Pages

Subscribe:

Ads 468x60px

Sunday, 18 August 2013

ఐబిఎస్ కడుపులో అగ్నిగుండం

ఐబిఎస్ అనేది పుర్రెలో పుట్టిందో, మానసిక ఒత్తిళ్లతో వచ్చిందో కాదు. అది మెదడుకూ జీర్థవ్యవస్థలో ఉండే రెండవ మెదడు అంటే గ్రహణికీ మధ్య సమన్వయం లోపించడం వల్ల తలెత్తే సమస్య. ఆ సత్యాన్ని గుర్తించని ఆధునిక వైద్యులు ఐబిఎస్‌ను ఒక అంతుచిక్కని, ఎవరూ ఏమీ చే యలేని వ్యాధిగా చిత్రిస్తున్నారు. పైపై ఉపశమానికి ఏళ్ల పర్యంతం మందులు రాస్తున్నారు. కానీ, ఐబిఎస్ మూల కార ణాలు తెలిసిన ఆయుర్వేదానికి ఆ వ్యాధిని నయం చేయడం వెన్నతో నేర్చిన విద్య అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ వర్ధన్.


ఐబిఎస్ బాధితుల మీద ఐఎఫ్ఎఫ్‌జిడి (ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఫంక్షనల్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిజార్డర్స్) అనే ఒక సంస్థ 2007లో ఒక ఆన్‌లైన్ అధ్యయనం చే సింది. వీరు నార్త్ క్యారోలినా యూనివర్సిటీ సహకారంంతో ఈ అధ్యయనం జరిగింది. అయితే ఈ అ«ధ్యయన ఫలితాలు ఆసక్తికరంగానూ కొంతమేరకు ఆందోళన కారకంగానూ ఉన్నాయి. ఈ అధ్యనం ద్వారా బయటపడ్డ విషయాల్లో తీవ్రంగా కలవరపెట్టే ఒక ప్రధాన విషయం ఏమిటంటే, వ్యాధినిర్ధారణ పరీక్షల ద్వారా ఎవరికైనా ఐబిఎస్ ఉన్నట్లు తేలడానికి ఆరున్నర ఏళ్లు పడుతోందని వారు స్పష్టం చేశారు. వ్యాధినిర్ధారణ కావడానికే ఆరున్నరేళ్లు పడితే, అతనికి వైద్య చికిత్సలు జరిగేదెప్పుడు? ఆ మందులు పనిచేసి అతడు ఆ సమస్యనుంచి విముక్తి పొందే దెప్పుడు? ఇదీ ఆధునిక వైద్య విధానాల పేరిట ఐబిఎస్ రోగులకు ఎదురవుతున్న దురవస్థలు.

ఆధునిక వైద్య విధానాల్లో నేరుగా ఐబిఎస్‌ను గుర్తించే సాంకే తిక పరిజ్ఞానం ఏదీలేదు. మిగతా వ్యాధులు ఏవీ లేవని తేల్చుకోవడం ద్వారా ఇది ఐబిఎస్ అన్న ఒక అభిప్రాయానికి రావడం త ప్ప నేరుగా ఇది ఐబిఎస్ అని చెప్పగలిగే నిశితత్వం ఏదీలేదు. దానికి కారణం ఐబిఎస్ రావడానికి గల మూలకారణం తెలియకపోవడమే. అలాంటి వారికి మిగతా వ్యాధులేవీ లేవని తేల్చడానికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించాల్సిందేగా. ఐబిఎస్ లక్షణాలు మొదలైన తొలి నాటి నుంచి వ్యాధినిర్ధారణ అయ్యేదాకా పరీక్షలు చేస్తూ వెళితే, ఆరున్నర ఏఠ్లు పడుతోంది. అన్నేళ్ల కాలంతో పాటు వాటికి ఎన్ని వేలు ఖర్చు అవుతాయి.. ఆ వ్యక్తికి ఉన్నది కేన్సర్ కాదని తేల్చడానికి వేలల్లో ఖర్చయ్యే పెట్ స్కానింగ్ కూడా చేస్తారు.

ఐబిఎస్ లక్షణాలు
ఐబిఎస్‌లో ఉండే మౌలిక లక్షణాల్లో కడుపులో నొప్పి, కడుపు పట్టేసినట్లు ఉండడం, కడుపలో అసౌకర్యంగా ఉండడం, కడుపు ఉబ్బరం మలబద్దకం, విరేచనాలు ఒకదాని తరవాత ఒకటి గా రావడం, అలా విరేచనాలు అంటే రోజుకు మూడు సార్ల కన్నా ఎక్కువగా రావడం, మలబద్దకం అంటే వారానికి మూడు సార్ల కన్నా తక్కువగా విసర్జన కావడం ఈ లక్షణాలు ఉంటాయి. విసర్జన వచ్చిన ప్రతిసారీ పరుగుగా వెళ్లాల్సిన పరిస్థితి. ఎన్నిసార్లు వెళ్లినా విసర్జన ఇంకా పూర్తి స్థాయిలో కాలేదన్న భావన. మలం జిగురుగా రావడం, ఆకలి మందగించడం, ఏ కొంచెం తిన్నా కడుపునిండినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఐబిఎస్ ఆరు మాసాలకు పైగా కొనసాగుతున్నప్పుడు మానసికమైన ఒక తీవ్రమైన ఒత్తిడి మొదలవుతుంది. అన్నం తిన్న ప్రతిసారీ వెంటనే టాయిలెట్ కోంస కోసం పరుగెత్తవలసి రావడం అతన్ని అందోళనకే కాదు ఒక దశలో డిప్రెషన్‌కు గురిచేస్తుంది. ఒక తీవ్రమైన మానసిక క్షోభ అతన్ని నిరంతరం వెంటాడుతూ ఉంటుంది.

అతనొక ఆత్మన్యూనతా భావానికి గురవుతాడు. రుచి తెలియకపోవడం, వికారం, కడుపులో ఆమ్లాలు పెరగడం, వాంతులు, ఛాతీలో మంట, కడుపులోని ద్రవాలు నోటిలోకి వచ్చే రిఫ్లక్స్ వ్యాధి, జ్వరం, మైగ్రేన్ తలనొప్పి, వెన్నునొప్పి, కండరాల నొప్పి, కీళ్లనొప్పి, రాత్రివేళ ఎక్కువసార్లు మూత్రం రావడం, ఎన్నిసార్లు మూత్రానికి వెళ్లినా పూర్తిగా విసర్జన కాలేదన్న భావన కలగడంతో పాటు శృంగారం పట్ల ఆసక్తి లేకపోవడం, స్త్రీలలో అయితే రతి సమయంలో నొప్పి రావడం, నీరసం, నిద్రలేమి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దడ, ఒళ్లంతా దురదలు రావడం, వేడికీ, చల్లదనానికీ అతిగా స్పందించే స్వభావం, అలసట ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. ఈ క్ర్రమంలో శరీరం బాగా బలహీనపడి వ్యాధినిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. ఫలితంగా శరీరం ఎప్పుడూ ఏదో ఒక వ్యాధికి గురవుతూనే ఉంటుంది. పైన పేర్కొన్న ఏ ఒక్క లక్షణం ఉన్నా, ఆయుర్వేద నిపుణుడ్ని సంప్రదించవలసిందే.

ఆయుర్వేదం తిరుగులేని వైద్యం
ఐబిఎస్ రావడానికి గల కారణమేమిటో తెలియదంటారు అల్లోపతి వారు, అంటారు. లేదా అది కేవలం మానసికమైనదేనని మానసిక ఒత్తిళ్లే పూర్తి కారణమని చెబుతారు. కానీ, ఆయుర్వేద మాత్రం నీ జీర్ణవ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే ఐబిఎస్ వస్తుందని చెబుతుంది. ప్రత్యేకించి మెదడుకు జీర్ణవ్యవస్థలోని గ్రహణి లేదా రెండవ మెదడుకు మధ్య సమన్వయం దెబ్బతినడమే కారణమని స్పష్టంగా చెబుతుంది. ఐబిఎస్ వ్యాధికి చాలా సార్లు కడుపు ఉబ్బరం కూడా ఒక మార్గమవుతుంది. అది గమనించక చాలా మంది వెంటనే యాంటాసిడ్ మాత్రలు వేసుకుంటూ ఏళ్ల కొద్దీ గడిపేస్తారు. అగ్ని మాంద్యం వల్లే తలెత్తే ఈ కడుపు ఉబ్బరం సమస్య ఈ మాత్రలతో మరింత తీవ్రమవుతుంది.

అది ఏదో ఒక దశలో అగ్నిమాంద్యం దాకా తీసుకు వెళుతుంది. అల్లోపతిలో ఐబిఎస్ ఉందని తేల్చడానికే ఆరున్నరేళ్లు పడుతుంది. తేల్చిన తరువాత అయినా అల్లోపతికి ఐబిఎస్‌కు మంచి మందులు ఉన్నాయా అంటే అవీ లేవు. అందుకే కడుపు ఉబ్బరం ( అసిడిటీ) ఉన్నప్పుడే ఆయుర్వేద డాక్టర్‌ను సంప్రదిస్తే, కడుపు ఉబ్బరం సమస్య ఐబిఎస్ గా మారే అవకాశం ఉండదు. ఒకవేళ అప్పటికే ఐబిఎస్ గా మారి ఉంటే ఆయుర్వేద ఔషధాలు ఆ వ్యాధిని నామరూపాలు లేకుండా చేస్తాయి.

డాక్టర్ వర్ధన్
ది కేరళ ఆయుర్వేదిక్ కేర్,
స్పెషాలిటీ, పంచకర్మ సెంటర్, స్కైలేన్ థియేటర్ లేన్, బషీర్‌బాగ్, హైదరాబాద్, 
బ్రాంచీలు: దానవాయి పేట - రాజమండ్రి, ఎన్ ఆర్ పేట- కర్నూలు
ఫోన్: 9866666055, 8686848383

సేకరణ: ఆంధ్రజ్యోతి, సకల

0 comments:

Post a Comment