Pages

Subscribe:

Ads 468x60px

Friday, 9 August 2013

ఆర్థరైటిస్ నివారణకు మేలైన వైద్యం

సాధారణంగా ఆర్థరైటిస్ అనే వ్యాధి కీళ్లనొప్పికి దారితీస్తుంది. కీళ్లలో ఎముకలను కప్పుతూ ఉండే కార్టిలేజ్ షాక్అబ్జర్బింగ్ మెటీరియల్‌గా ఉపయోగపడుతుంది. కార్టిలేజ్ అరిగిపోవటం వల్ల శరీరంలోని మోచేయి, మోకాలు, చేతివేళ్లు, తుంటి, భుజం జాయింట్లలో తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది. కీళ్లు దృఢంగా మారటం, వాపు వల్ల మజిల్, కీళ్లు దెబ్బతిని, రోగి కదలలేని స్థితిలోకి వెళ్లే ప్రమాదముంది. హోమియో మందులు తీసుకోవటంతోపాటు జీవనశైలిలో కొన్ని రకాల మార్పులు చేసుకోవటం ద్వారా ఆర్థరైటిస్ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చంటున్నారు ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డాక్టరు జి. పవన్‌రెడ్డి.


కీళ్లనొప్పి వచ్చిందంటే ఆర్థరైటిస్ వ్యాధి లక్షణమని గుర్తించవచ్చు. ఆర్థరైటిస్‌లో రకాలను బట్టి శరీరంలోని వివిధ భాగాలను దెబ్బతీస్తుంది. కొన్ని రకాల ఆర్థరైటిస్ సోరియాసిస్‌కు కూడా దారి తీస్తాయి. వృద్ధులనే కాదు అన్ని వయసుల వారిని కూడా ఈ వ్యాధి బాధిస్తుంది. అన్ని రకాల ఆర్థరైటిస్‌లలోనూ కీళ్ల నొప్పి సాధారణంగా వస్తుంటుంది. నొప్పి, వాపు, బిగుసుకుపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. జీవక్రియలలో మార్పులు, ఆటోఇమ్యూన్ డిసీజెస్, ఇన్‌ఫెక్షన్స్, బాధ రోగి వెన్నంటే ఉంటాయి. ఈ వ్యాధి అనేక రూపాల్లో రావచ్చు. అవి ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్, సూడోగౌట్, సొరియాటిక్ ఆర్థరైటిస్, అంకైలోజింగ్ స్పాండిలైటిస్, జువెనైల్ ఆర్థరైటిస్.

ప్రధాన కారణాలు
పురుషులతో పోల్చితే స్త్రీలలో మూడు రెట్లు ఎక్కువగా ఈ వ్యాధి వస్తుంది. ఏ వయసులోనైనా ఈ వ్యాధి ప్రారంభం కావచ్చు. కానీ 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎముకలు దెబ్బతినటం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. లిగమెంట్లు, కార్టిలేజ్‌ల వల్ల తీవ్రనొప్పి ఏర్పడుతుంది. వివిధ రకాల ఇన్ఫెక్షన్‌ల వల్ల ఆర్థరైటిస్‌కు దారితీయవచ్చు. స్థూలకాయంతోపాటు వృద్ధాప్యం వల్ల, కీళ్లు డిజ్ లొకేషన్ వల్ల కూడా ఆర్థరైటిస్ వచ్చే అవకాశముంది.

ఆస్టియోఆర్థరైటిస్
జాయింటుల్లో వచ్చే సాధారణమైన ఆర్థరైటిస్ వ్యాధి ఇది. కార్టిలేజ్ దెబ్బతినడం వల్ల రెండు ఎముకల మధ్య రాపిడి జరిగి నొప్పి మొదలవుతుంది. నొప్పితో పాటు, కీళ్లు బిగుసుకు పోవడం, కదల్చడానికి వీలులేకపోవడం, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఎక్కువగా తుంటి, వెన్నెముక, పాదం, చేతుల్లోనూ, వేళ్లలోనూ, మోకాలి జాయింటుల్లోనూ ప్రభావం చూపిస్తుంది. కార్టిలేజ్ దెబ్బతినటం వల్ల ఎముకలు రాపిడికి గురై కీళ్లనొప్పికి దారితీస్తుంది. వేళ్లు, మోకాళ్లు, మోచేతులు, వెన్నెముక నొప్పి ఏర్పడుతుంది.

రుమటాయిడ్ ఆర్ధరైటిస్
సాధారణంగా కనిపించే ఆర్థరైటిస్ వ్యాధుల్లో రెండవది. రోగనిరోధక వ్యవస్థ శరీరానికి వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. జాయింటుల్లో నొప్పి, వాపుతో ప్రారంభమై కార్టిలేజ్, ఎముకకు విస్తరిస్తుంది. రెండు వైపులా ఒకేరకమైన జాయింటుల్లో నొప్పి కలగవచ్చు. ఉదాహరణకి రెండు చేతుల మణికట్టు దగ్గర ప్రభావం ఉంటుంది.

గౌట్
కీళ్లవాతం(గౌట్) రావడానికి ప్రధాన కారణం శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం. ముఖ్యంగా జాయింట్స్ దగ్గర చిన్న స్పటికాల మాదిరిగా యూరిక్ యాసిడ్ పేరుకుపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆది పేరుకుపోతుందో జాయింట్‌లో నొప్పి, వాపు ప్రారంభమవుతుంది. కీళ్లవాతం ప్రభావం మొదట బొటన వేలు జాయింట్‌ల్లో కనిపిస్తుంది. సొరియాటిక్ ఆర్థరైటిస్
సొరియాసిస్ బారినపడిన వారిలో ఈ సమస్య కనిపిస్తుంది. 40 శాతం మందికి జన్యుపరంగా ఈ వ్యాధి వస్తుందని పరిశోధకులు తేల్చారు. తల, మోచేయి, మోకాలు, మెడ ప్రాంతాల్లో ప్యాచ్‌ల మాదిరిగా చర్మం ఎర్రగా మారుతుంది. నడుము నొప్పి ప్రారంభమవుతుంది.

అంకైలోజింగ్ స్పాండిలైటిస్
వెన్నులో తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. ఈ వ్యాధి రావడానికి కారణాలు తెలియనప్పటికీ వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉంది.

హోమియో చికిత్స
హోమియోపతి చికిత్స రోగి పరిస్థితిని బట్టి మారుతుంటుంది. రోగికి ఉన్న వ్యాధి, పాథాలాజికల్ స్థితిని బట్టి, రోగి వైద్య చరిత్రను బట్టి పరీక్షించి చికిత్స చేస్తారు. హోమియోవైద్యంలో రోగి శారీరక, మానసిక లక్షణాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలి. ఈ చికిత్స వల్ల దీర్ఘకాల ఆర్థరైటిస్‌తోపాటు దీని వల్ల కలిగిన వాపు,నొప్పి తగ్గిపోతుంది. కల్సిరియా ఫాస్ఫీరికుమ్, బ్రయోనియా, మెగ్నిషియం కర్బ్, సల్ఫర్ , నెట్రూమ్ సల్ఫ్, పల్సటిల్లా సిల్సియా, కాలి సల్ఫ్ వంటి హోమియో మందులు ఆర్థరైటిస్ నివారణకు చక్కగా ఉపయోగపడతాయి. అయితే ఈ మందులను వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి.

డాక్టర్ జి. పవన్‌రెడ్డి
హోమియో వైద్యనిపుణులు,
జెనెటిక్ హోమియోపతి
దిల్‌సుఖ్‌నగర్ - కొండాపూర్, హైదరాబాద్
ఫోన్ : 8125 108 108
8019 108 108

సేకరణ : ఆంధ్రజ్యోతి, సకల

0 comments:

Post a Comment