ఆరోగ్యానికి తాజా పండ్లు ఎంతో మంచివన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ‘పండే కదా అని పిండేద్దాం’ అనుకుంటే మీ ఆరోగ్యం పని ఇక అంతే. పండ్లు కడుక్కుని అలానే తినాలిగానీ పిండి, పిప్పి చేసి జ్యూస్‌లా తాగితే మాత్రం అది కాస్తా విషంలాగా మారి.. ఆరోగ్యాన్ని హరిస్తుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. విషం అంటే అచ్చంగా విషం కాదు గానీ.. అది కలిగించే చక్కెర వ్యాధితో పోలిస్తే అంతకంటె తక్కువేం కాదు అంటున్నారు శాస్త్రవేత్తలు. పండ్లు ఆరోగ్యానికి మంచివని మనం కొనుక్కుని తింటూ వుంటాం. అయితే... అవి తియ్యగా ఉంటాయి అనే ఉద్దేశంతో మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఆ వ్యాధి ఎక్కడ వస్తుందో అని భయపడేవారు వాటికి కాస్త దూరంగా వుంటారు.
కానీ నిజానికి ద్రాక్ష, యాపిల్ వంటి పండ్లను నేరుగా తినేస్తే మధుమేహం సోకే అవకాశం తక్కువంటున్నారు శాస్త్రవేత్తలు. కానీ అదే పండ్లను పిండుకుని రసంగా మార్చి తీసుకుంటే మాత్రం.. జబ్బు సోకే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.. నేరుగా పండ్లను ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. అందరూ భయపడుతున్నట్టుగా టైప్-2 మధుమేహం మన దరికి రాదని వాషింగ్టన్‌లో జరిగిన అధ్యయనం నిగ్గు తేల్చింది. పీచ్, స్ట్రాబెర్రీ, నారింజ, ప్లమ్, కిస్‌మిస్ వంటి అనేక పండ్లపై పరిశోధన చేసి.. పిండకుండా ఉండినంత వరకు పండు మనకు ఫ్రెండే అని తేల్చారు శాస్త్రవేత్తలు.
సేకరణ: ఆంధ్రప్రభ







0 comments:
Post a Comment