Pages

Subscribe:

Ads 468x60px

Saturday, 28 December 2013

మధ్యపానంతో లివర్ సమస్య

మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో లివర్‌ పాత్ర చాలా కీలకం. అలాంటి లివర్‌ను చాలామంది చెడు అలవాట్లు, ఆల్కహాల్‌, జంక్‌ఫుడ్స్‌, పాశ్చాత్య అలవాట్లతో యుక్త వయస్సులోనే కాలేయ సమస్యల బారిన పడుతున్నారు. లివర్‌ సంబంధిత సమస్యలతో బాధపడే వారిలో మద్యం సేవించే వారిలోనే ఆ విధమైన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

ఆల్కహాల్‌ సేవించే వారిలో కాలేయ సమస్యలు ఎక్కువగా ఉంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆల్కహాలిక్‌ ఫ్యాటీలివర్‌,
ఆల్కహాలిక్‌ హెపటైటిస్‌, ఆల్కహాలిక్‌ సిర్రోసిస్‌ వంటి సమస్యలకు కారణం మద్యం సేవించడమే. ే పురుషుల్లోకన్నా, మహిళల్లో ఆల్కహాల్‌ తీసుకునే అలవాటు ఉంటే, వారిలో త్వరగా లివర్‌ సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలిక హెపటైటిస్‌-సి, వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నవారిలో ఆల్కహాల్‌ వల్ల కాలేయం దెబ్బతిని, ఆల్కహాలిక్‌ లివర్‌కు కారణం అవుతుంది.

ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ ప్రారంభంలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అనుకోకుండా పరీక్షలు చేయించుకున్నప్పుడు లివర్‌ పరిమాణం పెరిగినట్లు తెలుస్తుంది. కడుపు కుడివైపు భాగంలో నొప్పి, వాంతి అయినట్లు అనిపించడం, కళ్లు పచ్చబడటం వంటి లక్షణాలుంటే వెంటనే జాగ్రత్త పడాలి. నిర్ధారించ డానికి ఎల్‌ఎఫ్‌టి (లివర్‌ ఫంక్షన్‌ టెస్టు) ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌, సీరం యూరిక్‌ యాసిడ్‌ వంటి పరీక్షల ద్వారా నిర్ధారణ చేస్తారు. నిర్లక్ష్యం చేస్తే కడుపులో నీరు చేరడం, ఆహార నాళం ద్వారా రక్తస్రావం , మెదడు మందగించి స్పృహ కోల్పోవడం, హెప టైటిస్‌ కోమాకు గురికావడం వంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ఇలాంటి వారిలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాలిక్‌ లివర్‌ వ్యాధితో బాధపడుతున్నవారు మద్యసేవనం మానేయాలి. పౌష్టిక ఆహారం తీసుకోవడంతోపాటు డాక్టర్‌ సలహా మేరకు మందులు వాడాలి. 

డాక్టర్‌ ధర్మేష్‌కపూర్‌,
హెపటాలజిస్టు,
లక్డీకాపూల్‌, గ్లోబల్‌ హాస్పిటల్‌,
హైదరాబాద్‌,

సేకరణ: ప్రజాశక్తి

0 comments:

Post a Comment