Pages

Subscribe:

Ads 468x60px

Showing posts with label backpain. Show all posts
Showing posts with label backpain. Show all posts

Saturday, 28 December 2013

నడుమునోప్పికి నివారణ సాధ్యమా

వెన్నెముక శరీరానికి ఆవల ఉండే అవయవమేమీ కాదు కదా! దాని చుట్టూ ఉండే ఇతర వ్యవస్థలతో ముడివడే దాని పనితీరు గానీ, దాని సమస్యలు గానీ ఉంటాయి. అందుకే వెన్నెముకకు దన్నుగా ఉండే కండరాలు, లిగమెంట్లు, టెండాన్లను పట్టించుకోకుండా ఏకంగా వెన్నుపూసలకు సర్జరీ చేయడానికి సిద్ధమైపోతే ఏముంది? ఒక సర్జరీ తరువాత మరో సర్జరీతో వెన్నంతా కోతలు పెట్టుకోవడం తప్ప, జేబులు ఖాళీ చేసుకోవడం తప్ప ఒరిగేదేమీ ఉండదు. అందుకే వెన్నుతాలూకు సమస్త వ్యవస్థలకూ వైద్యం చేయడమే లక్ష్యంగా ఆయుర్వేదం పనిచేస్తుందని అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ వర్థన్.

Monday, 9 September 2013

నడుం నొప్పిని పోగొట్టుకోవడం ఎలా?

ప్రస్తుత పరిస్థితుల్లో మానవుని జీవనం ప్రకృతి సహజ విధానాలకు విరుద్ధంగా ఉంటోంది. పెరిగిపోతున్న పని ఒత్తిడి, పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల చాలామందికి 40 ఏళ్లకే నడుం నొప్పి వస్తోంది. శారీరకంగా, మానసికంగా సమస్యలు కలిగించే నడుం నొప్పిని శాశ్వతంగా దూరం చేయాలంటే ఆయుర్వేద చికిత్సే ఉత్తమమైన మార్గం అంటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ కరుణశ్రీ.

Sunday, 11 August 2013

నడుము నొప్పికి అద్భుత వైద్యం ఆయుర్వేదం

వేరు వేరు సమస్యలుగా కనపడుతున్న, వెన్నునొప్పి, కాళ్లనొప్పి, లైంగిక సమస్యల వెనక ఉన్న వ్యాధి మూలం ఒక్కటే. అందువల్ల వాటన్నిటికీ వేరు వేరు డాక్టర్ల వద్దకు వెళ్ల వ లసిన అవసరం లేదు ఒకే ఒక్క ఆయుర్వేద డాక్టర్ మీ సమస్యలన్నిటినీ పరిష్కారం చూపుతారు. వాస్తవానికి వెన్నునొప్పి అనేది వాతం వికృతి (వాత దోషం) వల్ల తలెత్తే సమస్య అయితే వాతం అనేది కేవలం వెన్నెముకకే పరిమితమై ఉండదు.

Saturday, 13 July 2013

ఎక్కువ సమయం కూర్చునే ఉంటున్నారా

ఆఫీసులో పని చేయడం, టివి, కంప్యూటర్‌ల ముందు కూర్చోవడం ఇలా రోజుకి 11 గంటలకు పైగా కూర్చొని ఉండడం ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరిస్తోంది ఆస్ట్రేలియా పరిశోధన. ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్శటీ పరిశోధన నిపుణులు హిడ్డీ వేండర్ బ్లాక్ ఈ మధ్య ఒక పరిశోధన జరిపారు. అందులో 45 లేదా అంతకు మించిన వయసు కలిగిన 2.22 లక్షల మంది నుంచి సేకరించిన సమాచారాన్ని అనుసరించి పరిశోధన జరపడం జరిగింది.

Thursday, 13 September 2012

వాతాన్ని వదిలేసి, వెన్నునొప్పికి సర్జరీలా?

వెన్నుసమస్యలన్నిటికీ అసలు కారణం శరీరంలో వాతం పెరిగిపోవడమే. ఆ వాతం వాయు రూపంలో ఉండడం వల్ల ఏ స్కానింగ్‌లోనూ కనిపించదు. ఏమీ కనిపించలేదని నార్మల్ అని వదిలేస్తే, కొద్ది రోజుల్లో సమస్య విషమించిపోతుంది. కనిపించలేదని వాతాన్ని వదిలేసి సర్జరీకి సిద్దమైతే, వెన్నునొప్పి తగ్గక పోగా మరికొన్ని కొత్త సమస్యలు మొదలవుతాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ వర్థన్, డాక్టర్ మాధురీ వర్థన్....

నడుము నొప్పి సమస్యకు చాలా కాలం దాకా సరియైన వైద్య చికిత్సలు అందకపోతే ఏమవుతుంది? ఎన్నోరకాల దుష్ప్రభావాలు తలెత్తి సమస్య క్రమంగా, మరింత సంక్లిష్టమైపోతుంది.

Saturday, 8 September 2012

స్పాండిలైటిస్ దుష్ప్రభావాలకు హోమియోతో చెక్

నేటి యాంత్రిక జీవితంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడం పరిపాటిగా మారింది. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరి శరీర జన్యువుల ఆధీనంలో పనిచేసే రోగ నిరోధక వ్యవస్థ ఎటువంటి మార్పునైనా తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. దీర్ఘకాలికంగా కొనసాగే ప్రతిచర్యలు రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయి. స్పాండిలైటిస్, యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ దుష్ప్రభావాలు శరీరంలోని ఇతర అవయవాలను దెబ్బతీస్తాయి. హోమియో వైద్యంతో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చని అంటున్నారు డాక్టర్ శ్రీకర్ మను.

Thursday, 30 August 2012

వెన్నునొప్పికి గుడ్‌బై

వెన్నునొప్పి అంటేనే భయం....భయం...వంగాలన్నా, కదలాలన్నా, ఏ కాస్త బరువెత్తాలన్నా భయం. నిజానికి దీర్ఘకాలం కొనసాగితే, ఈ నొప్పి, బతుకు దెరువుకే ఎసరు పెడుతుంది. ఇది శస్త్ర చికిత్సతో తొలగిపోయే సమస్య కాదు. ఆధునిక హోమియో చికిత్సలు మాత్రం ఈ సమస్యను తొలగించడంలో ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. తాత్కాలిక ఉపశమనం కాదు, హోమియోతో వెన్నునొప్పి శాశ్వతంగా తొలగిపోతుందంటున్నారు, హోమియో వైద్య నిపుణులు డాక్టర్ మధు వారణాశి.