Pages

Subscribe:

Ads 468x60px

Saturday, 28 December 2013

నడుమునోప్పికి నివారణ సాధ్యమా

వెన్నెముక శరీరానికి ఆవల ఉండే అవయవమేమీ కాదు కదా! దాని చుట్టూ ఉండే ఇతర వ్యవస్థలతో ముడివడే దాని పనితీరు గానీ, దాని సమస్యలు గానీ ఉంటాయి. అందుకే వెన్నెముకకు దన్నుగా ఉండే కండరాలు, లిగమెంట్లు, టెండాన్లను పట్టించుకోకుండా ఏకంగా వెన్నుపూసలకు సర్జరీ చేయడానికి సిద్ధమైపోతే ఏముంది? ఒక సర్జరీ తరువాత మరో సర్జరీతో వెన్నంతా కోతలు పెట్టుకోవడం తప్ప, జేబులు ఖాళీ చేసుకోవడం తప్ప ఒరిగేదేమీ ఉండదు. అందుకే వెన్నుతాలూకు సమస్త వ్యవస్థలకూ వైద్యం చేయడమే లక్ష్యంగా ఆయుర్వేదం పనిచేస్తుందని అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ వర్థన్.

వెన్నునొప్పి కొందరిలో క్రమక్రమంగా పెరుగుతూ వచ్చినా మరి కొందరిలో హఠాత్తుగానూ ప్రారంభం కావచ్చు. మొదట్లో ఉండీలేనట్లు అనిపించే వెన్నునొప్పిని చాలా మంది పట్టించుకోరు. అది వారి స్పురణలోకి కూడా రాదు. కాని స్వల్పవ్యవధిలోనే, ఆ నొప్పి స్థిరపడిపోయి, హఠాత్తుగా తీవ్రమై, వివరీతంగా బాధించే స్థితికి వెళ్లిపోవచ్చు. వె న్ను నొప్పి రావడానికి మౌలికంగా మూడు ప్రధాన కారణాలు కనిపిస్తాయి. అందులో మొదటిది, కండరాలు, లిగమెంట్లు, టెండాన్లలో వాపు ఏర్పడ టం. రెండవది డిస్కులు ఒరిపిడికి, వాపులకు గురికావడం వల్ల ఒత్తిడి ఏర్పడటం. మూడవది సయాటికా నరం గానీ, లేదా నాడీ వ్యవస్థ గానీ దె బ్బతినడం.

నొప్పి మూలాలేమిటి?
సంకోచ వ్యాకోచాల ప్రక్రియ సవ్యంగా ఉన్నప్పుడే ఎవరిలోనైనా కండరాల వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఒక సారి కండరాలు ఒత్తిడికి గురైనా ఆ తరువాత విరామం పొందగలిగితే అసలు నొప్పి సమస్యే రాదు. నొప్పి తాత్కాలికంగా ఉన్నా ఆ వెంటనే తగ్గిపోతుంది. అయితే నిరంతరపు పని ఒత్తిడి వల్ల కొన్నిసార్లు ఆ కండరాలకు విరామమే లభించదు. కండరాలు ఒత్తిడికి గురైనప్పుడు రక్తనాళాలు కూడా బిగుసుకుపోతాయి. రక్తనాళాలు బిగుసుకుపోతే, తిరిగి కండరాలు ఒత్తిడికి గురవుతాయి. ఈ మూడు విషవలయాలు వెన్ను వ్యవస్థను దారుణంగా దెబ్బ తీస్తాయి. తాత్కాలికంగా ఉండిపోయే అక్యూట్ పెయిన్ నుంచి సమస్య ఎడతెగకుండా బాధించే క్రానిక్ పెయిన్‌గా మారుతుంది. నొప్పికి కొన్నిసార్లు, డిస్కులు దెబ్బ తినడం ఒక కారణమైతే, డిస్కులతో ప్రమేయం లేకుండా కేవలం కండరాలు దెబ్బ తిన్న కారణంగా కూడా భరించరాని నొప్పి రావచ్చు. ఇక మూడవ కారణం నరాలు దెబ్బ తినిపోవడం.

అల్లోపతిలో చేసేదేమిటి?
మూల కారణాల మీదికి వెళ్లకుండా చేసే ఏ చికిత్సయినా తాత్కాలిక ఉపశమనాన్ని ఇవ్వగలదే తప్ప సమస్యనుంచి శాశ్వత విముక్తి కలిగించదు. అల్లోపతిలో కండరాల రిలాక్సేషన్ మందులు, పెయిన్ కిల్లర్లు, వాపు తగ్గడానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు ఇస్తారు. ఇవన్నీ నొప్పికి దారికి తీసిన అసలు కారణాల మీద ముసుగు కప్పేసి, తాత్కాలిక ఉపశమనాలతో సరిపెట్టేవే. ్‌స్పైన్* అనే మ్యాగజిన్ వాళ్లే స్వయంగా, సర్జరీ జరిగిన 67 శాతం మందిలో సర్జరీ ముందు కన్నా, సర్జరీ తర్వాతే వెన్నునొప్పి తీవ్రతరమవుతోందని పేర్కొన్నారు. అలాగే అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ వాళ్లు కూడా ఈ విషయంలో ్్ఆరుమాసాల నుంచి ఏడాది పాటు నాన్‌సర్జికల్ చికిత్సా విధానాలతో ఏమాత్రం ఫలితం కనిపించనప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్లాలి తప్ప, వె న్ను నొప్పి అనిపించగానే సర్జరీకి వెళ్లకూడదు అంటూ బలంగా చెప్పారు. డిస్కులకే పరిమితమైకాకుండా వెన్ను మొత్తంగా విస్తరించి నొప్పి వస్తున్నప్పుడు సర్జరీకి వెళ్లడంలో అసలు అర్థమే లేదు. అలా సర్జరీకి వెళ్లినా, ఒకదాని తరువాత ఒకటిగా మళ్లీ మళ్లీ సర్జరీలకు వెళ్లవలసిన గతి పడుతుంది.

ఆయుర్వేద వైద్యం సర్వ సమగ్రం
ఆయుర్వేదం ఎప్పుడూ వ్యాధి లక్షణాలకు వైద్యం చేయదు. వ్యాధి కారకమైన మూలాలకు చికిత్స చేస్తుంది. మొత్తంగా వివిధ శరీర వ్యసవ్థల్లో , శరీర క్రియల్లో ఏర్పడే లోపాల మీద దృష్టి సారిస్తుంది. ఆయుర్వేదం శ రీరాన్ని విభాగాలుగా కాకుండా ఒక సమగ్ర వ్యవస్థగా శరీరాన్ని గుర్తించి, చికిత్స చే స్తుంది. సరియైన చికిత్సలు అందక నొప్పి దీర్ఘకాలికంగా కొనసాగుతున్నప్పుడు శరీరంలో కొన్ని రకాల న్యూరో కెమికల్స్ విడుదల అవుతూ ఇవి మెదడులోని కొన్ని విభాగాలను దె బ్బ తీస్తాయి. ఒకవేళ అవి హైపోథాలమస్‌ను దెబ్బ తీస్తే, నిద్రలేమి , ఇంద్రియాల మధ్య సమన్వయం లేకపోవడం వంటి సమస్యలు మొదలవుతాయి. దీనివల్ల మరికొన్ని మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. ఒకవేళ న్యూరో కెమికల్స్ మెదడులోని లింబిక్ సిస్టమ్‌ను దెబ్బ తీస్తే , పురుషుల్లో అంగస్థంభనలు లేకుండా పోవచ్చు.

మరికొన్ని రకాల లైంగిక సమస్యలు తలెత్తవచ్చు. . స్త్రీలలో అయితే శృంగారంలో నొప్పి రావడం, వాంఛలు లేకుండాపోవడం వంటి లక్షణాలు వస్తాయి. మొత్తంగా చూస్తే, దీర్ఘకాలికంగా ఉండే వెన్నునొప్పి కేవలం శారీరకంగానే కాదు, కొన్ని మానసిక రుగ్మతలకు కూడా దారి తీస్తుంది. అయితే, ఆయుర్వేదం వ్యాధినీ, వ్యా«ధి గమనాన్నీ నిరోధిస్తూ, శరీరంలోని వాతపిత్తకఫాలను సంతులన స్థితిలో ఉంచుతూ, సప్తధాతువులనూ పరిపుష్టం చేస్తుంది. ఫలితంగా వెన్ను నొప్పి కారకాలు సమూలంగా తొలగిపోతాయి. ఫలితంగా వెన్ను ఒక కొత్త శక్తిని పుంజుకుంటుంది. సర్జరీతో పనిలేని సంపూర్ణవైద్యం మీకు లభిస్తుంది. ఆయుర్వేద వైద్యంతో వెన్నునొప్పి నుంచి విముక్తి లభించడమే కాదు. శరీరంలోని ఇతర వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తే ఒక అద్భుతమైన స్థితి ఏర్పడుతుంది.

డాక్టర్ వర్ధన్
ది కేరళ ఆయుర్వేదిక్ కేర్,
స్పెషాలిటీ పంచకర్మ సెంటర్, స్కైలేన్ థియేటర్ లేన్, బషీర్‌బాగ్, హైదరాబాద్, బ్రాంచీలు: దానవాయి పేట - రాజమండ్రి, ఎన్ ఆర్ పేట- కర్నూలు
ఫోన్: 9866666055, 8686848383

సేకరణ: ఆంధ్రజ్యోతి, సకల

0 comments:

Post a Comment