Pages

Subscribe:

Ads 468x60px

Sunday, 18 August 2013

నిద్రలేమి సమస్యకు కారణాలు ఏమిటి.?

నిద్రలేమి సమస్య ప్రతీ ఒక్కరినీ బాధిస్తోంది. ముఖ్యంగా ఒత్తిడి, షిఫ్టులు, టార్గెట్లు ఉన్న ఉద్యోగాలు చేసేవారిని. దీన్నే వైద్యపరిభాషలో 'ఇన్‌సోమ్నియా' అంటారు. ఇటీవల జరిపిన సర్వేల ప్రకారం ఈ సమస్యతో బాధపడేవారు ప్రతి నలుగురిలో ఒకరు ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్య వినటానికి చిన్న సమస్యగానే అనిపిస్తుంది. కానీ ఈ సమస్యను అనుభవించే వారి బాధ అంతా ఇంతా కాదు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా, లోలోన మథనపడకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడితే సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

కారణాలు

  • మానసిక ఆందోళన ఎక్కువగా ఉండటం, సరైన ఆహారం తీసుకోకపోవడం.
  • దాంపత్య జీవితం సరిగ్గా లేకపోవడం. నెగెటివ్‌ ఆలోచనలు పెరిగిపోవటం.
  • అసహజ వాంఛలు, దీర్ఘకాలిక వ్యాధులు, ఆత్మన్యూనత భావన, వ్యక్తిగత సమస్యలు.
  • అనుమానాలు, జన్యుపరమైన కారణాలు, శారీరక సమస్యలు మొదలైన అనేక అంశాలు నిద్రలేమి సమస్యకు కారణమవుతాయి.

లక్షణాలు

  • నిద్రలోకి జారుకున్న కొద్దిసేపయ్యాక మెలకువ వస్తుంది. మళ్లీ ఎంత ప్రయత్నించినా నిద్రపట్టదు.
  • తలనొప్పి, చిరాకు, ద్వేషం, కోపం ఎక్కువగా ఉంటాయి.
  • ఏ పనిపై శ్రద్ధ పెట్టకపోవడం, పనులను వాయిదా వేయటం.
  • ఏకాగ్రత లోపించడం, ఆకలి తగ్గిపోవడం, చదువుపై శ్రద్ధ తగ్గడం.
  • నీరసంగా ఉండటం. తమలో తామే బాధపడటం.

జాగ్రత్తలు

  • మొదట మానసిక ఒత్తిడి నివారణకు యోగా, ధ్యానం, ప్రాణాయామం నిత్యం చేయాలి. ఇలా చేస్తే మానసిక ప్రశాంతతో కలిగి నిద్రలేమి తీవ్రత తగ్గుతుంది.
  • భోజనం చేసిన రెండు గంటల తర్వాత పడుకోవాలి.
  • ఫాస్ట్‌ఫుడ్స్‌, మసాలా పదార్థాలు, వేపుళ్లను మాని, పౌష్టికాహారం తీసుకోవాలి.
  • ఆకు కూరలు, కూరగాయలు, తాజా పండ్లు తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
  • వేళకు ఆహారం తీసుకుంటూ, సమయానికి నిద్రపోవాలి.
  • రోజూ వేకువజామున లేచి 45 నిమిషాలపాటు నడవటం అలవాటు చేసుకోవాలి. దీంతో రక్తప్రసరణ సక్రమంగా జరిగి మనసు ఉత్తేజపూరితమవుతుంది.
  • నిద్రలేమితో బాధపడేవారు తమ చుట్టూ ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
  • ఏవైనా సమస్యలుంటే కుటుంబసభ్యులు, స్నేహి తులతో పంచుకోవాలి.

చికిత్స
నిద్రలేమికి వైద్యం చేయించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే తీవ్రపరిణామాలు కలిగే అవకాశముంది. హోమియో వైద్యంలో మందును ఎన్నుకునే ముందు వ్యక్తి మానసిక లక్షణాలను, శారీరక లక్షణాలను, అలవాట్లను పరిగణనలోకి తీసుకుంటారు. చికిత్సలో వాడే మందులు తెలుసుకుందాం.

నక్స్‌వామికా : వీరికి ఉదయం, సాయంత్రం నిద్ర ఎక్కువగా వస్తుంది. నిద్రకు ఉపక్రమించిన తర్వాత కొంతసేపటికి నిద్ర నుండి మేల్కొంటారు. భయం కరమైన కలలతో నిద్ర నుండి మేల్కొని మళ్లీ ఎంత ప్రయత్నం చేసినా నిద్రపట్టదు. మసాలాలు, ఫాస్ట్‌ఫుడ్స్‌, కాఫీలు ఎక్కువగా తాగుతారు. శారీరక శ్రమ తక్కువగా ఉండి, మానసిక శ్రమ ఎక్కువగా ఉన్నవారికి ఈ మందు ఆలోచించదగినది. మానసిక స్థాయిలో వీరికి కోపం ఎక్కువ. శబ్దాలు, వెలుతురు భరించలేరు. ఈ లక్షణాలున్నవారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
ఇదే కాక బెల్లడోనా, ఇగ్నీషియా, జెల్సీమియం మందులతో చికిత్స చేస్తారు.

డాక్టర్‌ పావుశెట్టి శ్రీధర్‌
హోమియో ఫిజీషియన్‌
అంజనా హోమియో కేర్‌
హన్మకొండ, వరంగల్‌.
ఫోన్‌ : 9440229646

సేకరణ: ప్రజాశక్తి, జీవన

0 comments:

Post a Comment