Pages

Subscribe:

Ads 468x60px

Showing posts with label stomac. Show all posts
Showing posts with label stomac. Show all posts

Tuesday, 16 October 2012

కడుపులో మంటను తగ్గించే కీరదోస

కొంతమంది కడుపులో మంటతో సతమతమవుతుంటారు. ఈ మంట తగ్గేందుకు ఏవేవో మాత్రలను మింగుతుంటారు. కడుపులో మంటగా ఉన్నప్పుడు దోసకాయ రసాన్ని తాగితే ఆ మంట తగ్గుతుంది. అంతేకాదు... దోసకాయకు జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి ఉన్నది. దోసకాయను తొక్కుతో తినడం మంచిది. అయితే ప్రస్తుతం ఏ కూరగాయలను పండించేందుకైనా రసాయన ఎరువులు వాడుతున్నారు కనుక సహజసిద్ధమైన కాయలను మాత్రమే తొక్కుతో తినాలి.

Monday, 20 August 2012

ఒక కప్పు కాఫీతో జ్ఞాపకశక్తిని పెంచుకోండి

కాఫీలు, టీలు కడుపు నింపుతాయా, ఆరోగ్యాన్నిస్తాయా అని చాలా మంది సణుగుతూ ఉంటారు. దానికి కారణం దాని వల్ల ఆరోగ్యానికి ఏదైనా హాని జరుగుతుందేమోనన్న భయంతో. కానీ ఇప్పుడు భోజనాన్ని తగ్గించి మరీ రోజుకోసారైనా కాఫీ తాగండీ, ఆరోగ్యాన్ని కాపాడుకోండని వైద్య నిపుణులు చెబుతున్నారు.

చాలా వరకు చూస్తే కొంతమంది జ్ఞాపక శక్తి తగ్గిపోతోందని బాధపడుతుంటారు. అయితే ఇక నుంచి కాఫీ తాగండి. నడుం కొలత పెరిగిపోతోందని దిగులు పడుతున్న వారు కూడా కాఫీ తాగితే వారి బాధ తగ్గిపోతుంది. ఈ వాస్తవాలన్నీ ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడయ్యాయి.