ముఖంపై ముడతలు పడ్డట్టు ఉందని ఎవరైనా అంటే తెగ బాధపడిపోతాం. వయసు పైబడే కొద్దీ చర్మానికి ఉండే సాగే గుణం తగ్గి చర్మం ముడతలు పడుతుంది. పెదాల దగ్గర, కళ్ల దగ్గర చర్మం బాగా ముడతలు పడుతుంది. ముఖ్యంగా నవ్వినపడు ఈ ముడతలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. వయసు మీద పడే కొద్దీ చర్మం పొడారినట్టు అ వుతుంది. పలచబడుతుంది. ఫలితంగా చర్మం తొందరగా ముడతలు పడుతుంది. పోషకాహార లోపం కూడా చర్మం ముడతలు పడడానికి ఒక కారణం.
Showing posts with label చిట్కాలు. Show all posts
Showing posts with label చిట్కాలు. Show all posts
Sunday, 12 October 2014
స్త్రీ ముఖం సౌందర్యం
మహిళలను చూసిన వెంటనే అందరి దృష్టినీ ఆకర్షించేది నుదుటి మీద వుండే బొట్టు. ఆడవారి ముఖం అందంగా ఆకర్షణగా కనిపించడానికి ప్రధాన కారణం కళ్ళకు పెట్టుకునే కాటుక, నుదుటి మీద వుండే తిలకం బొట్టు. ముఖం ఆకృతిని బట్టి ఎవరు ఏవిధమైన బొట్టు పెట్టుకుంటే అందంగా వుంటుందో తెలుసుకొని ఆవిధంగా పెట్టుకుంటే ముఖ సౌందర్యం రెట్టింపు అవుతుంది.
Labels:
beautiful-women,
indian-women,
vidya-balan,
చిట్కాలు
పగటిపూట నీరు ఎలా తాగాలి?
మనం ఉదయం పూట తాగిన నీరు 10, 11 గంటల వరకు శరీర అవసరాలను తీర్చడానికి సరిపోయింది. ఆ సమయం నుంచి శరీరానికి నీటి అవసరం మళ్లీ ఉంటుంది. పగటి పూట అంటే, ఉదయం టిఫిన్ తిన్న తర్వాత నుంచి సాయంకాలం వెలుతురున్న వరకు తాగే నీటి విషయం. ఈ సమయంలో తాగిన నీరు శరీరాన్ని శుభ్రపర్చడానికి పనికిరాదు కానీ, శరీరాన్ని ఎండ నుంచి కాపాడుకోవటానికి, పని చేసినపుడు కండరాల్లో పుట్టే వేడిని చల్లార్చడానికి, జీర్ణాది రసాల ఉత్పత్తికి సహకరిస్తుంది. పగటిపూట మనం రెండున్నర లీటర్ల నీరు తాగితే మంచిది. ఈ నీటిని ఎప్పుడు పడితే అప్పుడు, తినేటప్పుడు కాకుండా ఒక పద్ధతి ప్రకారం తాగితే సవ్యంగా ఉపయోగపడతాయి.
Labels:
drinking-water,
చిట్కాలు,
వ్యాయామం
Saturday, 29 March 2014
మతిమరుపుకి చక్కని ఔషదం బొప్పాయి
ఏమిటీ మీరీ మధ్య తరచూ మర్చిపోతున్నారు. ఏ వస్తువు ఎక్కడ పెట్టిందీ గుర్తుకు రావడం లేదా? అయితే బొప్పాయితో దానికి చెక్ పెట్టేయొచ్చంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ బొప్పాయి పండు తింటే మతిమరుపు ఉష్‌కాకి. బొప్పాయి పాలల్లో ఔషధ గుణాలున్నాయి. వీటివల్ల ఎంతో మేలు కలుగుతుంది. బొప్పాయి పాలకు పేరిన నెయ్యి కలిపి తీసుకుంటే కడుపులో నొప్పి తగ్గుతుందట!
ఒక కప్పు- రెండు ఆపిల్స్
నిజమేనండీ మీరు ప్రతిరోజూ మూడు కప్పుల టీ తాగితే ఆరు యాపిల్స్ తిన్నదానితో సమానమంటున్నారు నిపుణులు. అంతేకాదు ప్రతిరోజూ టీ తాగితే నూరేళ్ల ఎంచక్కా జీవించవచ్చంటున్నారు. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాదు కప్పు టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు కప్పు పండ్లరసం కంటే అధికం. ఒత్తిడి, మధుమేహం, క్యాన్సర్, దంతక్షయం ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలకు టీ సర్వరోగ నివారిణిలా పనిచేస్తుంది. టీ తాగితే నిత్య యవ్వనంగా ఉండొచ్చంటున్నారు. ఎందుకంటే శరీరాన్ని ముడతలు పడకుండా టీ కాపాడుతుంది. టీలో ఉన్న 500 రసాయనాలు బరువును కూడా నియంత్రిస్తాయి. టీలో పాలు కలిపి తాగడం వల్ల శరీరానికి విటమిన్స్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా అదనంగా అంది, ఎముకలు దృఢంగా తయారవుతాయంటున్నారు. మరింకెందుకు ఆలస్యం తాగేయండి టీ!
Friday, 28 March 2014
వేగంగా బరువు తగ్గించే వెజిటేబుల్స్
బరువు తగ్గించుకోవడం కోసం క్రాష్ డైట్ లేదా మోనో డైట్ చేయడం అంత మంచి పరిష్కార మార్గం కాదు. ఖచ్చితంగా బరువు తగ్గాలని నిర్ణయించుకొన్నవారు, సరైన ఆహారాలు తీసుకోవడం వల్ల అవి శరీరానికి కావల్సిన శక్తిని అందివ్వడంతో పాటు, శరీరంలో చేరిన అదనపు కొవ్వును కరిగించే విధంగా సహాయపడాలి. బరువు తగ్గాలనుకొనేవారు తక్కువ క్యాలరీలు, అదే విధంగా తక్కువ ఫ్యాట్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. శరీరంలో అదనపు కొవ్వును కరిగించే ఆహారాలు వివిధ రకాలున్నాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు, శరీరం మంచి ఒక ఆకృతిని పొందవచ్చు.
Labels:
health,
vegetables,
weight loss,
wellness,
ఆరోగ్యం,
చిట్కాలు,
బరువు,
వెజిటేబుల్స్,
వెల్ నెస్
Saturday, 28 December 2013
శీతాకాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం ఎలా
వర్ష కాలం వెళ్లి శీతాకాలం హమ్మయ్య అనుకుంటాం కాని అనుకోకుండా మనల్ని వేదించి సమస్య చర్మం పొడి బారిపోతుంది. ఈ కాలంలో దాహం ఎక్కువగా కాకపోవడం వల్ల నీళ్లు ఎక్కువగా తాగాలనిపించిదు. దీనివల్ల చర్మంలో తేమ శాతం తగ్గిపోయి పొడిబారుతుంది. దాహం ఉన్నా లేకపోయినా విధిగా నీళ్లు తాగాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను, పండ్ల రసాలను తీసుకోవాలి.
Labels:
skin-problems,
weather,
winter,
ఆరోగ్య సమస్యలు,
ఆహారం,
చిట్కాలు
Monday, 16 December 2013
సమస్యల్ని నివారించలేమా
మేధావులు సమస్యల్ని పరిష్కరిస్తారు జ్ఞానులు అసలు సమస్యే రాకుండా నిరోధిస్తారు- ఆల్‌బర్డ్ ఐన్ స్టీన్ 'జీవితం అంటే సమస్యల మయం' అంటూ ఉంటారు. ఒక సమస్య పరిష్కారం అయ్యీ కాకముందే మరో సమస్య మొదలవుతుంది కాబట్టి. నిజానికి సమస్యల్ని పరిష్కరించడం అంటే, ముళ్ల చెట్టు కొమ్మల్ని నరికేయడం లాంటిది. నరికేసిన కొమ్మ మళ్లీ చిగురేస్తుంది కదా! కాస్త వెనకో ముందో ఆ చిగురు కూడా మళ్లీ కొమ్మగా మారుతుంది కదా! నరికేశామన్న సంతృప్తే తప్ప కొమ్మల్ని నరికేసిన తాలూకు ప్రయోజన మేదీ ఉండదు. ఎప్పటికైనా ఆ చెట్టును వేళ్లతో సహా పెరికేస్తే తప్ప ఆ ముళ్ల కొమ్మల బాధలు తప్పవు.
Labels:
Albert Einstein,
చిట్కాలు
పరీక్షల సమయంలో ఒత్తిడి అవసరమా
మార్చి, ఏప్రిల్ నెలలు వచ్చాయంటే చాలు, విద్యార్థుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. విద్యార్థులతో పాటు వారి త ల్లితండ్రులకూ, ఉపాధ్యాయులకూ కంటి మీద కునుకు ఉండదు. పరీక్షా సమయాల్లోనే కాదు, పరీక్షా ఫలితాలు వెలువడే సమయంలో కూడా విద్యార్థుల్లో టెన్షన్‌కు అంతుండదు. విద్యార్థులకు దాదాపు ఏడాదంతా ఏదో ఒక కారణంగా ఒత్తిడి ఉండడం కూడా ఇప్పుడు సర్వసాధారణ విషయం. ఈ టెన్షన్ వల్ల విద్యార్థులు రకరకాల అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. పరీక్ష రాయడంలో ఏ మాత్రం తృప్తి తక్కువైనా మానసికంగా కుంగిపోవడం, ఆత్మహత్యలకు పాల్పడడం కూడా ఎక్కువైంది. పరీక్షల సమయంలో అసాధారణ మానసిక ఒత్తిడి కారణంగా అనారోగ్యాల పాలవుతున్న విద్యార్థుల సంఖ్య దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైచిలుకే ఉండగా, పరీక్షలు సరిగ్గా రాయనందుకో, ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నందుకో, ఫెయిల్ అయినందుకో ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య ఏడాదికి మూడు వేలకు పైబడే ఉంటున్నట్టు కేంద్ర ప్రభుత్వ రికార్డులు తెలియజేస్తున్నాయి.
అయితే, పరీక్షలు, ఫలితాల సందర్భంగా విద్యార్థుల్లో టెన్షన్ పెరగకుండా ఉండడానికి, విద్యార్థులు తమకు తాముగా దీన్ని తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పరిష్కార మార్గాన్ని రూపొందించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, జాతీయ గ్రామీణ ఆరోగ్య సంస్థ (ఎన్.ఆర్.హెచ్.ఎం)లు కలిసి ఇటువంటి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ ఏడాది నుంచి 24 గంటల 'హెల్త్ హెల్ప్‌లైన్'ను ప్రారంభించింది. ఈ హెల్ప్‌లైన్‌కు 'దిశ' అని పేరు పెట్టింది. దీన్ని ఇంగ్లీషులో 'డైరెక్ట్ ఇంటర్వెన్షన్ సిస్టమ్ ఫర్ హెల్త్ అవేర్‌నెస్' అంటారు. విద్యార్థులు ప్రశాంతంగా, నిబ్బరంగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో చదువుకోవడానికి, పరీక్షలు రాయడానికి తోడ్పడడమే ధ్యేయంగా ఈ ఉచిత సేవ ప్రారంభమైంది.
ప్రస్తుతానికి ఈ సేవలు మార్చి నుంచి మే నెల వరకే లభ్యమవుతాయి. వీటిని త్వరలో నవంబర్ వరకూ తీసుకు రావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మున్ముందు వీటిని అన్ని రకాల పరీక్షలకు, ఏడాది పొడుగునా అందించాలని కేంద్రం భావిస్తోంది. మొదట్లో కేరళకు మాత్రమే పరిమితమైన ఈ సేవలు ఇతర రాష్ట్రాలకూ విస్తరించాయి. పరీక్షల టెన ్షన్‌లో ఉన్న విద్యార్థులు ఉదయం 10.56 గంటల తరువాత '1056' నంబర్‌కి ఫోన్ చేసి, తమ సమస్యను తెలియజేయాలి. ఆ ఫోన్ కాల్‌ను తీసుకున్న కౌన్సెలింగ్ అధికారులు విద్యార్థుల సమస్యకు వెంటనే పరిష్కారం చెబుతారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేస్తారు. అనేక విధాలుగా ధైర్యం చెబుతారు. విద్యార్థిలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థయిర్యాన్ని పాదుకొల్పేందుకు ప్రయత్నం చేస్తారు.
అవసరమైతే దేశంలోని ప్రసిద్ధ మానసిక వైద్యులకు విద్యార్థి సమస్యను వివరించి, వారితోనే విద్యార్థికి ఫోన్ చేయిస్తారు. ప్రధాన ఆస్పత్రులలోని కౌన్సెలింగ్ సెంటర్లకు కూడా ఆ ఫోన్ కాల్‌ను బదిలీ చేస్తారు. సాధారణంగా మానసిక ఒత్తిడి ఏదో ఒక శారీరక అనారోగ్యానికి దారి తీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. పరీక్షల భయంతో పరీక్షలకు గైర్హాజర్ అయ్యే విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థలో పనిచేస్తున్న ప్రసిద్ధ మానసిక వైద్యుడు డాక్టర్ రిజ్వాన్ అహ్మద్ చెప్పారు. ఉద్యోగ రంగంలో కంటే విద్యారంగంలోనే మానసిక ఒత్తిడి స్థాయి తీవ్రంగా ఉంటోందని, విద్యార్థులలో ఎక్కువ శాతం మంది పరీక్షలను తట్టుకోలేకపోతున్నారని ఆయన తెలిపారు.
విద్యార్థుల్లో మధుమేహం, రక్తపోటు, నరాల బలహీనత, మూత్రపిండాల సమస్య, మాడుపోటు, కంటి వ్యాధులు వంటివి ప్రబలడానికి దారి తీస్తున్న మానసిక ఒత్తిడిని తగ్గించడం మీద ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. వైద్య, విద్యారంగ నిపుణులతో కలిసి, ఈ హె ల్స్‌లైన్‌ను చేపట్టింది. ప్రస్తుతానికి 14 నుంచి 22 ఏళ్ల లోపు విద్యార్థులకు అంటే, స్కూల్ ఫైనల్ నుంచి డిగ్రీ, పీజీ వరకూ వర్తింపజేస్తున్న ఈ హెల్ప్‌లైన్ సేవను క్రమంగా దేశవ్యాప్తంగా అన్ని రకాల పరీక్షా సమయాలకూ వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే వేలాది మంది విద్యార్థులు ఈ సేవను ఉపయోగించుకుంటున్నారని, వారి నుంచి వస్తున్న స్పందన కూడా ప్రోత్సాహకరంగా ఉంటోందని ఎన్.ఆర్.హెచ్.ఎం అధికారులు చెప్పారు.
"ప్రస్తుతానికి 24 మంది కౌన్సెలర్లు, ఆరుగురు మానసిక వైద్యులు ఈ ఫోన్ కాల్స్‌ను తీసుకుంటున్నారు. ఈ పథకం పురోగతిని బట్టి ఈ సంఖ్యను పెంచడం జరుగుతుంది. పలువురు కౌన్సెలర్లు, మానసిక వైద్యులు ఈ పథకంలో చేరి విద్యార్థులకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అవసరాన్ని బట్టి వారి సేవలను కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఒకేసారి 30 కాల్స్‌ను తీసుకోవడానికి అవకాశం కల్పించాం. ఫోన్ నంబర్లను రికార్డు చేసుకుని మేమే మళ్లీ ఫోన్లు చేస్తాం'' అని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి వివరించారు.
సేకరణ: ఆంధ్రజ్యోతి, సకల
Labels:
exam-fever,
exams-tensions,
fever,
tensions,
చిట్కాలు
Sunday, 15 September 2013
ఆరోగ్యానికి తాజా పండ్లు
ఆరోగ్యానికి తాజా పండ్లు ఎంతో మంచివన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ‘పండే కదా అని పిండేద్దాం’ అనుకుంటే మీ ఆరోగ్యం పని ఇక అంతే. పండ్లు కడుక్కుని అలానే తినాలిగానీ పిండి, పిప్పి చేసి జ్యూస్‌లా తాగితే మాత్రం అది కాస్తా విషంలాగా మారి.. ఆరోగ్యాన్ని హరిస్తుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. విషం అంటే అచ్చంగా విషం కాదు గానీ.. అది కలిగించే చక్కెర వ్యాధితో పోలిస్తే అంతకంటె తక్కువేం కాదు అంటున్నారు శాస్త్రవేత్తలు. పండ్లు ఆరోగ్యానికి మంచివని మనం కొనుక్కుని తింటూ వుంటాం. అయితే... అవి తియ్యగా ఉంటాయి అనే ఉద్దేశంతో మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఆ వ్యాధి ఎక్కడ వస్తుందో అని భయపడేవారు వాటికి కాస్త దూరంగా వుంటారు.
Sunday, 25 August 2013
నిరంతరం ఈ నీరసం ఏమిటి?
నాలుగు పదులైనా గడవకముందే నడవలేనంత ఈ నీరసం ఏమిటి? అనుక్షణం లక్ష్యం కోసం ఏదో చేసేయాలన్న పెద్ద ఆరాటం మనసులో. కానీ, ఏచిన్న పనిచేయాలన్నా ఎక్కడలేని నిస్సత్తువ. నిరుత్సాహం. ఆలోచనలు లోతైనవే. ప్రణాళికలూ బలమైనవే కానీ, ఆచరణలోనే అన్నీ అడ్డంకులు. కొద్ది నిమిషాలు పనిచేస్తే చాలు. ఒళ్లంతా హూనమైపోయిన ట్లు అనిపిస్తుంది. శరీరానికి అందే పోషకాల్లో ఏమీ లోపం లేకపోయినా, ఇంత అశక్తత ఎందుకు? అంటే నిపుణులు చెప్పే కారణాలు ఇలా ఉన్నాయి.
Labels:
ఆరోగ్యం,
ఆరోగ్య సమస్యలు,
ఆహారం,
చిట్కాలు
Sunday, 18 August 2013
కాబోయే తల్లి-ఆహారపు అలవాట్లు
గర్భిణులు అన్ని రకాల ఆహారపదార్థాలు అంటే ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పాలతో చేసిన పదార్థాలు, మాంసం మొదలైనవి తగిన మోతాదులో తీసుకోవాలి. తల్లికి ఎక్కువగా శక్తి లభించే ఆహారపదార్థాలు ఇవ్వడం వలన తక్కువ బరువుతో ఉన్న పిల్లలు పుట్టకుండా ఉంటారు. అలాగే కాన్పు సమయంలో, ప్రసవానంతర అత్యవసర పరిస్థితులకు గురికాకుండా ఆరోగ్యంగా ఉంటారు. గర్భిణీ సమయంలో తల్లి ఆరోగ్యానికి, బిడ్డ పెరుగుదలకు సరిపోయేంత ఆహారం కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తినాలి.
రోజూ తినే ఆహారం కంటే ఎక్కువ తినాలి. కాల్షియం, ఇనుము అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటితో పాటు పుల్లటి పండ్లు తీసుకోవాలి.
Labels:
Pregnant-Women,
ఆరోగ్యం,
ఆరోగ్య సమస్యలు,
ఆహారం,
చిట్కాలు
అల్పాహారం పట్ల అశ్రద్ధ వలదు
ఉదయాన్నే టిఫిన్ తీసుకోవడం వల్ల పలు రకాలైన వ్యాధుల బారినపడకుండా మనల్ని మనం కాపాడు కోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనలో చాలా మంది బరువు తగ్గాలనే ఉద్దేశ్యంతో ఉదయం పూట టిఫిన్ చేయడం మానేస్తుంటారు. అయితే అలా చేయడం వల్ల షుగరు వ్యాధి వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
Labels:
break-fast,
ఆరోగ్యం,
చిట్కాలు
Saturday, 13 July 2013
వంటింటి ఔషదం శొంఠి
- శొంఠిని, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయలను సమభాగాలు తీసుకొని కల్కంగా (ముద్దగా) నూరాలి. దీనికి ఆవునెయ్యిని, నువ్వుల నూనెనల మిశ్రమాన్ని నాలుగు భాగాలు కలపాలి. పెరుగు మీద తేటను 8 రెట్లు కలిపి ద్రవాంశం మొత్తం ఆవిరైపోయే వరకూ చిన్న మంట మీద మరిగించి వడపోసుకొని నిల్వ చేసుకోవాలి. దీనిని ఉదయ సాయంకాలాలు 10-20 మిల్లీలీటర్లు మోతాదులో తీసుకుంటుంటే ఉదర వ్యాధుల్లో హితకరంగా ఉంటుంది.
నిద్రలేమి సమస్యకు అశ్రద్ధ తగదు
ఆదునిక యుగంలో చాలామందిని పట్టి పీడిస్తున్న సమస్య నిద్రలేమి. దీనినే వైద్య పరిభాషలో ‘ఇన్‌సోమ్నియా’ అంటారు. ఇటీవల జరిపిన సర్వేల ప్రకారం ఈ సమస్యతో బాధపడేవారు ప్రతి నలుగురిలో ఒకరు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ సమస్య వినటానికి చిన్న సమస్యగానే అనిపిస్తుంది గాని ఈ సమస్యను అనుభవించేవారి బాధ ఇంతా అంతా కాదు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా, లోలోన మదనపడకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడుకుంటే ఈ సమస్యనుండి విముక్తి పొందవచ్చు.
Labels:
poor-sleep,
sleeping_problems,
ఆరోగ్యం,
ఆరోగ్య సమస్యలు,
చిట్కాలు
ఆరోగ్యానికి నిలయమైన పండ్లు
వేసవి కాలంలో లభించే పలు పండ్లను సేవించడం వలన శరీరంలోని వేడిని తగ్గించడమే కాకుండా శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయనడంలో సందేహం లేదు. శరీర బరువును నియంత్రించడంతోపాటు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ కొవ్వును నియంత్రిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
జలుబుకు ఆయుర్వేద చిట్కాలు
చాలామందిని తరచుగా వేధించే అనారోగ్య సమస్య జలుబు. అలా వాన చినుకుల్లో తడిస్తే చాలు పట్టుకుంటుంది పడిశము.దీనిని వదిలించుకునేందుకు ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలున్నాయి. అవేంటో చూద్దాం.
- వేడి నీటిలో పసుపు వేసి ఆ నీరును ఆవిరి పట్టించిన చెమటపట్టి పడిశం నశిస్తుంది.
Labels:
cold,
ఆరోగ్య సమస్యలు,
చిట్కాలు,
పసుపు
ఎక్కువ సమయం కూర్చునే ఉంటున్నారా
ఆఫీసులో పని చేయడం, టివి, కంప్యూటర్‌ల ముందు కూర్చోవడం ఇలా రోజుకి 11 గంటలకు పైగా కూర్చొని ఉండడం ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరిస్తోంది ఆస్ట్రేలియా పరిశోధన. ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్శటీ పరిశోధన నిపుణులు హిడ్డీ వేండర్ బ్లాక్ ఈ మధ్య ఒక పరిశోధన జరిపారు. అందులో 45 లేదా అంతకు మించిన వయసు కలిగిన 2.22 లక్షల మంది నుంచి సేకరించిన సమాచారాన్ని అనుసరించి పరిశోధన జరపడం జరిగింది.
Labels:
backpain,
problem_with_sitting,
ఆరోగ్య సమస్యలు,
చిట్కాలు
Saturday, 13 April 2013
జుట్టు రాలడం తగ్గేదెలా?
జీవనశైలి మారడం, క్రమబద్ధత లేని ఆహారం తీరు, ధూమపానం, మద్యపానం లాంటి చెడు వ్యసనాలు - ఇవన్నీ జుట్టుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే, పాతికేళ్లకే జుట్టు రాలడం మొదలవుతోంది. ప్రతి మనిషికీ అందం నిగ నిగలాడే నల్లటి జుట్టు. ముఖానికి అందాన్నిచ్చే జుట్టు రాలడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా రోజుకు కొంత జుట్టు రాలడం సహజం. మళ్లీ వీటి స్థానంలో కొత్త జుట్టు వస్తుంది. రోజుకు సుమారుగా 40 నుంచి 60 వెంట్రుకలు రాలుతుంటాయి. ఇంత కంటే ఎక్కువ వెంట్రుకలు రాలిపోతే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
Tuesday, 16 October 2012
మహా మొండి చుండ్రు.. వదలగొట్టుకునేదెలా.
చుండ్రుకు బాహ్యకారణాలు దారితీస్తాయని అందరూ సాధారణంగా భావిస్తారు. జీన్స్, చర్మతత్వాలు అంతర్గతంగా ప్రధాన పాత్ర వహించే కారణాలు. ఇతర బాహ్యకారణాలు చర్మ పరిస్థితిని తీవ్రతరం చేస్తాయి. సాధారణ ఆరోగ్య స్థితిగతులు చుండ్రుకు దారితీస్తాయన్నది నిపుణుల అభిప్రాయం.
Labels:
dandruff,
dandruff_hair,
చిట్కాలు,
చుండ్రు
Subscribe to:
Posts (Atom)

























