Pages

Subscribe:

Ads 468x60px

Showing posts with label Grapes. Show all posts
Showing posts with label Grapes. Show all posts

Sunday, 15 September 2013

ఆరోగ్యానికి తాజా పండ్లు

ఆరోగ్యానికి తాజా పండ్లు ఎంతో మంచివన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ‘పండే కదా అని పిండేద్దాం’ అనుకుంటే మీ ఆరోగ్యం పని ఇక అంతే. పండ్లు కడుక్కుని అలానే తినాలిగానీ పిండి, పిప్పి చేసి జ్యూస్‌లా తాగితే మాత్రం అది కాస్తా విషంలాగా మారి.. ఆరోగ్యాన్ని హరిస్తుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. విషం అంటే అచ్చంగా విషం కాదు గానీ.. అది కలిగించే చక్కెర వ్యాధితో పోలిస్తే అంతకంటె తక్కువేం కాదు అంటున్నారు శాస్త్రవేత్తలు. పండ్లు ఆరోగ్యానికి మంచివని మనం కొనుక్కుని తింటూ వుంటాం. అయితే... అవి తియ్యగా ఉంటాయి అనే ఉద్దేశంతో మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఆ వ్యాధి ఎక్కడ వస్తుందో అని భయపడేవారు వాటికి కాస్త దూరంగా వుంటారు.