Pages

Subscribe:

Ads 468x60px

Showing posts with label హోమియో. Show all posts
Showing posts with label హోమియో. Show all posts

Friday, 28 March 2014

వయసును పెంచే బట్టతలకీ పరిష్కారం ఉందా..?

ముఖారవిందాన్ని పెంచేవి శిరోజాలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే బట్టతల ఉన్న వారు ఒకరకమైన ఆత్మన్యూనతా భావానికి గురై తమ వృత్తిలోనూ ఉన్నత స్థానాలకు ఎదగలేకపోతారు. అయితే బట్టతల ఉన్న వారు ఇప్పుడు బాధ పడుతూ కూర్చోవాల్సిన పనిలేదు. ఎందుకంటే స్టెమ్‌సెల్ థెరపీతో బట్టతలపై ఒత్తైన జుట్టు మొలిపించేలా చేయవచ్చు అని అంటున్నారు కాస్మెటాలజిస్ట్ డాక్టర్ బి.ఎన్.రత్న.

పురుషుల్లో బట్టతలకు కారణమవుతున్న డీహెచ్‌టి హార్మోన్, స్త్రీలలో జుట్టు రాలిపోవడానికి కారణమవుతున్న హార్మోన్ల అసమతుల్యత జుట్టు కుదుళ్లలోని మూలకణాల ను(స్టెమ్‌సెల్స్) ను నిర్జీవం చేస్తున్నట్లుగా పరిశోధనల్లో తేలింది.

Saturday, 28 December 2013

నోటిదుర్వాసనకి కారణాలు ఏమిటి.?

ఆహారం తీసుకోవడానికి, నీళ్లు తాగడానికి, మాట్లాడటానికి... ఇలా అనేక సందర్భాల్లో నోరును తెరుస్తుంటాం. దీంతో నోటిలోకి తగిన స్థాయిలో ఆక్సిజన్ ప్రవేశిస్తుంది. అయితే రాత్రివేళల్లో నిద్ర కారణంగా ఈ పరిస్థితి ఉండదు. కాబట్టి నోరు చాలాసేపు మూసుకుపోయి ఉంటుంది. దీంతో తగినంత ఆకి ్సజన్ అందక నోటిలో దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఫలితంగా ఉదయం నిద్రలేవగానే నోటి నుంచి దుర్వాసన వస్తుంది.

Monday, 16 December 2013

మెడనొప్పికి హోమియో చికిత్స

ఈ మధ్య కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య మెడనొప్పి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ వస్తోంది. యుక్తవయసులో ఉన్నవారు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి ముఖ్య కారణం మారుతున్న ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్లు. మెడనొప్పే కదా అని నిర్లక్ష్యం చేస్తే సమస్య ఇంకా త్రీవం అవుతుంది. అలాకాకుండా వ్యాధి తొలిదశలోనే చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయం అవుతుంది.

అధికంగా బాధించే కీళ్లనొప్పులకు ఆపరేషన్ అవసరమా..?

నేటి ఆధునిక జీవనం కీళ్ల పైన మరింత ఒత్తిడి తీసుకు వస్తోంది. ఎక్కువ సమయం కూర్చోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, బరువు పెరగడం వంటి కారణాలు కీళ్ల జబ్బులకు పరోక్షంగా దోహదం చేస్తున్నాయి. వంశపారంపర్య కారణాల వల్ల కూడా ఈ సమస్యలు చుట్టుముట్టే అవకాశం లేకపోలేదు. శరీర రక్షణ వ్యవస్థకు సంబంధించిన లోపాలు సమస్యలు కూడా కీళ్ల సమస్యలను పెంచుతాయి.

Sunday, 15 September 2013

డిఫ్తీరియా నివారించే హోమియో

డిఫ్తీరియా వ్యాధి బారిన పడుతున్న పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చిన్న పిల్లలోనే ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి ప్రాణాంతకంగా కూడా పరిణమించవచ్చు. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? వ్యాధి లక్షణాలేమిటి? హోమియో చికిత్స ద్వారా ఈ వ్యాధిని ఎలా నయం చేయవచ్చో  తెలుసుకుందాం.

మహమ్మారి వ్యాధులలో డిఫ్తీరియా ఒకటి. దీనినే మనం కోరింత దగ్గు అని పిలుస్తాం. ఈ వ్యాధికి చికిత్స కన్నా, వ్యాధి రాకుండా నివారణా మార్గాలే ఎంతో సులువు. చిన్న పిల్లలే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుంటారు.

Tuesday, 20 August 2013

కీళ్ళనొప్పులుకు శాశ్వత పరిష్కారం

కీళ్లనొప్పులతో బాధపడే వారికి నొప్పినివారణ మాత్రలు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందిస్తాయి. వ్యాధి మూల కారణాన్ని తొలగించే విధంగా చికిత్స అందించడం కేవలం హోమియో వైద్యవిధానం ద్వారా మాత్రమే సాధ్యమవుతోంది. దీర్ఘకాలంగా వేధించే ఆర్థరైటిస్‌కు హోమియో మందులతో అడ్డుకట్ట వేయవచ్చంటున్నారు ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డాక్టర్ జి. పవన్‌రెడ్డి.

Sunday, 18 August 2013

నిద్రలేమి సమస్యకు కారణాలు ఏమిటి.?

నిద్రలేమి సమస్య ప్రతీ ఒక్కరినీ బాధిస్తోంది. ముఖ్యంగా ఒత్తిడి, షిఫ్టులు, టార్గెట్లు ఉన్న ఉద్యోగాలు చేసేవారిని. దీన్నే వైద్యపరిభాషలో 'ఇన్‌సోమ్నియా' అంటారు. ఇటీవల జరిపిన సర్వేల ప్రకారం ఈ సమస్యతో బాధపడేవారు ప్రతి నలుగురిలో ఒకరు ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్య వినటానికి చిన్న సమస్యగానే అనిపిస్తుంది. కానీ ఈ సమస్యను అనుభవించే వారి బాధ అంతా ఇంతా కాదు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా, లోలోన మథనపడకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడితే సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

Sunday, 11 August 2013

థైరాయిడ్ సమతుల్యతతో స్సాండిలైటిస్ నుంచి విముక్తి

జన్యుపరమైన లోపాలకు మానసిక, శారీరక ఒత్తిళ్లు తోడైతే రోగనిరోధక వ్యవస్థ పనితీరుపై ప్రభావం పడుతుంది. దీనివల్ల మానవుడు వివిధ రకాల అనారోగ్యాలకు గురవుతున్నాడు. థైరాయిడ్ గ్రంధి అసమతుల్యత వల్ల స్పాండి లైటిస్ సమస్య తలెత్తవచ్చు. హోమియో వైద్యంతో థైరాయిడ్ సమతుల్యత వల్ల స్పాండిలైటిస్ సమస్య నుంచి విముక్తి కల్పించవచ్చంటున్నారు ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డాక్టర్ శ్రీకర్ మను.

Friday, 9 August 2013

ఆర్థరైటిస్ నివారణకు మేలైన వైద్యం

సాధారణంగా ఆర్థరైటిస్ అనే వ్యాధి కీళ్లనొప్పికి దారితీస్తుంది. కీళ్లలో ఎముకలను కప్పుతూ ఉండే కార్టిలేజ్ షాక్అబ్జర్బింగ్ మెటీరియల్‌గా ఉపయోగపడుతుంది. కార్టిలేజ్ అరిగిపోవటం వల్ల శరీరంలోని మోచేయి, మోకాలు, చేతివేళ్లు, తుంటి, భుజం జాయింట్లలో తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది. కీళ్లు దృఢంగా మారటం, వాపు వల్ల మజిల్, కీళ్లు దెబ్బతిని, రోగి కదలలేని స్థితిలోకి వెళ్లే ప్రమాదముంది. హోమియో మందులు తీసుకోవటంతోపాటు జీవనశైలిలో కొన్ని రకాల మార్పులు చేసుకోవటం ద్వారా ఆర్థరైటిస్ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చంటున్నారు ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డాక్టరు జి. పవన్‌రెడ్డి.

Tuesday, 23 July 2013

మూలకణాల పునరుత్తేజంతో బట్టతలపై ఒత్తైన జుట్టు

పురుషుల్లో బట్టతలకు కారణమవుతున్న డీహెచ్‌టి హార్మోన్, స్త్రీలలో జుట్టు రాలిపోవడానికి కారణమవుతున్న హార్మోన్ల అసమతుల్యత జుట్టు కుదుళ్లలోని మూలకణాలను(స్టెమ్‌సెల్స్)ను నిర్జీవం చేస్తున్నట్లుగా పరిశోధనల్లో తేలింది. అయితే నిర్జీవమవుతున్న మూలకణాలను పునురుత్తేజం చేస్తే బట్టతలకు అడ్డుకట్ట వేసే వీలుంది. ఇందుకు స్టెమ్‌సెల్ ఇంజెక్షన్స్, సెల్యులార్ మెడిసిన్‌లు చక్కగా ఉపయోగపడతాయని అంటున్నారు కాస్మెటాలజిస్ట్ డాక్టర్ బి.ఎన్. రత్న.

గర్భాశయ కణుతులు

ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతోమంది అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిలో గర్భాశయ సమస్యలూ ఉన్నాయి. గర్భాశయ సమస్యల్లో ఇప్పుడు ప్రస్తావించాల్సిన విషయం కణుతుల గురించి. గర్భాశయంలో కణుతులు ఏర్పడటం వల్ల స్త్రీలు మరిన్ని అనారోగ్య సమస్యలకు గురవడమే కాకుండా, మానసికంగానూ కుంగిపోతున్నారు. నిజానికి గర్భాశయ కణుతులను క్యాన్సర్ గడ్డలుగా పొరపాటు పడుతున్నవారు కూడా చాలామంది ఉన్నారు.

Thursday, 20 June 2013

వాజీకరణ ఔషధాలతో సంతాన సాఫల్యం

సంతానలేమితో బాధపడుతున్న దంపతుల మానసిక వేదన వర్ణనాతీతం. సంతానసాఫల్యం కోసం తిరగని ఆసుపత్రి, చేయించని పరీక్షలంటూ ఉండదు. కానీ ఆధునికవైద్యంలో పరిష్కారం లభించని సమస్యలకు ఆయుర్వేద వైద్యవిధానం పరిష్కారం చూపుతోంది. సంతానలేమితో బాధపడుతున్న దంపతులు ఆయుర్వేద చికిత్స తీసుకుంటే సంతానం కలిగే అవకాశాలు మెరుగవుతాయని అంటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, సెక్సాలజిస్ట్ డాక్టర్ ఎం. నరసింహ.

Saturday, 13 April 2013

సర్జరీ లేకుండానే సైనసైటిస్ మాయం

తలనొప్పి, ముక్కు దిబ్బడ, నీరు కారటం, దగ్గు, జలుబు సైనసైటిస్ లక్షణాలు. వాతావరణం మారినపుడల్లా వైరస్, బాక్టీరియా, ఇన్ఫెక్షన్‌ల వల్ల సైనసైటిస్ వ్యాధి వస్తుంటుంది. ఇటీవల 90 శాతం మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. సైనసైటిస్‌కు ఎలాంటి ఆపరేషన్ లేకుండా హోమియోలో అద్భుత చికిత్స ఉందంటున్నారు హోమియో వైద్యనిపుణులు డాక్టర్ మురళీ అంకిరెడ్డి.

జుట్టు రాలడం తగ్గేదెలా?

జీవనశైలి మారడం, క్రమబద్ధత లేని ఆహారం తీరు, ధూమపానం, మద్యపానం లాంటి చెడు వ్యసనాలు - ఇవన్నీ జుట్టుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే, పాతికేళ్లకే జుట్టు రాలడం మొదలవుతోంది. ప్రతి మనిషికీ అందం నిగ నిగలాడే నల్లటి జుట్టు. ముఖానికి అందాన్నిచ్చే జుట్టు రాలడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా రోజుకు కొంత జుట్టు రాలడం సహజం. మళ్లీ వీటి స్థానంలో కొత్త జుట్టు వస్తుంది. రోజుకు సుమారుగా 40 నుంచి 60 వెంట్రుకలు రాలుతుంటాయి. ఇంత కంటే ఎక్కువ వెంట్రుకలు రాలిపోతే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Friday, 12 October 2012

సయాటిక నొప్పికి సంపూర్ణ చికిత్స

ఆధునిక జీవితం తెచ్చిన అనారోగ్యాలలో సయాటిక నొప్పి ఒకటి. యుక్త వయస్కులు, మధ్య వయస్కులలో అధికులు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. సయాటిక నొప్పికి ఆపరేషన్ ఒక్కటే మార్గమని చాలామంది భయపడుతుంటారు. అయితే ఎటువంటి సర్జరీ అవసరం లేకుండా హోమియో మందులతోనే ఈ వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చని అంటున్నారు హోమియో నిపుణులు డాక్టర్ మురళి అంకిరెడ్డి.

Friday, 5 October 2012

 హోర్మోనల్ డిస్క్ సమస్యల నుంచి హోమియోతో విముక్తి

మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిడి, ఆధునికత తెచ్చిపెట్టిన సుఖాలు మనిషి దైనందిన జీవితాన్ని ప్రమాదకర స్థాయిలో అనారోగ్యంలోకి నెడుతున్నాయి. ముఖ్యంగా శరీరాన్ని కాపాడే రోగ నిరోధక వ్యవస్థకు చెందిన హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వల్ల వృద్ధాప్యంలో రావాల్సిన అనారోగ్యాలు చిన్న వయసులోనే మీదనపడుతున్నాయి. ఈ కోవలోనే డిస్క్ సమస్యలు ఏర్పడుతున్నాయి. హోమియో చికిత్సతో డిస్క్ సమస్యలను దూరం చేసుకోవచ్చని అంటున్నారు డాక్టర్ శ్రీకర్ మను

డయాబెటిస్‌కు ఉత్తమ పరిష్కారం

డయాబెటిస్ అదుపులో ఉన్నంత వరకు ఏ సమస్యా లేదు. నియంత్రణలో లేకపోతే అది అనేక దుష్ప్రభావాలకు దారితీస్తుంది. హోమియోపతిలో ఇచ్చే కానిస్టిట్యూషనల్ చికిత్స ద్వారా డయాబెటిస్ వల్ల దుష్ప్రభావాలకు అడ్డుకట్ట వేయవచ్చని, ఫలితంగా ఆనందకరమైన జీవితం గడపవచ్చని అంటున్నారు డాక్టర్ టి.కిరణ్‌కుమార్.

Thursday, 27 September 2012

సైనస్ సమస్యకు శాశ్వత చికిత్స

విపరీతమైన తలనొప్పి, ముక్కులు మూసుకుపోయి శ్వాసకు ఇబ్బంది, యాంటీ బయోటిక్స్ వేసినా ఫలితం శూన్యం. ఆపరేషన్ చేయించుకున్నా ఫలితం ఉంటుందన్న గ్యారంటీలేదు. సైనసైటిస్‌తో బాధపడే వారి పరిస్థితి ఇది. కానీ చల్లగాలి తగిలితే చాలు వణికిపోయే సైనస్ బాధితులకు హోమియో చికిత్స శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తుందంటున్నారు హోమియో వైద్యనిపుణులు డాక్టర్ రవికిరణ్.

Monday, 24 September 2012

చెవినొప్పికి హోమియో పరిష్కారం

"మినియర్స్ డిసీజ్"  ఇది చెవిలోపలి భాగంలో వచ్చే సమస్య. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇందులో వ్యాధి లక్షణాలు ఎల్లప్పుడూ ఉండవు. అప్పుడప్పుడు లక్షణాలు అధికమవుతుంటాయి. లక్షణాలు సాధారణంగా 20 నిమిషాల నుంచి 2 గంటల పాటు ఉండవచ్చు. సాధారణంగా ఈ వ్యాధి ఒక చెవికే వస్తుంది. ఇది ప్రాణాలకు హాని కలిగించే వ్యాధి కాదు.

Friday, 21 September 2012

‘పాలిప్స్’కు హోమియో చికిత్స

మానవ శరీర నిర్మాణంలో మక్కుకు అత్యంత ప్రాధాన్యత వుంది. మనము నిత్యం శ్వాస తీసుకోవటం వదలటం ముక్కు ద్వారానే చేస్తుంటాము. ముక్కులో ఎటువంటి అడ్డంకి లేనంత వరకు ప్రతి ఒక్కరు శ్వాసను తేలికగా తీసుకోగలుగుతారు. కాని కొంతమందిలో ఇన్‌ఫెక్షన్స్, ఇతరత్రా కారణాలవల్ల ముక్కులోని మ్యూకస్ మెంబ్రేన్ ఉబ్బి కాయలాంటి నిర్మాణాలు ఏర్పడి ముక్కు శ్వాసకి అడ్డంకిగా మారుతున్నాయి. ఇటువంటి కాయల వంటి నిర్మాణాలనే వైద్యపరిభాషలో ‘పాలిప్స్’ అంటాము.