Pages

Subscribe:

Ads 468x60px

Saturday, 13 April 2013

వేరుసేనగతో గుండె పదిలం

వంటింట్లో తప్పనిసరిగా వుండేవి పల్లీలు అంటే వేరుశెనగలు. ఇవిలేకుండా పొద్దున్న ఇడ్లీలోకి చట్నీ రాదు. వేపుడు కూరల్లో అందం, రుచి రాదు. బగారా బేంగన్‌లో కమ్మదనం రాదు. సాయంత్రం పిల్లలకు చిక్కీ, కాలక్షేపం అసలే కాదు! ఇవికాక పిల్లలంతా ఇష్టపడే స్నిక్కర్స్‌ వంటి చాకొలెట్లకు ఆ రుచి పల్లీల వల్లనేగా వచ్చింది. విదేశాల్లో పీనట్‌ బటర్‌, బ్రెడ్‌ బెస్ట్‌ కాంబినేషన్‌. రోజుకో గుప్పెడు తింటే చాలు... మీ ఆరోగ్యం పదిలంగా కాపాడతామని కమ్మగా చెప్పే పల్లీ కబుర్లేమిటంటే ...
  • ఇందులోని మోనో శాచ్యురేటెడ్‌ కొవ్వు గుండెకు మంచిది.
  • శరీరానికి మేలుచేసే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువ.
  • విటమిన్‌ ఇ, నియాసిన్‌, ప్రోటీన్‌, మాంగనీసు వేరుశెనగల్లో అధికం.
  • పల్లీలలోని పీచుపదార్థం జీర్ణక్రియకు మేలుచేస్తుంది. అంతేకాకుండా, పేగు కేన్సర్‌ రాకుండా అడ్డుకుంటుంది.
  • వీటిలోని కేల్షియమ్‌, విటమిన్‌ డిలు ఎముకపుష్టికి దోహదపడతాయి.
  • టైప్‌ 2 డయాబెటిస్‌కు వేరుశెనగలు మంచివి. శరీరంలోని షుగర్‌ లెవెల్స్‌ను నియంత్రించడానికి, ఇన్సులిన్‌ లెవెల్స్‌ను పెంచడానికి ఇవి సహకరిస్తాయి. .
  • ఆల్జీమర్స్‌కు విరుగుడుగా చెప్పే నియాసిన్‌ వేరుశెనగల్లో ఎక్కువ.
  • వేరుశెనగలో లివర్‌ కేన్సర్‌ను నిరోధించే శక్తి ఉంది.
ఇందులోని పోషకాలు అందరికీ మేలుచేసినా... కిడ్నీ, థైరాయిడ్‌, గుండె సంబంధిత వ్యాధులున్నవారు కొద్దిగా అప్రమత్తంగా వుండాలి. కారణం, ఇందులో కొలెస్ట్రాల్‌ శాతం ఎక్కువ. మితంగా తింటే ఏదైనా మంచిదేననే విషయం వేరుశెనగలకూ వర్తిస్తుందని గుర్తుంచుకుంటే చాలు! పూర్తిగా మానేయనక్కర్లేదు!

సేకరణ: ప్రజాశక్తి, జీవన

0 comments:

Post a Comment