చాలామందిని తరచుగా వేధించే అనారోగ్య సమస్య జలుబు. అలా వాన చినుకుల్లో తడిస్తే చాలు పట్టుకుంటుంది పడిశము.దీనిని వదిలించుకునేందుకు ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలున్నాయి. అవేంటో చూద్దాం.
వేడి నీటిలో పసుపు వేసి ఆ నీరును ఆవిరి పట్టించిన చెమటపట్టి పడిశం నశిస్తుంది.
నిప్పులలో పసుపుకొమ్ము వేసి ఆ పొగను పీల్చుతున్నట్లయితే జలుబు తగ్గుతుంది.
తేనెతో మిరియాల పొడి కలిపి తిన్నట్లయితే పడిశము తగ్గుతుంది
పొగడపువ్వులను ఎండబెట్టి పొడిచేసి నశ్యములా పీల్చినట్లయితే జలుబు తగ్గుముఖం పడుతుంది.
0 comments:
Post a Comment