దగ్గు, జలుబు, ఆయాసం, తుమ్ములు, ఇన్ఫెక్షన్ వంటివి తీవ్రమైన అనారోగ్య లక్షణాలు. వీటిలో దగ్గు పరిణామాలు ప్రమాద స్థాయిలో ఉంటున్నాయి. అందుకే ఈ రోజుల్లో దగ్గును తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. దగ్గు, దాని సంబంధిత సమస్యల నివారణకు వైద్య రంగం అనేక సూచనలు చేస్తోంది. దగ్గును నిర్లక్ష్యం చేయడం వల్లే ఇతర అనారోగ్యాలకు గురికావాల్సి వస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు.
జీవక్రియ అనారోగ్య లక్షణాలను తెలియజేసే ముఖ్యమైన సంకేతాలలో దగ్గు కూడా ఒకటి. దగ్గు, ప్రేరేపకాలను బట్టి రకరకాలుగా ఉంటుంది. దగ్గుకు అనేక కారణలున్నాయి. వాటిలో కొన్ని ప్రధానమైన కారణాల గురించి తెలుసుకోగలిగితే చికిత్ససై అవగాహన పెంచుకోవచ్చు.
అలర్జీల వల్ల: రోగనిరోధక వ్యవస్థ అవసరానికి మించి కొన్ని రకాల ప్రేరేపకాలకు ప్రతిక్రియలు ఏర్పరచటం వలన కలిగే అనారోగ్య లక్షణాలలో దగ్గు ఒకటి. ప్రేరేపకం ఎదురైన ప్రతిసారి కండ్ల నుండి నీరుకారడం, తుమ్ములు, గొంతు దురద, గొంతునొప్పి, పొడి లేదా కఫంతో కూడిన దగ్గు కలగటం అలర్జీకి సంకేతాలు. అలాగే చర్మంపై దురద, మంటతో కూడిన
పొక్కులు కూడా రావచ్చు: టాన్సిల్స్, గొంతు ఇన్ఫెక్షన్ వల్ల: రోగనిరోధక వ్యవస్థలో భాగాలైన టాన్సిల్స్, అడినాయిడ్స్ అప్పుడప్పుడు గొంతుతో పాటు సూక్ష్మ క్రిముల వలన ప్రభావితం అవుతుంటాయి. ఆ కారణంగా గొంతువాపు, నొప్పి, జ్వరము, జలుబు వస్తాయి. రాత్రి సమయంలో చలిజ్వరం, దగ్గు ఎక్కువగా ఉంటుంది.
ఆస్తమా వల్ల: ఊపిరితిత్తుల నిర్మాణవ్యవస్థలో మార్పులు కలిగినప్పుడు పడుకునే సమయంలో పొడి దగ్గు ఎక్కువగా వస్తుంంది. పొగతాగటం లేదా కాలుష్య ప్రేరేపకాలు దగ్గు, ఆయాసాన్ని ఎక్కువ చేసే అవకాశాలున్నాయి. చెవి ఇన్ఫెక్షన్ వల్ల: దీర్ఘకాలిక చెవి ఇన్ఫెక్షన్స్ వలన చెవి నుండి గొంతుకు, అక్కణ్ణుంచి శ్వాసకోశకు ఇన్ఫెక్షన్స్ సోకి దగ్గు లక్షణాలు మొదలవుతాయి. చెవినొప్పి, చీముకారటం, దవడ వాపు, వినికిడి తగ్గటం వంటివి సమస్యలూ తలెత్తవచ్చు.
సైనసైటిస్‌వల్ల: సైనసైటిస్‌తో బాధపడుతున్నవారిలో ముక్కుటెముకలు వంకరపోయి, ముక్కులో కండ పెరగుతుంది. దాని వల్ల సైనస్‌ల నుండి వచ్చే ద్రవాలు గొంతులోకి జారి గొంతును ప్రభావితం చేస్తాయి. దాంతో దగ్గుతో పాటు కఫం కూడా మొదలవుతుంది. ఫలితంగా మరిన్ని అనారోగ్య లక్షణాలు మొదలవుతాయి. తలనొప్పి, తుమ్ములు, నోటి దుర్వాసన, కండ్లులాగటం, నీరు కారటం, కండరాలు లాగటం, నిద్రలేమి వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
టి.బి.వల్ల: తరుచూ జ్వరం రావటం, దగ్గు, నీరసం, బరువు తగ్గటం, చలి ఉండటం వంటివి టీబీ ఇన్ఫెక్షన్‌లో కనిపిస్తాయి. సరైన చికిత్స లేకపోతే వెన్నుముకపై ప్రభావితం చూపించవచ్చు. ఈ పరిస్థితుల్లో పోషకాహారం లేకపోవడం, మానసిక ఒత్తిడి వలన టీబీ ఇన్ఫెక్షన్ల బారినపడవచ్చు. నిమోనియా వల్ల: చలి జ్వరం, దగ్గు, రకరకాల కఫం నిమోనియా ఇన్ఫెక్షన్స్‌కు సంకేతం. రోగనిరోధక శక్తి తగ్గటం వలన ఊపిరితిత్తులపై చూపించే ప్రభావం దీర్ఘకాలిక వ్యాధికి, ఒక్కోసారి ప్రమాదస్థాయి విపత్తులకు దారి తీయవచ్చు.
గుండె సమస్యలు వల్ల: చిన్న చిన్న శారీరక శ్రమ వలన పొడి దగ్గుతో పాటు అకస్మాత్తుగా ఆయాసం రావటం గుండె సంబంధిత సమస్యలకు సంకేతం కావచ్చు. అలాగే రక్తనాళాలలో మార్పులు సంభవించి రక్తపోటుకు దారితీసేటప్పుడు తలనొప్పి, ఆయాసం, మెడనొప్పితో కూడిన పొడి దగ్గు ఉంటుంది.
థైరాయిడ్ సమస్యల వల్ల: థైరాయిడ్ గ్రంథిలో జరుగు ప్రతిక్రియల వలన థైరాయిడ్ గ్రంథి పరిమాణం పెరిగి దానికి దగ్గరలో ఉన్న శ్వాసకోశ సంబంధిత నిర్మాణాలపై ఒత్తిడి కలిగిస్తుంది. దాంతో గొంతుపై ప్రభావం పడి దగ్గు లక్షణాలు మొదలవుతాయి.
దీర్ఘకాలిక దగ్గు వలన శ్వాసకోశ సంబంధిత కండరాలపై దుష్ప్రభావాలు కలుగుతాయి. అలాగే మల, మూత్ర విసర్జనకు తోడ్పడు కండరాలు బలహీనపడి వాటిపై నియంత్రణ కోల్పోతారు. రోగనిరోధక శక్తి తగ్గి, రకరకాల దుష్ప్రభావాలకు లోనుకావచ్చు. అంతేకాకుండా కొన్ని జన్యు లోపాల వల్ల దగ్గు లేదా ఊపిరితిత్తుల సమస్యలు, తీవ్రమైన చర్మ సమస్యలు శరీరాన్ని ప్రభావితం చేస్తున్నట్టు శాస్త్రీయ అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
ఇలా చేస్తే మంచిది
దగ్గుతో బాధపడుతున్నవారు వయసును బట్టి శారీరక శ్రమ, వ్యాయామం చేస్తే శ్వాసకోశ నిర్మాణం పటిష్టంగా ఉంటుంది. జీవక్రియ సమతుల్యత ఏర్పడి మూలకారణ నిర్మూలనకు ఉపయోగపడుతుంది. రోజూ ఉదయం వేళలో, సూర్యరశ్మిలో గడిపితే విటమిన్ డి పోషకాలు అంది రోగనిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. సహజమైన గాలి, ఇంటిలో తగినంత వెలుతురు ఉండటం, కృత్రిమ సుఖాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. పరిసరాల పరిశుభ్రతను పాటించాలి.
సేకరణ: ఆంధ్రజ్యోతి, సకల







0 comments:
Post a Comment