Pages

Subscribe:

Ads 468x60px

Saturday, 13 July 2013

ఆరోగ్యానికి నిలయమైన పండ్లు

వేసవి కాలంలో లభించే పలు పండ్లను సేవించడం వలన శరీరంలోని వేడిని తగ్గించడమే కాకుండా శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయనడంలో సందేహం లేదు. శరీర బరువును నియంత్రించడంతోపాటు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ కొవ్వును నియంత్రిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

పండ్లను తీసుకోవాలనుకుంటే వీలైనంత మేరకు కడుపు ఖాళీగానున్నప్పుడు తీసుకోండి. భోజనానంతరం పండ్లను ఎట్టి పరిస్థితుల్లోను తీసుకోకండి. ఎందుకంటే భోజనానంతరం పండ్లను తీసుకుంటే కడుపులో గ్యాస్‌ పెరుగుతుందంటున్నారు వైద్యులు. ముఖ్యంగా పూర్తిగా పండిన పండ్లను తినకండి. వీటిలోనున్న పుష్టికరమైన గుణాలు పూర్తిగా నశించిపోయివుంటాయి. పండ్ల రసానికన్నా పండ్లను సేవించడమే ఉత్తమమంటున్నారు వైద్యులు.

వివిధ పండ్లతో కలిగే లాభాలుః
మామిడి పండు: ఇందులో విటమిన్ సీ, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. మామిడి పండును తీసుకోవడం వలన శరీరానికి కావలసిన శక్తి వెంటనే లభిస్తుంది.

పుచ్చకాయ: పుచ్చకాయను తినడం వలన శరీరానికి కావలసిన నీరు అందుతుంది. ఇందులో విటమిన్ బీ-12, ఫోలిక్ ఆమ్లం, మినరల్సుంటాయి. ఈ పండును తీసుకోవడం వలన వేడి నుంచి ఉపశమనం కలుగజేస్తుంది.

దోసపండు: ఇందులో విటమిన్ ఏ, పొటాషియంలు పుష్కలంగా లభిస్తాయి. భోజనానంతరం తీసుకుంటే మీరు తీసుకున్న ఆహారం సాఫీగా జీర్ణమౌతుంది. ఈ పండును సేవించిన తర్వాత పాలను తీసుకోకూడదు.

0 comments:

Post a Comment