Pages

Subscribe:

Ads 468x60px

Thursday, 30 August 2012

వంటిల్లే వైద్యశాల - పోపులపెట్టే ఫస్ట్ ఎయిడ్ కిట్

మన వంటింట్లో ఉండే మామూలు దినుసులే ఎన్నో చిన్న చిన్న రుగ్మతలను తగ్గించి ఆరోగ్యాన్ని ఉత్సాహంగా ఉంచుకొంటుంది. మనం రోజూ వాడే పదార్థాలతో కలిగే ప్రయోజనాలు...

పసుపు :
నీళ్లలో కాస్తంత పసుపు వేసి ఆవిరి పడితే జలుబు, దగ్గు మటు మాయమైపోతుంది.
మిరియాలు :
స్వచ్ఛమైన తేనెలో కాస్తంత అల్లం రసంతో పాటు నాలుగైదు మిరియాలు తీసుకుంటే గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఇంకా ఇది ఆకలిని కూడా పెంచుతుంది.

కొత్తిమీర :
మనం ఆహారంలో వేసుకునే కొత్తిమీర జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది.
కాస్తంత కొత్తిమీర రసాన్ని కొద్దిగా అల్లం రసంతో కలిపి తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది.
కడుపులో ఉబ్బరంగా ఉన్నప్పుడు కాస్తంత కొత్తిమీర రసం, అల్లం రసం ఒక గ్లాసు నీళ్లలో కలిపి తాగాలి. దాంతో కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

ఏలకులు :
నోటి దుర్వాసనను ఏలకులు సమర్థంగా అరికడతాయి.
దాంతో పాటు వికారం, తలనొప్పికి కూడా ఏలకులు మంచి మందుగా పనిచేస్తాయి.
కళ్లు మంటలు, దురదలు తగ్గడానికి కూడా, ఏలకులు బాగా పనిచేస్తాయి.

వెల్లుల్లి :
వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
వెల్లుల్లిని వాడినప్పుడు అందులోని అలిసిన్ అనే పదార్థం (ఇదే వెల్లుల్లికి ఘాటైన వాసన ఇస్తుంది) అధిక రక్తపోటు, గుండెజబ్బుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
వెల్లుల్లి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇంకా రక్తనాళాల్లోని కొవ్వును తగ్గిస్తుంది.

శనగలు :
కఫం తగ్గించడానికి శనగలు బాగా పనిచేస్తాయి.
ఒక టేబుల్‌స్పూన్ శనగపిండిని ఒక చెంచా తేనెతో కలిపి రోజూ రాత్రివేళ తీసుకుంటే ఆ మిశ్రమం జీర్ణ సంబంధమైన అనేక సమస్యలను నివారిస్తుంది.
Enter your email address:

0 comments:

Post a Comment