Pages

Subscribe:

Ads 468x60px

Sunday, 12 October 2014

ముఖంపై ముడతలా...?

ముఖంపై ముడతలు పడ్డట్టు ఉందని ఎవరైనా అంటే తెగ బాధపడిపోతాం. వయసు పైబడే కొద్దీ చర్మానికి ఉండే సాగే గుణం తగ్గి చర్మం ముడతలు పడుతుంది. పెదాల దగ్గర, కళ్ల దగ్గర చర్మం బాగా ముడతలు పడుతుంది. ముఖ్యంగా నవ్వినపడు ఈ ముడతలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. వయసు మీద పడే కొద్దీ చర్మం పొడారినట్టు అ వుతుంది. పలచబడుతుంది. ఫలితంగా చర్మం తొందరగా ముడతలు పడుతుంది. పోషకాహార లోపం కూడా చర్మం ముడతలు పడడానికి ఒక కారణం. 

ఈ ముడతలు పడకుండా ఆపలేమా అని అనుకుంటున్నారా? పళ్లు, పోషకవిలువలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల కొంతవరకూ వీటిని తగ్గించవచ్చు. ముఖ్యంగా విటమిన్‌-సి ఎంత ఎక్కువ తీసుకుంటే చర్మం అంత నిగ నిగలాడుతూ ఉంటుంది. రోజూ పళ్లు బాగా తినాలి. విటమిన్‌- సి బాగా తీసుకోవడం వల్ల చర్మం పొడారినట్టు కాదు. రోజుకు కనీసం 500 మిల్లీ గ్రాముల విటమిన్‌-సి తప్పనిసరిగా తీసుకోవాలి. జామకాయలు, కమలాపళ్లు, బొప్పాయి, కాప్పికమ్‌, కేబేజీ మొదలైన వాటిల్లో విటమిన్‌-సి బాగా ఉంటుంది. ఎండలో బాగా తిరిగినా కూడా చర్మం ముడతలు పడే అవకాశం ఉంది. సూర్య కిరణాల్లోని అతినీలలోహిత కిరణాలు స్కిన్‌ టెక్స్చెర్‌ని దెబ్బతీస్తాయి. పొగతాగే అలవాటు ఉంటే కూడా చర్మం తొందరగా ముడతలు పడుతుంది. చర్మం పొడారినట్టు అవుతుంది.

రోజూ ఒక గ్లాసుడు వెజిటబుల్‌ జ్యూసు తాగితే చర్మానికి మంచిది. చర్మం ముడతలు పడదు. కేరట్లు, కీర, బీట్‌రూట్‌ వంటి వాటితో వెజిటబుల్‌ జ్యూసును తయారుచేసుకొని తాగొచ్చు. పండ్ల రసం తాగినా కూడా చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. ముఖ్యంగా కమలాపండు, నిమ్మకాయ రసం రోజూ తాగితే చర్మ సౌందర్యానికి చాలా మంచిది. ఇవి శరీరానికి కావాల్సిన విటమిన్‌-సి, విటమిన్‌-ఎ వంటి యాంటాక్సిడెంట్లను పుష్కలంగా అందిస్తాయి. నిత్యం 8-10 గ్లాసుల నీళ్లను తాగడం మరవొద్దు. చర్మాన్ని టమోట, బంగాళాదుంప వంటి కాయగూరలతో, పండ్లతో నిత్యం క్లీన్సింగ్‌ చేసుకోవాలి. విటమిన్‌-బి, జింకు బాగా తీసుకోవడం వల్ల చర్మం టెక్స్చెర్‌ ఆరోగ్యంగా ఉంటుంది. పొడి చర్మం ఉన్న వాళ్లు తక్కువ ఫ్యాట్‌ ఉండే పెరుగును, 8 బాదంపప్పులను రోజూ బ్రేక్‌ఫాస్ట్‌గా తినాలి. ద్రాక్షపళ్లను గుజ్జుగా చేసి అందులో తేనెను కలిపి ఆ పేస్టును మీ ముఖానికి పూసుకొని 20-30 నిమిషాలు అలానే ఉంచుకొని తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని బాగా కడిగేసుకోవాలి. దీనివల్ల ముఖం ముడతలు పడదు. సబ్బుతో కాకుండా చల్లటి నీళ్లతో తరచూ ముఖం కడుక్కుంటే చర్మానికి మంచిది. రోజూ వ్యాయామాలు చేస్తుంటే రక్తప్రసరణ శరీరానికంతటికీ బాగా జరుగుతుంది. దీనివల్ల కూడా చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. నిత్యం వ్యాయామాలు చేయడం వల్ల చర్మానికి కావాల్సిన ఆక్సిజన్‌, పోషకాలు బాగా అందుతాయి. ఫేస్‌ యోగా చేయడం వల్ల కూడా ముఖం మీద ఏర్పడ్డ ముడతలు పోతాయి.

సేకరణ: ఆంధ్రజ్యోతి

0 comments:

Post a Comment