Pages

Subscribe:

Ads 468x60px

Showing posts with label ఆయుర్వేదం. Show all posts
Showing posts with label ఆయుర్వేదం. Show all posts

Saturday, 28 December 2013

వాల్ నట్స్ తో గుండెకు మేలు

రోజూ నాలుగు వాల్‌నట్స్ తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుందంటు న్నారు పరిశోధకులు. బాదం, పిస్తా, వేరుశెనగ వంటి ఇతర నట్స్‌తో పోల్చితే వాలనట్స్‌లో గుండెను ఆరోగ్యంగా ఉంచే యాంటీ అక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. పెన్సిల్వేనియాలోని స్క్రాన్‌టన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడయింది. 

" ఇతర గింజలతో పోలిస్తే వాల్‌నట్స్‌లో రెట్టింపు యాంటీ అక్సిడెంట్లు ఉన్నాయి. కానీ చాలా మంది వాల్‌నట్స్‌ను తీసుకోవడం లేదు.

నడుమునోప్పికి నివారణ సాధ్యమా

వెన్నెముక శరీరానికి ఆవల ఉండే అవయవమేమీ కాదు కదా! దాని చుట్టూ ఉండే ఇతర వ్యవస్థలతో ముడివడే దాని పనితీరు గానీ, దాని సమస్యలు గానీ ఉంటాయి. అందుకే వెన్నెముకకు దన్నుగా ఉండే కండరాలు, లిగమెంట్లు, టెండాన్లను పట్టించుకోకుండా ఏకంగా వెన్నుపూసలకు సర్జరీ చేయడానికి సిద్ధమైపోతే ఏముంది? ఒక సర్జరీ తరువాత మరో సర్జరీతో వెన్నంతా కోతలు పెట్టుకోవడం తప్ప, జేబులు ఖాళీ చేసుకోవడం తప్ప ఒరిగేదేమీ ఉండదు. అందుకే వెన్నుతాలూకు సమస్త వ్యవస్థలకూ వైద్యం చేయడమే లక్ష్యంగా ఆయుర్వేదం పనిచేస్తుందని అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ వర్థన్.

Monday, 9 September 2013

నడుం నొప్పిని పోగొట్టుకోవడం ఎలా?

ప్రస్తుత పరిస్థితుల్లో మానవుని జీవనం ప్రకృతి సహజ విధానాలకు విరుద్ధంగా ఉంటోంది. పెరిగిపోతున్న పని ఒత్తిడి, పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల చాలామందికి 40 ఏళ్లకే నడుం నొప్పి వస్తోంది. శారీరకంగా, మానసికంగా సమస్యలు కలిగించే నడుం నొప్పిని శాశ్వతంగా దూరం చేయాలంటే ఆయుర్వేద చికిత్సే ఉత్తమమైన మార్గం అంటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ కరుణశ్రీ.

Tuesday, 20 August 2013

అరిగిన డిస్కులకు ఆయుర్వేదంలో అద్భుతమైన వైద్యం

వెన్నునొప్పి మౌలికంగా ధాతుక్షయంతో ఏర్పడిన సమస్య. పెయిన్ కిల్లర్స్ ఇచ్చి ఆ నొప్పిని ఎన్నాళ్లని కప్పిపుచ్చుతారు. సర్జరీ చేసి ఏం సాధిస్తారు? మొత్తంగా వెన్నుముకను పరిపుష్ఠం చేయకపోతే, ఒక్కొక్క డిస్కూ అరిగి, ఒరిగిపోవడం తప్ప ఫలితమేమీ ఉండదు. ఏళ్ల తరబడి కొనసాగే వెన్నునొప్పి వల్ల వృత్తి సామర్థ్యాన్నే కాదు సహజమైన జీవశ క్తినే కోల్పోతారు.

Sunday, 18 August 2013

ఐబిఎస్ కడుపులో అగ్నిగుండం

ఐబిఎస్ అనేది పుర్రెలో పుట్టిందో, మానసిక ఒత్తిళ్లతో వచ్చిందో కాదు. అది మెదడుకూ జీర్థవ్యవస్థలో ఉండే రెండవ మెదడు అంటే గ్రహణికీ మధ్య సమన్వయం లోపించడం వల్ల తలెత్తే సమస్య. ఆ సత్యాన్ని గుర్తించని ఆధునిక వైద్యులు ఐబిఎస్‌ను ఒక అంతుచిక్కని, ఎవరూ ఏమీ చే యలేని వ్యాధిగా చిత్రిస్తున్నారు. పైపై ఉపశమానికి ఏళ్ల పర్యంతం మందులు రాస్తున్నారు. కానీ, ఐబిఎస్ మూల కార ణాలు తెలిసిన ఆయుర్వేదానికి ఆ వ్యాధిని నయం చేయడం వెన్నతో నేర్చిన విద్య అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ వర్ధన్.

Sunday, 11 August 2013

మైగ్రేన్‌కు విరుగుడు ఆయుర్వేదమే

తలను గోడకేసి కొట్టుకోవాలనిపించేంత తల నొప్పి ఉందంటే దానికి మైగ్రేన్ (పార్శ్వపు నొప్పి) ఒక్కటే కార ణం. ఎన్ని స్కానింగ్‌లు తీసినా ఏమాత్రం కనిపించని సమస్య కూడా ఇదే. నాడీ వ్యవస్థకు సంబంధించిన ఈ వ్యాధిని 15 శాతం మందిని ఆ నొప్పి ఉన్నంత కాలం నిద్రాహారాలకు దూరం చేస్తుంది. ఆధునిక వైద్య విధానాల శక్తి సామర్థ్యాలన్నీ మైగ్రేన్ నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని ఇవ్వడానికే సరిపోతున్నాయి. దానికి కారణం ఈ వ్యాధి రావడానికి అసలు కారణమైన వాత వికృతిని వారు గుర్తించకపోవడమే. ఆయుర్వేదం ఒక్కటే ఆ కారణాన్ని గుర్తించింది. అందుకే ఆయుర్వేదం ఒక్కటే మైగ్రేన్‌ను సమూలంగా, శాశ్వతంగా మాయం చేయగలుగుతోంది అంటున్నారు, ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ వర్ధన్

నడుము నొప్పికి అద్భుత వైద్యం ఆయుర్వేదం

వేరు వేరు సమస్యలుగా కనపడుతున్న, వెన్నునొప్పి, కాళ్లనొప్పి, లైంగిక సమస్యల వెనక ఉన్న వ్యాధి మూలం ఒక్కటే. అందువల్ల వాటన్నిటికీ వేరు వేరు డాక్టర్ల వద్దకు వెళ్ల వ లసిన అవసరం లేదు ఒకే ఒక్క ఆయుర్వేద డాక్టర్ మీ సమస్యలన్నిటినీ పరిష్కారం చూపుతారు. వాస్తవానికి వెన్నునొప్పి అనేది వాతం వికృతి (వాత దోషం) వల్ల తలెత్తే సమస్య అయితే వాతం అనేది కేవలం వెన్నెముకకే పరిమితమై ఉండదు.

సుఖవ్యాధులకు ఆయుర్వేద చికిత్స

మన సమాజంలో సుఖవ్యాధులతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ వ్యాధిపీడితుల్లో ఆందోళన పెరిగి ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. సుఖవ్యాధులున్న ఇతర వ్యక్తులతో శృంగారంలో పాల్గొనడం వల్ల వీరికి కూడా సుఖవ్యాధులు సంక్రమిస్తాయి. హెర్పిస్, గనేరియా, సిఫిలిస్ క్లమీడియా వంటి సర్వసాధారణమైన సుఖవ్యాధుల నివారణకు హోమియో మందులు మేలంటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణులు డాక్టర్ నరసింహ.

Friday, 9 August 2013

కీళ్ల నొప్పులకు ఆయుర్వేద పరిష్కారాలు

నేటి జీవనశైలి మానవ జీవితాన్ని, ఆరోగ్యాన్ని అతలాకుతలం చేస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న వయసులోనే ఎంతో మంది కీళ్లనొప్పుల సమస్యను ఎదుర్కొంటున్నారు. అందుకు కారణాలు ఏమైనా ఆ సమస్యకు సరైన పరిష్కారం ఆయుర్వేదమే అంటున్నారు డాక్టర్ హనుమంతరావు.

ప్రస్తుతకాలంలో 30-40 సంవత్సరాలలోపే కీళ్ల నొప్పులు మొదలవుతున్నాయి. నేటి జీవన విధానంలో వచ్చిన అనేక మార్పులు ఇందుకు కారణం.

Tuesday, 23 July 2013

వీర్య వృద్ధికి, లైంగిక శక్తికి ఆయుర్వేదం

ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశీలనల్ని దాని రికార్డులను గమనిస్తే, 1950 కన్నా ముందు ఒక మి.లీ వీర్యంలో 110 మిలియన్ల శుక్రకణాలు ఉండేవి. 1980 నాటికి అది 60 మిలియన్లకు తగ్గిపోయింది. ఆ తరువాత క్రమంగా 40 కి , 20 కి పడిపోయింది. ప్రస్తుతం అది 15 మిలియన్లకు పడిపోయింది. విచిత్రం ఏమిటంటే ఎంతకు పడిపోతే అదే ప్రామాణికమనే నిర్ధారణకు వచ్చేస్తున్నారు. ఇది సంతానలేమికి మాత్రమే కాదు.

సోరియాసిస్-చుండ్రు

సొరియాసిస్ తల మీద ఉన్నప్పుడే వైద్య చికిత్సలు తీసుకుంటే అంతటితో సమస్య సమాప్తమయ్యేదే. కానీ, తలనుంచి పొడి పొడిగా రాలుతుంటే ఏదో చుండ్రులే అనుకుని ఎన్నాళ్లు నిర్లక్ష్యంగా ఉండిపోలేదు!. తలనుంచి చెవులు, మెడ దాటి నిలువెల్లా పాకేసిన తరువాత ఇప్పుడు అది సొరియాసిస్ అని తెలుసుకుని గగ్గోలు పెడితే ఏముంటుంది?

Saturday, 13 July 2013

వంటింటి ఔషదం శొంఠి


  • శొంఠిని, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయలను సమభాగాలు తీసుకొని కల్కంగా (ముద్దగా) నూరాలి. దీనికి ఆవునెయ్యిని, నువ్వుల నూనెనల మిశ్రమాన్ని నాలుగు భాగాలు కలపాలి. పెరుగు మీద తేటను 8 రెట్లు కలిపి ద్రవాంశం మొత్తం ఆవిరైపోయే వరకూ చిన్న మంట మీద మరిగించి వడపోసుకొని నిల్వ చేసుకోవాలి. దీనిని ఉదయ సాయంకాలాలు 10-20 మిల్లీలీటర్లు మోతాదులో తీసుకుంటుంటే ఉదర వ్యాధుల్లో హితకరంగా ఉంటుంది.

Wednesday, 26 September 2012

చందనంతో ఆరోగ్యం

సౌందర్య పోషణలోనూ, ఆరోగ్య పరిరక్షణలోనూ చందనం ప్రముఖపాత్ర పోషిస్తుంది. చందనాన్ని శరీరానికి రాసుకోవడం వల్ల అనేక రుగ్మతలనుండి మిముక్తి పొందవచ్చు. దీన్ని ఆయుర్వేద ఔషధాల్లో కూడా ప్రత్యేక ద్రవ్యంగా వాడుతుంటారు.

Tuesday, 25 September 2012

వెక్కిళ్ల నివారిణి 'లవంగం'

లవంగాలను చైనీయులు వెక్కిళ్ల నివారణా ఔషధంగా ఉపయోగిస్తారు. అంతేగాకుండా వీటితో తామర లాంటి చర్మ సంబంధ వ్యాధులు. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు బాగా తగ్గుతాయని వారు చెబుతుంటారు. లవంగ నూనెను పొట్టుపై రాస్తే జీర్ణ సంబంధ సమస్యలు దూరమవు తాయని మనదేశీయులు భావిస్తారు. పంటినొప్పిని నివారించటంలోనూ లవంగాలు కీలకపాత్ర పోషిస్తాయి.

అద్బుతమైన సుగంధ ద్రవ్యాలు మన సొంతం

ఇప్పటివరకు ఏలకులు, దాల్చిని, లవంగాలు, జీలకర్ర అంటే ఇంట్లో ఉండే సుగంధద్రవ్యాలే అనుకుంటున్నారా? కాదు... మన దేశంలోని ఆహారపు అలవాట్లు అన్నీ ఆరోగ్యకరమైనవే. మన పోపులపెట్టెలోని వస్తువులు ఆరోగ్యం చేకూర్చడంలో తక్కువవేమీ కాదు. ఇప్పుడు ప్రపంచమంతా... ఆరోగ్యకరమైన మన సుగంధద్రవ్యాల వైపు పరిశీలనగా చూస్తోంది.

Friday, 21 September 2012

పులిపిర్లు ఇబ్బంది పెడుతుంటే

పులిపిరికాయలు చాలా సాధారణమైన సమస్య. జనాభాలో ప్రతి వందమందిలోనూ కనీసం 10-15 మందికి చర్మంపైన పులిపిరులు కనిపిస్తుంటాయి. పులిపిరికాయలను ఉలిపిరి కాయలనీ, వార్ట్స్ అనీ సాధారణ పేర్లతో పిలుస్తుంటారు. పులిపిరులకు ప్రధాన కారణం వైరస్ (హ్యూమన్ పాపిలోమా వైరస్). ఎక్కువగా యుక్త వయస్కుల్లో కనిపిస్తాయి. మగవారికంటే మహిళల్లో కొద్దిగా ఎక్కువగా కనిపిస్తాయి.

థైరాయిడ్ సమస్యకు పరిష్కారం కేరళీయ ఆయుర్వేదం

థైరాయిడ్ సమస్య ఉందని తెలియగానే చాలా మంది ఆందోళన చెందుతుంటారు. జీవితాంతం మందులు వేయాల్సి వస్తుందని భయపడుతుంటారు. నిజానికి థైరాయిడ్ గ్రంథి పనితీరులో తేడా వస్తే దాని మొత్తం జీవక్రియలపై పడుతుంది. అయితే కేరళీయ ఆయుర్వేద చికిత్స ద్వారా థైరాయిడ్ లోపాలను సరిచేసుకునే వీలుందని అంటున్నారు డాక్టర్ మంజుషా.

థైరాయిడ్ గ్రంథి పనితీరులో తేడా వల్ల థైరాయిడ్ సమస్య తలెత్తుతుంది. ముఖ్యమైన జీవక్రియల నిర్వహణలో థైరాయిడ్ గ్రంథి కీలకపాత్ర పోషిస్తుంది.

Wednesday, 19 September 2012

కాలేయంలో రాళ్లు-ఆయుర్వేద చికిత్స

మన శరీరంలో కాలేయము శరీర క్రియలో ప్రధాన భూమిక నిర్వహిస్తుంది. అది రక్తవహ స్రోతస్సులకు ముఖ్యస్థానముగా ఆయుర్వేదం చెబుతుంది.

దోష, ధాతువులకు సంబంధించిన సక్రమ పోషణ క్రమాన్నికూడా నిర్వహిస్తుంది. సాధారణ ఆహారంలోని చక్కెరను గ్లైకోజెన్‌గా కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్ ఎంజైముల తయారీలోనూ ప్రముఖ క్రియను నిర్వహిస్తుంది.

కాలేయము (లేక) యకృత్‌లో తయారయిన పిత్తము (ఱనిజఉ) పిత్తాశయములో నిల్వ ఉంచబడి శరీర క్రియ కలాపములో పాల్గొంటుంది.

శరీరతత్వం తెలుసుకోవడం ఎలా..?

ఒక ఇంట్లో నలుగురుంటే వారందరూ ఒకేలా ఆహారం తీసుకొన్నా సరే వారిలో ఒక సన్నగాను, మరొకరు ఊబకాయం కలవారిగాను, ఒకరు రోగాలతోనూ, మరొకరు ఆరోగ్యంగాను ఇలా రకరకాలుగా ఉంటుంటారు. దీనికి కారణం ఏది అనుకొంటున్నారా? అయతే దీనికి సమాధానం చెప్పగలిగింది ఒక్క ఆయుర్వేదమేనని ఆయుర్వేద నిపుణులు అంటారు.

ఆయుర్వేదంలో మనుషుల శరీర తత్వాలను మూడు రకాలుగా విభజించారు. వాతప్రకృతి, పిత్త ప్రకృతి, కఫప్రకృతులు. ఇవి మనో శారీరక విధులను నిర్వర్తించే అంతర్గత శక్తులు. అందరిలోనూ ఉంటాయి.

కీళ్ల నొప్పులకు సైంధవ లవణంతో మటుమాయం!

సాధారణంగా అనేక మందికి వయస్సు పెరిగే కొద్దీ కీళ్ళ నొప్పులు కూడా వస్తుంటాయి. ఎముకలు గట్టిపడి అవి కీళ్ళు బిగదీసుకు పోవడానికి కారణమవుతుంటాయి. ఏదో విధంగా కీళ్ళకు దెబ్బ తగలడం వల్లగానీ, ఏవైనా క్రిముల వల్ల ఇన్‌ఫెక్షన్‌ రావడం వల్లగానీ కీళ్ళ వ్యాధి రాగల అవకాశముంది.

ఈ నొప్పులు వచ్చే ముందు.. కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. కీళ్ళు ఉన్న ప్రాంతంలో కందిపోయినట్లుగా కనిపించడం, వాచినట్లుగా ఉండి, వేడిగా ఉన్నట్లు తెలుస్తోంది.