వెన్నునొప్పి మౌలికంగా ధాతుక్షయంతో ఏర్పడిన సమస్య. పెయిన్ కిల్లర్స్ ఇచ్చి ఆ నొప్పిని ఎన్నాళ్లని కప్పిపుచ్చుతారు. సర్జరీ చేసి ఏం సాధిస్తారు? మొత్తంగా వెన్నుముకను పరిపుష్ఠం చేయకపోతే, ఒక్కొక్క డిస్కూ అరిగి, ఒరిగిపోవడం తప్ప ఫలితమేమీ ఉండదు. ఏళ్ల తరబడి కొనసాగే వెన్నునొప్పి వల్ల వృత్తి సామర్థ్యాన్నే కాదు సహజమైన జీవశ క్తినే కోల్పోతారు.
అందులో భాగంగానే ఒక దశలో లైంగిక శక్తి కూడా అడుగంటిపోతుంది. ఇదంతా మొత్తంగా వెన్నెముకను బలోపేతం చేయకపోవడం వల్ల ఏర్పడిన దుర్దశ. ఆయుర్వేద వైద్యవిధానం ఇందుకు పూర్తిగా భిన్నమైనది. సప్తధాతువుల్నే కాకుండా మొత్తంగా వెన్ను వ్యవస్థనే శక్తివంతం చేసి వెన్నునొప్పి నుంచి సంపూర్ణ విముక్తిని కలిగిస్తుంది అంటున్నారు ఆయుర్వేద వైద్యనిపుణులు డాక్టర్ వర్ధన్.
చెద లు పట్టిన మూలస్థంభంలా వెన్నెముక తయారైతే, మనిషికింక బతుకేముంటుంది? బతుకు, భవిష్యత్తుల మాటెందుకు గానీ, అసలు కదల్లేని స్థితి ఏర్పడుతుంది కదా! నొప్పిని భరించలేక కొందరు అదేపనిగా పెయిన్ కిల్లర్సు వేసుకుంటారు. ఇవి నొప్పి తెలియకుండా ఆ భాగాన్ని మొద్దుబరుస్తాయే తప్ప నొప్పిని తీసేయవు. పైగా వీటిని ఎక్కువకాలం అలా వాడుతూ ఉండిపోతే, పలురకాల జీర్ణాశయ సమస్యలు వస్తాయి. వాటిలో ముఖ్యంగా కడుపునొప్పి నుంచి అల్సర్‌దాకా, ఐబిఎస్ నుంచి రక్తస్రావం దాకా ఏమైనా రావచ్చు. కొందరిలో ఇవి మలబద్దకాన్నీ, వాంతీ, వికార భావాల్నీ కలిగిస్తాయి. మగతనూ, మజ్జుతనాన్నీ నింపుతాయి. మరీ ఎక్కువ కాలం వాడితే ఇవి గుండె రక్తనాళాలనూ దెబ్బ తీయవచ్చు. రక్తం గడ్డకట్టుకుపోయేలా చేసి పక్షవాతానికి కూడా దారితీయవచ్చు.
కొంతకాలం దాకా పెయిన్‌కిల్లర్స్‌ను అలా కొనసాగిస్తూ పోతే, ఒకదశలో వాటికి బానిసైపోయి రోజూ వేసుకుంటే తప్ప నిద్రపట్టని పరిస్థితి ఏర్పడుతుంది. కేవలం కొద్ది పాటి ఉపశమనాన్ని ఇచ్చే పెయిన్ కిల్లర్స్ శరీరాన్ని ఇన్నిన్ని దుష్పరిణామాల పాలు చేస్తాయి. స్టెరాయిడల్ షాట్స్ తీసుకున్న వారికి కూడా రెండు నుంచి ఆరునెలలే ఉపశమనంగా ఉంటుంది. నిజానికి మొత్తం జీవితకాలంలో రెండు, మూడు సార్లకు మించి వాటిని తీసుకోవడానికి వీలేలేదు. ఈ సైరాయిడ్స్ దుష్ప్రభావాల్లో కొన్ని స్వల్ప కాలికంగా ఉండిపోతే, మరికొన్ని దీర్ఘకాలికంగా ఉంటాయి. స్వల్పకాలికమైన వాటిలో ఇన్‌ఫెక్షన్లు లోనికి ప్రవేశించవచ్చు. అక్కడున్న కండరాలు, టెండాన్లు, లిగమెంట్లు దెబ్బతినిపోవచ్చు. దీర్ఘకాలిక దుష్ప్రభావాల్లో స్టెరాయిడ్స్ వల్ల శరీరం బరువు పెరుగుతుంది. వీటితో పాటే రక్తపోటు, షుగర్ నిలువలు కూడా పెరిగిపోయే ప్రమాదం ఉంది. స్టెరాయిడ్స్ వల్ల వ్యాధినిరోధక శ క్తి కూడా తగ్గిపోయి శరీరం ఇన్‌ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది. ఒకదాని తరువాత ఒకటిగా నిరంతరం శరీరం రోగగ్రస్తమయ్యే స్థితి ఏర్పడుతుంది.
సర్జరీతో ఏమవుతుంది?
ప్రపంచ ఆరోగ్య సంస్థే స్వయంగా చెప్పినట్లు, వెన్నునొప్పి బాధితుల్లో కేవలం 5 శాతం మందికే అంటే మలమూత్రాలు ఆగిపోయిన దశలో సర్జరీ అవసరమవుతుంది. మిగతా 95 మందికి సర్జరీ అవసరం లేదు. సర్జరీ కోసం డబ్బు భారీమొత్తమే ఖర్చవుతుంది. అయితే అంత ఖర్చు చేసి సర్జరీ చేయించుకుని కూడా ఆ తరువాత ఎంతో భారీ నొప్పిని భరించాల్సి వస్తోంది.డిస్కులన్నీ అరిగీ అరిగీ శిథిలావస్తకు చేరడమే ఇందుకు కారణం. వాస్తవానికి సర్జరీ లేకుండానే ఈ 95 శాతం వెన్నునొప్పి సమస్యలను నయం చేసే అవకాశాలు ఉన్నాయి. వెన్నునొప్పి కారణంగా సర్జరీ చేయించుకున్న వారినీ, చేయించుకోని వారినీ పరిశీలిస్తే ఓ ఐదేళ్ల తరువాత ఇద్దరిలోనూ నొప్పి పరిస్థితీ ఒకేలా ఉందని శాస్త్రీయ అధ్యయనాల్లోనే స్పష్టమయ్యింది.
ఆయుర్వేద విశేషం
వెన్ను చికిత్సల్లో చాలా వరకు సమస్య మూలాల్ని తెలుసుకుని చేసినవి కావు. పెయిన్ కిల్లర్స్ అయినా, స్టెరాయిడల్ షాట్స్ అయినా, చివరికి సర్జరీ అయినా ఎంతసేపూ బయటికి కనిపించే లక్షణాల్ని దృష్టిలో ఉంచుకుని చేసినవే. అందుకే అవి తాత్కాలిక ఉపవమనాన్నే ఇస్తున్నాయి. పైగా డిస్కులో సమస్యఉంది కాబట్టి ఆ డిస్కును మార్చేస్తే సరిపోతుందనుకుంటే అంతకన్నా పెద్ద పొరపాటు మరొకటి ఉండదు. అందుకే ఆ డిస్కు దెబ్బతినడానికి దారి తీసిన మొత్తం కారణాల్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఆయుర్వేదం మేరు చికిత్సకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. మేరుచికి త్స వెన్నునిర్మాణాన్నీ చక్కబరుస్తుంది. అదే క్రమంలో కడుపులోకి ఇచ్చే కొన్ని ఔషధాలు మొత్తం వెన్ను వ్యవస్థనే నిలబెడ తాయి. ఎవరికైనా వెన్ను సమస్యలు మొదలయ్యాయీ అంటే అస్థిధాతువులో లోపం ఏర్పడిందని అర్థం. అస్థిధాతువు అనేది దానికదిగా విడిగా ఏర్పడిన నిర్మాణం కాదు. రసధాతువు, రక్తధాతువు, మాంసధాతువ ఈ మూడూ శక్తివంతంగా ఉన్నప్పుడే అస్థిధాతువు స్థిరంగా ఉంటుంది. ఆ క్రమంలో లైంగిక శక్తికి మూలమైన శుక్రధాతువూ బలపడుతుంది.
ఆయుర్వేద వైద్యంతో వెన్ను, సయాటికా సమస్యలు తొలగిపోవడానికి సప్తధాతువుల్నీ శక్తివంతంగా మార్చడమే కారణం. అనుబంధ వ్యవస్థల్ని చక్కదిద్దే మూల వైద్యం చేయనిదే ఏ వ్యాధినుంచైనా ముక్తి లభించదు. వెన్నునొప్పి చికిత్సలో అది మరీ ముఖ్యం. వెన్నునొప్పికి ఒకవేళ అప్పటికే సర్జరీ జరిగి ఉంటే, వారు కూడా ఆయుర్వేద చికిత్సలు తీసుకుంటే మరోసారి ఆ సమస్య తలెత్తకుండా ఉంటుంది.
డాక్టర్ వర్ధన్
ది కేరళ ఆయుర్వేదిక్ కేర్,
స్పెషాలిటీ పంచకర్మ సెంటర్, స్కైలేన్ థియేటర్ లేన్,
బషీర్‌బాగ్, హైదరాబాద్,
బ్రాంచీలు: దానవాయి పేట - రాజమండ్రి, ఎన్ ఆర్ పేట- కర్నూలు
ఫోన్: 9866666055, 8686848383
సేకరణ: ఆంధ్రజ్యోతి, సకల







0 comments:
Post a Comment