Pages

Subscribe:

Ads 468x60px

Friday, 9 August 2013

కడుపులో మంటగా ఉంటే....?

చాలామంది ఉన్నట్లుండి కడుపులో మంట పుడుతోందంటూ కుర్చీలో అలాగే వాలిపోతుంటారు.
దీనికి అసిడిటీయే కారణం. అసిడిటీ రావడానికి కారణాలు ఏమిటి అని చూస్తే...

  • సరిగా నిద్ర లేకపోవడం.
  • ఆహారాన్ని త్వరగా భుజించడం. సరిగా నమిలి తినకపోవడం.
  • ఆహారంలో మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం ఉండటం.
  • ధూమపానం, మద్యపానం సేవిస్తుండటం.
  • ఉండాల్సిన బరువుకన్నా ఎక్కువ బరువు ఉండటం. రుచిగా ఉందని ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవటం మూలాన జీర్ణక్రియ సరిగా జరుగదు. దీంతో ఉదరం, గుండెల్లో మంట ప్రారంభమౌతుంది.
  • సమయానికి భోజనం చేయకపోవడం వంటివి ప్రధాన కారణాలు.

అసిడిటీ మరియు గుండెల్లో మంటను అదుపు చేసేందుకు కొన్ని చిట్కాలు :

  • అసిడిటీతో బాధపడే వారికి అరటిపండు అత్యుత్తమమైన ఔషధం. ప్రతిరోజు అరటిపండును ఆహారంగా తీసుకుంటుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది.
  • ఆహారంలో వీలైనంత మేరకు వేపుడు పదార్థాలను తగ్గించాలి. దీంతోపాటు ఊరగాయ, మసాలా దినుసులతో కూడిన ఆహారం, చాక్లెట్లను తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి.
  • యాపిల్ పండు రసం, వెనిగర్, తేనెను తగినంత నీటిలో కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని భోజనానికి ముందు సేవించి భోజనం తీసుకుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది
  • పచ్చి కూరగాయలతో తయారుచేసిన సలాడ్‌ను తగు మోతాదులో తీసుకోండి.
  • తీసుకునే ఆహారంలో భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండకండి. దీంతో పొట్టలో గ్యాస్ పేరుకుపోయే ప్రమాదం ఉంది.
  • ప్రతిరోజు ఎనిమిది గ్లాసుల నీటిని సేవిచేందుకు ప్రయత్నించండి. భోజనం తీసుకున్న వెంటనే నిద్రకు ఉపక్రమించకండి.
  • మద్యపానం, ధూమపానం అలవాటుంటే వాటిని మానేసేందుకు ప్రయత్నించండి.
  • తులసి ఆకులను ఉదయంపూట తీసుకుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది.

0 comments:

Post a Comment