటర్, పాలపొడి కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. దీనిని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి. 
  • అరటిపండు, బొప్పాయి, యాపిల్ పండ్ల గుజ్జును ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తరువాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. 
  • నల్లగా, కరుకుగా ఉన్న మోచేతులు ఈ చలికాలంలో మరింత పొడిబారతాయి. నిమ్మకాయ సగం ముక్కను తీసుకుని మోచేతికి బాగా రుద్దాలి. ఆరిన తరువాత చల్లని నీటితో కడిగి మాయిశ్చరైజర్ అపె్లై చేయాలి. 
  • బియ్యం పిండిలో కానీ, ఓట్స్‌లో కానీ చెంచాడు నిమ్మరసం వేసి మోచేతులకు రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బియ్యం, పెసర, శనగ పిండి మిశ్రమంతో నలుగు పెట్టుకుంటే చర్మం కాంతివంతం అవుతుంది. 
  • ఓట్స్ పొడిలో తగినంత పెరుగుని కలిపి చేతులు, ముఖానికి మర్దనా చేయాలి. పూర్తిగా ఆరిన తరువాత కడిగేస్తే చర్మం కాంతులీనుతుంది. 
  • రెండు చెంచాల పెరుగులో నాలుగుచుక్కల దోసకాయ రసం కలిపి ఆ మిశ్రమంలో దూదిని ముంచి ముఖం తుడిచేస్తే చర్మం శుభ్రపడుతుంది. వారానికోసారి ఇలా చేయడం వల్ల ముఖ వర్చస్సు కూడా పెరుగుతుంది.

0 comments:

Post a Comment