Pages

Subscribe:

Ads 468x60px

Saturday, 28 December 2013

వాల్ నట్స్ తో గుండెకు మేలు

రోజూ నాలుగు వాల్‌నట్స్ తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుందంటు న్నారు పరిశోధకులు. బాదం, పిస్తా, వేరుశెనగ వంటి ఇతర నట్స్‌తో పోల్చితే వాలనట్స్‌లో గుండెను ఆరోగ్యంగా ఉంచే యాంటీ అక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. పెన్సిల్వేనియాలోని స్క్రాన్‌టన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడయింది. 

" ఇతర గింజలతో పోలిస్తే వాల్‌నట్స్‌లో రెట్టింపు యాంటీ అక్సిడెంట్లు ఉన్నాయి. కానీ చాలా మంది వాల్‌నట్స్‌ను తీసుకోవడం లేదు.
రోజు వారి మెనూలో వాల్‌నట్స్ ఉండేలా చూసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. గుండె ఆరోగ్యంగా ఉండటానికి వాల్‌నట్స్ బాగా ఉపకరిస్తాయి'' అని పరిశోధనలో పాలుపంచుకున్న జొ విన్‌సన్ అభిప్రాయపడ్డారు.

మిగతా నట్స్‌తో పోల్చితే వాల్‌నట్స్‌లో రెండు నుంచి పదిహేను రెట్లు ఎక్కువగా యాంటీ అక్సిడెంట్లు ఉన్నాయి. వ్యాధి బారినపడినప్పుడు న్యాచురల్ కెమికల్స్ దెబ్బతినకుండా చూసి శరీరాన్ని రక్షించడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. చాలా మంది నట్స్‌ను వేయించుకుని తినడానికి ఇష్టపడతారు. కానీ వేయించటం వల్ల యాంటీ అక్సిడెంట్ల నాణ్యత తగ్గిపోతుంది. అయితే వాల్‌నట్స్‌ను వేయించకుండానే తింటారు కాబట్టి యాంటీ అక్సిడెంట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే పరిశోధకులు వాల్‌నట్స్‌ను తినమని సూచిస్తున్నారు. ఇంకేం...మీరూ రోజూ వాల్‌నట్స్‌ని తినేయండి. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోండి. 

సేకరణ: ఆంధ్రజ్యోతి, సకల

0 comments:

Post a Comment