Pages

Subscribe:

Ads 468x60px

Showing posts with label drinking-water. Show all posts
Showing posts with label drinking-water. Show all posts

Sunday, 12 October 2014

పగటిపూట నీరు ఎలా తాగాలి?

మనం ఉదయం పూట తాగిన నీరు 10, 11 గంటల వరకు శరీర అవసరాలను తీర్చడానికి సరిపోయింది. ఆ సమయం నుంచి శరీరానికి నీటి అవసరం మళ్లీ ఉంటుంది. పగటి పూట అంటే, ఉదయం టిఫిన్‌ తిన్న తర్వాత నుంచి సాయంకాలం వెలుతురున్న వరకు తాగే నీటి విషయం. ఈ సమయంలో తాగిన నీరు శరీరాన్ని శుభ్రపర్చడానికి పనికిరాదు కానీ, శరీరాన్ని ఎండ నుంచి కాపాడుకోవటానికి, పని చేసినపుడు కండరాల్లో పుట్టే వేడిని చల్లార్చడానికి, జీర్ణాది రసాల ఉత్పత్తికి సహకరిస్తుంది. పగటిపూట మనం రెండున్నర లీటర్ల నీరు తాగితే మంచిది. ఈ నీటిని ఎప్పుడు పడితే అప్పుడు, తినేటప్పుడు కాకుండా ఒక పద్ధతి ప్రకారం తాగితే సవ్యంగా ఉపయోగపడతాయి.

Monday, 24 September 2012

నీరు... ఎప్పుడెప్పుడు? ఎంతెంత...? తాగాలి

నీరు సకల జీవరాసులకు ప్రాణాధారం. నీరు లేనిదే మనుగడే లేదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ‘నీటిని ఆరోగ్యం కోసం తప్పకుండా తాగాలని ఒకరు చెప్పడం ఏమిటి? నీరు తాగడం మనం రోజూ చేసేదే కదా!’ అని అడిగే అవకాశం ఉంది. నీరు ఎప్పుడెప్పుడు, ఎంతెంత తాగితే, ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు సమకూరతాయన్న విషయాలు తెలుసుకోవాలి. అనేక పరిశీలనలు, అధ్యయాల ద్వారా తెలిసిన అంశాలను క్రోడీకరించి ఇస్తున్న వివరాలివి...

Sunday, 2 September 2012

మంచినీళ్ళు సరిపడా తాగండంతే

మంచినీళ్లను అమృతంతో పోలుస్తారు వైద్యులు. ఎంత ఎక్కువ నీరు తాగితే అంత ఆరోగ్యమని చెబుతారు. ఆరోగ్యం నుంచి సౌందర్యం వరకూ అన్నింటిలోనూ నీరు ప్రధాన ప్రాత్ర పోషిస్తుందని చెవులువాచేలా బోధిస్తారు. కాని అవసరం కంటే ఎక్కువ నీరు తాగడం వల్ల ఆరోగ్యసమస్యలు వస్తాయని చెబుతున్నారు ఇంటర్నేషనల్ మారథన్ మెడికల్ డైరెక్టర్ ఆసోసియేషన్‌వారు. మీ శరీరానికి అవసరమయ్యే నీటికంటే ఎక్కువ తాగితే కిడ్నీలపై అధిక భారం పడుతుందంటున్నారు.

Thursday, 23 August 2012

ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో నీటి ప్రాముఖ్యత

వేసవి వచ్చిందంటే శరీరానికి నీటి అవసరమూ పెరుగుతుంది. మనలో చాలామందికి తెలుసు, మన శరీరపు బరువులో డబ్భైశాతం నీరు నిండి ఉందని. నీరు మన శరీరంలో అన్ని భాగాల్లో నిండి ఉన్నా ఊపిరితిత్తులు, మెదడు, రక్తం వంటి ద్రవాలు, లాలాజలం, అలాగే జీర్ణాశయ అవయవాలు స్రవించే ద్రవాలు మొదలైనవాటిలో అధికశాతంలో నీరు నిండి ఉంటుంది.

సాధారణంగా మనకు దాహం వేసినప్పుడే మన శరీరానికి నీరు అవసరమని మనం భానిస్తాం. అది నిజమే అయినప్పటికీ, తాజా పరిశోధనలు మన