Pages

Subscribe:

Ads 468x60px

Showing posts with label kidney-problems. Show all posts
Showing posts with label kidney-problems. Show all posts

Saturday, 13 April 2013

గర్భవతుల్లో కిడ్నీల వాపు



గర్భవతుల్లో మూత్రపిండాల వాపు ఎందుకొస్తుంది?
గర్భిణుల్లో 4 నెలలు దాటాక, గర్భసంచి పరిమాణం పెద్దదై, మూత్రవాహికపైన ఒత్తిడి పెరుగుతుంది. దాంతో మూత్రం ఆగిపోయి, మూత్రపిండం వాపు కనిపిస్తుంది. కొంత మంది గర్భిణుల్లో మూత్రపిండాల్లో, మూత్రవాహికల్లో రాళ్ల వల్ల కూడా ఈ సమస్య రావొచ్చు.

Monday, 24 September 2012

ఊపిరితిత్తుల వ్యాధులకు ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ వరం


చల్లని వాతావరణం, దుమ్ము, ధూళి, కాలుష్యం, ఇన్ఫెక్షన్‌ల వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు వస్తున్నాయి. ఊపిరితిత్తుల సమస్యలు సాధారణ అలర్జీ నుంచి కేన్సర్‌ల వరకు దారితీస్తున్నాయి. అల్లోపతి, హోమియోపతి వైద్యవిధానాల్లోని మేటిసారంతో రూపొందించిన ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఒక్కటే ఈ ఊపిరితిత్తుల సమస్యకు శాశ్వత పరిష్కారం అంటున్నారు ప్రముఖ వైద్యనిపుణులు డాక్టర్ కె.శ్రీధర్, డాక్టర్ సుప్రియ.

Saturday, 8 September 2012

స్పాండిలైటిస్ దుష్ప్రభావాలకు హోమియోతో చెక్

నేటి యాంత్రిక జీవితంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడం పరిపాటిగా మారింది. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరి శరీర జన్యువుల ఆధీనంలో పనిచేసే రోగ నిరోధక వ్యవస్థ ఎటువంటి మార్పునైనా తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. దీర్ఘకాలికంగా కొనసాగే ప్రతిచర్యలు రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయి. స్పాండిలైటిస్, యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ దుష్ప్రభావాలు శరీరంలోని ఇతర అవయవాలను దెబ్బతీస్తాయి. హోమియో వైద్యంతో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చని అంటున్నారు డాక్టర్ శ్రీకర్ మను.

Sunday, 2 September 2012

ఫ్యాటీలివర్‌తో కాలేయానికి ముప్పు

మానవ శరీరంలో అతికీలకమైన అవయవం కాలేయం. ఈ అవయవంలో కొవ్వు అధికంగా చేరిపోతే ఫ్యాటీలివర్ సమస్య మొదలవుతుంది. నిర్లక్ష్యం చేస్తే లివర్ సిర్రోసిస్‌గా మారే అవకాశం ఉన్న ఈ సమస్యను ఆధునిక చికిత్సలతో సులభంగా తగ్గించవచ్చని అంటున్నారు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా. ఎమ్.ఎన్. పవన్‌కుమార్.

పై పొట్టలో నొప్పి వస్తుంటే ఎసిడిటీ అనుకుని తెలిసిన మాత్రలేవో వేసుకుని ఉండిపోతారు. చివరకు నొప్పి ఎక్కువయ్యాక ఆసుపత్రికి వెళితే అల్ట్రాసౌండ్ పరీక్షల్లో ఫ్యాటీలివర్ అని తేలుతుంది. నిర్లక్ష్యం చేస్తే ఈ సమస్య లివర్ సిర్రోసిస్‌కు దారితీసి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.

Thursday, 23 August 2012

కిడ్నీలో స్టోన్స్‌‌ని గుర్తించడం ఎలా?

తలనొప్పి, నడుము నొప్పిలాగే ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ సమస్య చాలా విపరీతంగా పెరిగిపోతోంది. ఈ కిడ్నీ స్టోన్స్ సమస్య ఎవరికైనా ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. అందుకు వైద్యులు చెప్పిన కొన్ని సలహాలను ఇక్కడ తెలియజేస్తున్నాం. ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి వంశపారంపర్యంగా రావచ్చు, మూత్ర నాళాలు బంధించబడితే ఏర్పడొచ్చు, పారా థైరాయిడ్ అనబడే గ్రంథి అధికంగా పనిచేయడం వల్ల ఏర్పడొచ్చు, అదేవిధంగా ఇన్ఫెక్షన్ కారణంగా కూడా ఏర్పడొచ్చు.

Monday, 20 August 2012

కిడ్నీ స్టోన్స్‌ని, పొట్టని కరిగించే అనాసపండు

పచ్చని కూరగాయలు, ధాన్యాలు అలాగే పిండి పదార్ధాలను, పండ్లను తినడం వల్ల శారీరక శక్తి పెరుగుతుంది. దాంతోపాటు వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. పళ్ళన్నీ ముఖ్యమైనవే అయినా అనాసపండు ప్రత్యేకత కలిగినది. చక్కని రుచి, సువాసన కలిగిన అనాసపండు 85 శాతం నీటిని కలిగి ఉంది. దీనిలో చక్కెర నిల్వలు 13 శాతం, ధాతు శక్తి 0.05 శాతం, పీచు పదార్ధం 0.35 శాతం ఉన్నాయి. పైగా విటమిన్ ఎ, బి, సిలు కూడా ఉన్నాయి.

కిడ్నీ సంబంధిత రోగాలను తగ్గించే దానిమ్మపండు

దానిమ్మ పండు జావతో కిడ్నీ రోగాలకు చెక్ పెట్టవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. దానిమ్మ పండులో యాంటియోయాక్సిడెంట్స్ ఉన్నందున కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఎంతగానో మేలు చేస్తుందని ఇజ్రాయేల్‌కు చెందిన వెస్టర్న్ గలిలీ మెడికల్ సెంటర్ నిర్వహించిన పరిశోధనలో తేలింది.

కిడ్నీ వ్యాధిగస్తులు దానిమ్మ పండు జ్యూస్‌ తీసుకోవడం ద్వారా రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గుముఖం పట్టడాన్ని నియంత్రిస్తుందని గలిలీ మెడికల్ సెంటర్ పరిశోధకులు తెలిపారు.