Pages

Subscribe:

Ads 468x60px

Saturday, 13 April 2013

జుట్టు రాలడం తగ్గేదెలా?

జీవనశైలి మారడం, క్రమబద్ధత లేని ఆహారం తీరు, ధూమపానం, మద్యపానం లాంటి చెడు వ్యసనాలు - ఇవన్నీ జుట్టుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే, పాతికేళ్లకే జుట్టు రాలడం మొదలవుతోంది. ప్రతి మనిషికీ అందం నిగ నిగలాడే నల్లటి జుట్టు. ముఖానికి అందాన్నిచ్చే జుట్టు రాలడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా రోజుకు కొంత జుట్టు రాలడం సహజం. మళ్లీ వీటి స్థానంలో కొత్త జుట్టు వస్తుంది. రోజుకు సుమారుగా 40 నుంచి 60 వెంట్రుకలు రాలుతుంటాయి. ఇంత కంటే ఎక్కువ వెంట్రుకలు రాలిపోతే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

జుట్టు రాలే సమస్యను కొంత మంది బయటకు చెప్పుకోలేరు. దాని నుండి త్వరగా విముక్తి పొందాలని మార్కెట్‌లో లభించే రకరకాల నూనెలు, షాంపులు, సబ్బులు, క్రీములు, లోషన్‌లపై దృష్టి సారిస్తారు. వీటిపై సరైన అవగాహన లేక ఆశతో వాటిని ఎక్కువగా మార్చి మార్చి వాడడం వల్ల జట్టు రాలడం తగ్గకపోగా, సమస్య ఇంకా తీవ్రమవుతుంది. ఇతర ఇన్‌ఫెక్షన్లకు కూడా దారి తీస్తుంది.

కారణాలు
పోషకపదార్థాలున్న ఆహారం తీసుకోకపోవడం. కొన్ని రకాల దీర్ఘకాల వ్యాధులు. థైరాయిడ్‌ లోపాలు ఉండడం. మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండడం. నిద్రలేమితో బాధపడడం. హార్మోన్ల సమతౌల్యం దెబ్బతినడం వల్ల చర్మం ప్రభావితమై జుట్టు రాలుతుంది. వెంట్రుకల కుదుళ్లలో ఏర్పడే ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల, వెంట్రుకలను శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల, కొందరిలో శరీర తత్త్వం వల్ల కూడా జుట్టు రాలుతుంది.

నివారణ
జుట్టు నిర్మాణానికి, ఎదగడానికి 97 శాతం ప్రోటీన్ల పాత్రే కీలకం. ప్రోటీన్ల లోపం రాకుండా జాగ్రత్తపడటం ముఖ్యం. హార్మోన్ల సమతౌల్యం కోసం పౌష్టికాహారం తీసుకోవాలి. వీలైతే ఎక్కువగా బాదం, పిస్తా, జీడిపప్పు, మొలకెత్తిన విత్తనాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి. తలకు వాడే షాంపూ, నూనె, సబ్బులను వైద్య నిపుణుల సలహా మేరకే వాడాలి. మార్కెట్‌లోకి వచ్చిన ప్రతిదీ యథేచ్ఛగా వాడకూడదు.

మందులు
జట్టు రాలడాన్ని నివారించడానికి హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. ఆయా రోగుల లక్షణాలను బట్టి ఆ మందులను వాడాల్సి ఉంటుంది. ఆ మందుల వివరాలు ఏమిటంటే...

ఆర్సెనిక్‌ ఆల్బ్‌
ఈ మందు వాడాల్సిన అవసరమున్న రోగులకు సర్వసాధారణంగా తల పొడిగా ఉండి జుట్టు రాలిపోతుంది. మధ్య రాత్రిలో దురద, తీవ్రమైన మంట ఉంటుంది.

ఆర్నికా, జబోరాంది ఆయిల్స్‌
జుట్టు సంరక్షణకు, జట్టు పెరుగుదలకు, చుండ్రు నివారణకు హోమియో వైద్యంలో ఎక్కువగా ఈ నూనెలు వాడతారు. కనీసం వారానికి మూడుసార్లు జట్టు కుదుళ్లకు చేతి వేళ్లతో ఈ నూనెలను మర్దన చేయాలి.

తూజా
వెంట్రుకల కొనలు చిట్లి ఉండి, బిరుసుగా మారతాయి. తల నుండి తెల్లటి పొట్టు రాలుతుంటుంది. దురద ఎక్కువగా ఉంటుంది. శరీరంపై పులిపిరి కాయలుండి, జట్టు రాలే వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది. ఎండ వేడికి తలలో దురద, మంట ఎక్కువవుతాయి. ఇవే కాక సల్ఫర్‌, సోరీనం, లైకోపోడియం, క్యాంథారిస్‌, కాలీమోర్‌ మందులను లక్షణాల సముదాయాన్ని అనుసరించి వాడితే సత్ఫలితాలుంటాయి. జట్టు రాలే సమస్య తీవ్రమైనప్పుడే వైద్యుని సలహా మేరకు మందులు వాడాలి.

డాక్టర్‌ పావుశెట్టి శ్రీధర్‌
హోమియో ఫిజీషియన్‌
అంజనా హోమియో హెల్త్‌కేర్‌, హన్మకొండ
సేకరణ: ప్రజాశక్తి

0 comments:

Post a Comment