ప్రస్తుత పరిస్థితుల్లో మానవుని జీవనం ప్రకృతి సహజ విధానాలకు విరుద్ధంగా ఉంటోంది. పెరిగిపోతున్న పని ఒత్తిడి, పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల చాలామందికి 40 ఏళ్లకే నడుం నొప్పి వస్తోంది. శారీరకంగా, మానసికంగా సమస్యలు కలిగించే నడుం నొప్పిని శాశ్వతంగా దూరం చేయాలంటే ఆయుర్వేద చికిత్సే ఉత్తమమైన మార్గం అంటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ కరుణశ్రీ.
నేటి జీవన విధానంలో ఆహార లోపాలు, అస్తవ్యస్థమైన దినచర్యలు, స్వప్నవిపర్యం...అంటే రాత్రివేళ నిద్రపోకపో వడం, పగటిపూట నిద్రించడం వంటి అలవాట్లు శరీర వ్యవస్థను బాగా దెబ్బతీస్తున్నాయి. ఆందోళన, మానసిక ఒత్తిడి కూడా అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. వీటిలో అతి ముఖ్యమైనది నడుం నొప్పి. ఆయుర్వేద శాస్త్రం నడుం నొప్పికి 'గృథ్రసీ వాతం'గా నామకరణం చేసింది. తొంభై శాతం మంది తమ జీవిత కాలంలో ఎప్పుడో ఒకప్పుడు కనీసం ఒక్కసారైనా నడుం నొప్పి బారిన పడతారని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.
కారణాలు:
ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవడం, స్థూలకాయం, ఎక్కువ గంటలు విపరీతంగా శ్రమించడం, అతిగా బరువులు మోయడం, ద్విచక్రవాహనం మీద ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, రోడ్డు ప్రమాదాలు, దీర్ఘకాలిక రుగ్మతలు, వంశపారంపర్య వ్యాధులు వగైరాలన్నీ నడుం నొప్పికి దారి తీస్తున్నాయి. ఈ కారణాల వల్ల వాతప్రకోపం జరుగుతుంది. ఫలితంగా ముందుగా పిరుదులకు పైభాగాన స్తబ్ధతను, నొప్పిని కలిగించి ఆ తరువాత నడుం భాగం, తొడలు, మోకాళ్లు, పిక్కలు, పాదాల్లోకి నొప్పి వ్యాపిస్తుంది. ఈ సమస్య శీతాకాలంలో ఎక్కువ అవుతుంది. నడుం భాగంలో ప్రత్యేకించి ఎల్-4, ఎల్-5 వెన్నుపూసల మధ్య ఉండే సయాటికా నరం మీద ఒత్తిడి పడటం వల్ల నడుం నొప్పి వస్తుంది.
డిస్కు మార్పులు:
వెన్నుపూసల మధ్య ఉండే డిస్కుల్లో కొన్ని మార్పులు జరిగినప్పుడు డిస్కుల మీద ఒత్తిడి పెరుగుతుంది. వాపు రావడం, డిస్కుకి రక్తప్రసరణ సరిగా లేకపోవడం, డిస్కు అరిగిపోవడం వంటి సమస్యల వల్ల ఈ నొప్పి వస్తుంది. డిస్కులలో వాపు వస్తే అందులో నుంచి చిక్కని ద్రవం బయటకు వచ్చి మేరుదండం నుంచి వచ్చే నరాలపైన ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల వెన్ను నొప్పి వస్తుంది.
లక్షణాలు:
నడుం నొప్పి, వాపు, కాస్త శ్రమించినా సూదులతో గుచ్చినట్టుగా నొప్పి తీవ్రం కావడం, కాళ్లలో తిమ్మిర్లు, మంటలు ఉంటాయి. సకాలంలో చికిత్స అందకపోతే స్పర్శజ్ఞానం కోల్పోతారు. సమస్య తీవ్రమైతే మలమూత్రాల మీద నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. పెయిన్ కిల్లర్స్‌తో మలబద్ధకం, జీర్ణాశయ సమస్యలు వస్తాయి. వెన్ను సంబంధిత సమస్యలను వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి రాకుండా ఉంటుంది.
ఆయుర్వేద చికిత్స:
నడుం నొప్పి సమస్యకు ఆయుర్వేద శాస్త్రం సూచించిన సమగ్రమైన చికిత్సా పద్ధతుల్లో నిదాన పరివర్జనము, శమన చికిత్స, శోధన చికిత్స అని మూడు ప్రధానమైనవి ఉన్నాయి.
నిదాన పరివర్జనము:
నిదాన పరివర్జనము అంటే వ్యాధికి కారణమయిన విషయాలను పాటించకపోవటం. ఉదాహరణకు విరుద్ధాహార- విహార సేవన(రాత్రి మేల్కోవటం, పగలు నిద్రపోవడం వంటివి).
శమన చికిత్సలు:
వ్యాధి దోషాలను శమింపచేయటానికి తెచ్చే ఔషధాలు. ఇందులో రోగ బలాన్ని బట్టి, రోగి బలాన్ని బట్టి చూర్ణాలు, గుటికలు, కషాయాలు, లేహ్యాలు, తైలాలు వంటి ఔషధాలు రోగికి ఇవ్వడం జరుగుతుంది. కానీ, ఈ శమన చికిత్స వల్ల కొన్ని దోషాలు మళ్లీ తిరగబడవచ్చు. అందుకే వ్యాధి తీవ్రతను బట్టి శమన చికిత్సలతో పాటు కొందరికి పంచకర్మ (శోధన చికిత్స)కూడా అవసరం. ప్రకోపించిన దోషాలను(వాత, పిత్త, కఫ) తద్వారా సమంగా చేసి శరీర శుద్ధిని, అగ్ని బలాన్ని పొందవచ్చు.
ఆయుర్వేదంలోని స్నేహకర్మ ద్వారా వెన్నుపూసల మధ్య స్నిగ్ధత్వాన్ని పెంపొందించి కీళ్ల కదలికను సులభతరం చేసే అవకాశం ఏర్పడుతుంది. బిగుసుకుపోయిన కీళ్లను స్వేదకర్మ ద్వారా వదులుగా, మృదువుగా మారేలా చేయవచ్చు.
కటివస్తి:
ఇది ఆయుర్వేదంలోని ఒక విశిష్ట ప్రక్రియ. అరిగిపోయిన మృదులాస్థి(కార్టిలేజ్)కి రక్తప్రసరణ పెంచి నొప్పి తీవ్రతను తగ్గించడంలో ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదే క్రమంలో సర్వాంగధార చికిత్స కూడా వీరికి బాగా ఉపయోగపడుతుంది.
వస్తికర్మ:
ఆయుర్వేద శాస్త్రంలో వస్తికర్మ చికిత్స అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ వస్తికర్మ చిన్న పేగులు, పెద్ద పేగులలోని ఎంటరిక్ నర్వస్ సిస్టమ్‌పై ప్రభావం చూపుతుంది. తద్వారా నాడీ కణాలలో ఏర్పడిన లోపాలను సరిచేసి బలం చేకూర్చవచ్చు. ప్రకోపించిన వాతాన్ని కూడా అలాగే పక్వాశయ వాతస్థానం కాబట్టి సహజ స్థితికి తీసుకురావచ్చు.
జాగ్రత్తలు:
అవసరమైన పోషకాహారం తీసుకుంటూ వైద్యులు సూచించిన విధానాలను అనుసరించడం చాలా ముఖ్యం. ఔషధ చికిత్సల తరువాత క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తే నడుం నొప్పి సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి కలుగుతుంది.
డాక్టర్ కరుణశ్రీ
ఎండీ, ఆయుర్వేదం
స్టార్ ఆయుర్వేద హాస్పిటల్
సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక
ఫోన్: 9030081876, 9030081861
సేకరణ: ఆంధ్రజ్యోతి, సకల







0 comments:
Post a Comment