Pages

Subscribe:

Ads 468x60px

Friday, 9 August 2013

కీళ్ల నొప్పులకు ఆయుర్వేద పరిష్కారాలు

నేటి జీవనశైలి మానవ జీవితాన్ని, ఆరోగ్యాన్ని అతలాకుతలం చేస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న వయసులోనే ఎంతో మంది కీళ్లనొప్పుల సమస్యను ఎదుర్కొంటున్నారు. అందుకు కారణాలు ఏమైనా ఆ సమస్యకు సరైన పరిష్కారం ఆయుర్వేదమే అంటున్నారు డాక్టర్ హనుమంతరావు.

ప్రస్తుతకాలంలో 30-40 సంవత్సరాలలోపే కీళ్ల నొప్పులు మొదలవుతున్నాయి. నేటి జీవన విధానంలో వచ్చిన అనేక మార్పులు ఇందుకు కారణం.
ముఖ్యంగా ఆహారపు అలవాట్లలోని మార్పు. సరైన సమయంలో భోజనం చేయకపోవటం, ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తినటం, పోషక విలువలున్న ఆహారం తినకపోవడం, వ్యాయామం చేయకపోవటం, సరైన సమయంలో నిద్రపోక పోవడం(స్వప్నవిపర్వం- అంటే పగలు నిద్రపోవడం, రాత్రి మేల్కోవటం), కూడా కొన్ని కారణాలుగా చెప్పవచ్చు.

అలాగే ఎక్కువగా ఆలోచించుట, ఆందోళన, డిప్రెషన్ వంటివి కూడా కీళ్ల నొప్పులకు కారణాలుగా పరిగణించవచ్చు. కీళ్ల నొప్పులను ఆయుర్వేద శాస్త్రంలో మూడు విధాలుగా వర్ణించారు. అవి సంధివాతం, ఆమవాతం, వాతరక్తం.

సంధివాతం: దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్‌గా ఆయుర్వేదంలో పరిగణిస్తారు. త్రిదోష పరంగా చూసినట్టయితే సంధులలో వాతం యొక్క ప్రకోపం జరుగుతుంది. తద్వారా కీళ్లలో నొప్పి, వాపు, కదిలినప్పుడు కీళ్ల నుండి శబ్దాలు వినిపిస్తాయి. ముఖ్యంగా సంధులలో (సైనోవియల్‌ఫ్లూయిడ్) శ్లేషక కఫం తగ్గుతుంది. సంధివాతంలో కదలికల వలన నొప్పి ఎక్కువ అవటం, విశ్రాంతి ఉంటే నొప్పి తగ్గటం జరుగుతుంది. ఈ సమస్య 50-60 సంవత్సరాల వారికి వస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువ.

ప్రత్యేక కారణాలు: మధుమేహం, స్థూలకాయం, సొరియాసిస్ లాంటి వ్యాధులు ఉన్నవారికి ఎక్కువగా వస్తుంటాయి.
ఆహారంలో పోషక విలు వలు లోపం వలన కూడా(విటమిన్-డి, కాల్షియం) ఈ వ్యాధి వస్తుంది. ఎక్కువగా ద్విచక్రవాహనములపై ప్రయాణించుట, అధిక బరువులు మోయడం వలన, ఎక్కువగా కం ప్యూటర్స్ ముందు కూర్చోవడం వలన ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.

ఆమవాతం: రుమాటాయిడ్ ఆర్థరైటిస్‌ని ఆమవాతంగా ఆయర్వేదంలో పరిగణిస్తారు. ఆమ- వాతం అనే రెండు దోషముల ప్రభావం వలన ఈ సమస్య వస్తుంది. ఇది మానసిక ఒత్తిడి వలన, ఎక్కువగా ఆలోచించటం, ఎక్కువగా విచారించటం, కోపం, సరైన ఆహార నియమాలు పాటించకపోవటం, వ్యాయామం చేయక పోవటం, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోవటం...ఇలాంటి కారణాలు ఈ సమస్యకు దారితీస్తాయి.
ముఖ్యంగా ఈ విధమైన కీళ్ల సమస్యలలో ఎక్కువగా వాపు, నొప్పి, మందజ్వరం, కీళ్లు బిగుసుకుపోవటం, ఆకలి మందగించటం, మలబద్దకం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి అన్ని కీళ్లలోనూ కనిపిస్తుంది.

వాతరక్తం: ఇది మధ్య వయసు వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అధిక మద్యపానం, అధిక మాంస సేవనం, ఎక్కువగా పులుపు, ఉప్పు, మసాలాలు, ఆహార పదార్థ సేవనం, ప్రిజర్వేటిస్, కెమికల్స్ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తినటం ఈ సమస్యకు ప్రధాన కారణాలు. అలాగే శారీరక శ్రమ చేయకపోవటం, ఎక్కువ సమయం ద్విచక్రవాహనాలపై ప్రయాణించటం, ఎక్కువ దూరం నడవటం..వీటన్నిటి వలన కూడా వాతము, రక్తము..ఈ రెండు దుష్టి చెంది వాతరక్తం సమస్యగా మారుతుంది. క్లినికల్‌గా చూసినట్టయితే ఈ సమస్యలో రక్తంలో యూరిక్‌యాసిడ్ లెవల్స్ పెరుగుతాయి.

లక్షణాలు: వాపు, నొప్పితో కూడిన కాలి బొటనవేలు నుండి ప్రారంభమై తర్వాత కీళ్లకు వ్యాపిస్తుంది. దీనిలో కీళ్లనొప్పులతో పాటు పైన చర్మం రంగు కూడా మారతుంది.
ఆయుర్వేదం పరిష్కార మార్గాలు: నిదాన పరివర్జనం, ఔషధ సేవన, ఆహార-విహార నియమాలు. ఈ మూడు పద్ధతుల ద్వారా వ్యాధులను పూర్తిగా నయం చేయవచ్చు.
నిదాన పరివర్జనం: వ్యా«ధికి గల కారణాలను పాటించకుండా ఉండటం ఇందులో ప్రధానమైనది. ఉదా: పగలు నిద్రపోవటం, రాత్రి మేల్కొవటం వంటివి వదిలిపెట్టటం.

ఆహార-విహార నియమాలు: ఆహారం సరైన సమయానికి తీసుకోవటం. వ్యాధి స్వభావాన్ని బట్టి పోషక విలువలు కలిగిన ఆహారం తినటం, వ్యాయామం, సరైన సమయంలో విశ్రాంతి తీసుకోవటం లాంటి నియమాలు పాటించటం.

ఔషధ సేవన: ఇందులో రెండు పద్ధతులున్నాయి. ఒకటి శమనము, రెండోది శోధనము.

శమనము: వ్యాధి దోషాలను బట్టి అభ్యంతరంగా ఔషధాలను సేవించటం.
శోధనము: అంటే..పంచకర్మ. పంచకర్మలో స్నేహకర్మ, స్వేదకర్మ (పూర్వకర్మలు)తరువాత వమన, విరేచన, వస్తి(ప్రధాన కర్మలు). ఆ తరువాత పశ్చాత్‌కర్మలు చేయించవలసిన అవసరం ఉంటుంది. ఇవికాక అభ్యంగ, శిరోధార, కటివస్తి, గ్రీవవస్తి, ఓమవస్తి, పత్రపోడలీ, వాలుకాస్వేద మొదలైన బాహ్య చికత్సలు కూడా అవసరాన్ని బట్టి ప్రయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

డాక్టర్ హనుమంతరావు (ఎండీ, ఆయుర్వేదం)
స్టార్ ఆయుర్వేద
సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లి, విజయవాడ,
విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్నాటక
ఫోన్: 90300 81876, 9030081861

సేకరణ: ఆంధ్రజ్యోతి, సకల

0 comments:

Post a Comment