Pages

Subscribe:

Ads 468x60px

Showing posts with label sleeping_problems. Show all posts
Showing posts with label sleeping_problems. Show all posts

Sunday, 18 August 2013

నిద్రలేమి సమస్యకు కారణాలు ఏమిటి.?

నిద్రలేమి సమస్య ప్రతీ ఒక్కరినీ బాధిస్తోంది. ముఖ్యంగా ఒత్తిడి, షిఫ్టులు, టార్గెట్లు ఉన్న ఉద్యోగాలు చేసేవారిని. దీన్నే వైద్యపరిభాషలో 'ఇన్‌సోమ్నియా' అంటారు. ఇటీవల జరిపిన సర్వేల ప్రకారం ఈ సమస్యతో బాధపడేవారు ప్రతి నలుగురిలో ఒకరు ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్య వినటానికి చిన్న సమస్యగానే అనిపిస్తుంది. కానీ ఈ సమస్యను అనుభవించే వారి బాధ అంతా ఇంతా కాదు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా, లోలోన మథనపడకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడితే సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

Friday, 9 August 2013

కడుపులో మంటగా ఉంటే....?

చాలామంది ఉన్నట్లుండి కడుపులో మంట పుడుతోందంటూ కుర్చీలో అలాగే వాలిపోతుంటారు.
దీనికి అసిడిటీయే కారణం. అసిడిటీ రావడానికి కారణాలు ఏమిటి అని చూస్తే...

  • సరిగా నిద్ర లేకపోవడం.
  • ఆహారాన్ని త్వరగా భుజించడం. సరిగా నమిలి తినకపోవడం.
  • ఆహారంలో మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం ఉండటం.
  • ధూమపానం, మద్యపానం సేవిస్తుండటం.

Saturday, 13 July 2013

నిద్రలేమి సమస్యకు అశ్రద్ధ తగదు

ఆదునిక యుగంలో చాలామందిని పట్టి పీడిస్తున్న సమస్య నిద్రలేమి. దీనినే వైద్య పరిభాషలో ‘ఇన్‌సోమ్నియా’ అంటారు. ఇటీవల జరిపిన సర్వేల ప్రకారం ఈ సమస్యతో బాధపడేవారు ప్రతి నలుగురిలో ఒకరు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ సమస్య వినటానికి చిన్న సమస్యగానే అనిపిస్తుంది గాని ఈ సమస్యను అనుభవించేవారి బాధ ఇంతా అంతా కాదు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా, లోలోన మదనపడకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడుకుంటే ఈ సమస్యనుండి విముక్తి పొందవచ్చు.

Tuesday, 25 September 2012

చక్కని నిద్రకి చిట్కాలు

కారణం లేకుండా నిద్రపట్టక ఇబ్బంది పడే వారు. పడుకొన్న వెంటనే హాయిగా నిద్రపట్టాలని భావించేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హాయిగా నిద్ర పట్టడానికి కొన్ని చేయాల్సిన పనులుంటే మరికొన్ని చేయకూడని పనులు వున్నాయి. ముందుగా రాత్రివేళ హాయిగా నిద్రపట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన పనులు గురించి చెప్పుకొందాం.

Thursday, 6 September 2012

అలసిన శరీరానికి మాలిష్ తో ఉపసమనం

ప్రస్తుత జీవితం ఉరుకుల పరుగులమయం అయిపోయింది. దీంతో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. శారీరక లేదా మానసికపరమైన ఒత్తిడే దీనికంతటికి కారణం అంటున్నారు వైద్యులు. నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే శరీరానికి సుగంధ భరితమైన తైలాలనుపయోగించి మీ శరీరానికి మాలిష్ చేస్తే సుఖవంతమైన నిద్ర సొంతమంటున్నారు.

ముప్పై మిల్లీగ్రాముల బేస్ నూనెలో ఐదు చుక్కల కైమోమైల్ నూనె, ఐదు చుక్కల మెజోరమ్ నూనె, పదిహేను చుక్కల చందనపు నూనె మరియు ఐదు చుక్కల క్లైరీసెజ్ నూనెను కలుపుకుని మాలిష్ చేయండి.