ముఖారవిందాన్ని పెంచేవి శిరోజాలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే బట్టతల ఉన్న వారు ఒకరకమైన ఆత్మన్యూనతా భావానికి గురై తమ వృత్తిలోనూ ఉన్నత స్థానాలకు ఎదగలేకపోతారు. అయితే బట్టతల ఉన్న వారు ఇప్పుడు బాధ పడుతూ కూర్చోవాల్సిన పనిలేదు. ఎందుకంటే స్టెమ్‌సెల్ థెరపీతో బట్టతలపై ఒత్తైన జుట్టు మొలిపించేలా చేయవచ్చు అని అంటున్నారు కాస్మెటాలజిస్ట్ డాక్టర్ బి.ఎన్.రత్న.
పురుషుల్లో బట్టతలకు కారణమవుతున్న డీహెచ్‌టి హార్మోన్, స్త్రీలలో జుట్టు రాలిపోవడానికి కారణమవుతున్న హార్మోన్ల అసమతుల్యత జుట్టు కుదుళ్లలోని మూలకణాల ను(స్టెమ్‌సెల్స్) ను నిర్జీవం చేస్తున్నట్లుగా పరిశోధనల్లో తేలింది.






