Pages

Subscribe:

Ads 468x60px

Showing posts with label eye-care. Show all posts
Showing posts with label eye-care. Show all posts

Monday, 17 June 2013

సర్వేద్రియానం నయనం ప్రధానం


ఒకప్పుడు, 50, 60 ఏళ్ల వయస్సులో ఉన్నవారు మాత్రమే కళ్లజోళ్లు పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు పిల్లలు కూడా కళ్లజోళ్లతో స్కూలుకెళ్లడం మనం చూస్తున్నాం. మన అస్థవ్యస్థమైన జీవనశైలి వల్లే అనారోగ్యాలు మనల్ని చుట్టుముడుతున్నాయి. అన్ని అవయవాలు వీటి బారినపడతున్నాయి. అందులో కళ్లుకూడా ఉన్నాయి. మన చూపు బలహీనమవడానికి మనమే కారణమవుతున్నాం. మెరుగైన చూపుకు మనం ఏం చేయాలో తెలుసుకుందాం....

Tuesday, 7 August 2012

కట్టిపడేసే నయనాల కోసం

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్న నానుడి మనందరికీ తెలిసిందే. మన ప్రతి కదలికకూ కంటిచూపే ఆధారం. అంతేకాదు ముఖసౌందర్యంలో కళ్లకు ఎంతో ప్రా«ధాన్యం ఉంది. ఆరోగ్యవంతమైన కళ్లు చూసేవారిని కట్టిపడేస్తాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న కళ్ల విషయంలో మనం పలు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.

కళ్లకు విశ్రాంతి చాలా ముఖ్యం. ఏ పనిచేస్తున్నాసరే మధ్యమధ్యలో అంటే ప్రతి పదినిమిషాలకోసారి కళ్లను ఓ నిమిషంపాటు మూసుకుని ఉంచాలి. అలసిన కళ్లకు విశ్రాంతినివ్వాలంటే గుండ్రంగా తరిగిన దోసకాయ ముక్కలను కళ్లపై పెట్టుకొని కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్లకింది నల్లటి వలయాలు కూడా తగ్గిపోతాయి. పొట్లకాయ ముక్కలను కూడా కళ్లపై ఉంచుకోవచ్చు.