కొలెస్ట్రాల్ పెరిగితేనే కాదు, తగ్గిపోయినా సమస్యలు తలెత్తుతాయి. పూర్తిగా వ్యర్థమైన భాగమంటూ శరీరంలో ఏదీ లేదు కాకపోతే ప్రతిదీ నిర్దిష్ఠ పాళ్లలోనే ఉండాలి. నిరంతరం నియమిత సూత్రాలకు అనుగుణంగా మసలుకుంటే కొలెస్ట్రాల్ తాలూకు సమస్యలు ఇంతగా ఉండవు. అయితే, కొలెస్ట్రాల్ కారకమైన ఆహార పదార్థాలు తినడం తగ్గించడమే కాదు. అవసరమైనంత శరీర వ్యాయామం కూడా తప్పనిసరి. కొలెస్ట్రాల్ మంచి చెడుల గురించి నిపుణులు తెలిపే కొన్ని వివరాలు.
రక్తంలో ఉండే కొవ్వు లాంటి పదార్థమే కొలెస్ట్రాల్. సహజంగా కాలేయం, శరీరంలోని ఇతర కణాలు 75 శాతం కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేస్తాయి. మనం తీసుకొనే ఆహారం నుంచి మిగిలిన 25 శాతం కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవుతుంది. . కాలేయం నుంచి కణాలకు కొలెస్ట్రాల్‌ను తీసుకెళ్లే వాహకాలైన లిపోప్రొటీన్లను బట్టి కొలెస్ట్రాల్ రెండు రకాలు. లో డెన్సిటీ లిపోప్రొటీన్ (ఎల్‌డిఎల్)తో కూడిన కొలెస్ట్రాల్ హానికరమైనది.రక్తప్రవాహానికి ఆటంకం కలిగించే కొలెస్ట్రాల్ ఇదే. డెసీలీటరు రక్తంలో 130 మిల్లీగ్రాముల కన్నా తక్కువ ఉండడం మంచిది. హై డెన్సిటీ లిపోప్రొటీన్ (హెచ్‌డిఎల్) కొలెస్ట్రాల్ మనకు మేలుచేసేది. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ మోతాదు పెరగకుండా ఇది నివారిస్తుంది. డెసీలీటరు రక్తానికి దీని మోతాదు కనీసం 40 మిల్లీగ్రాములు ఉండాలి. మొత్తం కొలెస్ట్రాల్ విలువ 200 మిల్లీగ్రాములకు మించకుండా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టే. కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల శరీరం తయారుచేసే కొలెస్ట్రాల్ మోతాదే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు కొలెస్ట్రాల్‌ను ప్రేరేపించే ఆహారానికి దూరంగా ఉండడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.. ఇవే ఉత్తమ మార్గాలు.
సన్నగా ఉన్నా...!
అదనంగా చేరిన కొలెస్ట్రాల్ వల్ల రక్తం కొవ్వులు ఎక్కువగా తీసుకుని, స్థూలకాయంతో బాధపడేవారిలో మాత్రమే కొలెస్ట్రాల్ నిలవలు పెరిగి గుండెడజబ్బులు వస్తాయని అనుకుంటాం. కాని సన్నగా ఉన్నవారిలో సైతం కొలెస్ట్రాల్ సమస్య ఉత్పన్నమై గుండెపోటు వచ్చే అవకాశం లేకపోలేదు. శాకాహారుల్లో కూడా 800 నుంచి 1500 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్‌ను కాలేయం ప్రతి రోజూ తయారుచేస్తుంది. సన్నగానే ఉన్నాం కదా అని వ్యాయామం చేయడం మానుకుంటే కొలెస్ట్రాల్ పేరుకుపోయి సమస్యలు రావచ్చు.
నష్టాలు తక్కువేమీ కాదు.
రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ మోతాదు మించితే అన్నీ కష్టాలే. మందంగా తయారైన రక్తం సక్రమంగా ప్రవహించలేదు. అదనపు కొలెస్ట్రాల్ అంతా రక్తనాళాల గోడలకు పేరుకుపోతుంది. ఫలితంగా రక్తనాళాల లోపలి భాగం చాలా సన్నబడుతుంది. తద్వారా రక్తప్రసరణలో అంతరాయం కలుగుతుంది. తగినంత వేగంగా రక్తం ప్రవహించలేదు. రక్తపోటు పెరుగుతుంది. అన్ని అవయవాలకు తగినంత రక్తం అందక సమస్యలు ఉత్పన్నమవుతాయి. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో కూడా కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు గుండెపోటు సమస్య ఎదురవుతుంది. కరొనరీ వ్యాధులకు మూలకారణం ఇదే.
తక్కువైనా సమస్యే..
కొలెస్ట్రాల్ పెరిగితే నష్టం ఎంత ఉందో తగ్గితే కూడా అంతే హాని కలుగుతుంది. మన శరీరంలో ఉన్న ప్రతి కణానికీ కొలెస్ట్రాల్ కావాలి. విటమిన్-డి, హార్మోన్ల తయారీకి కొలెస్ట్రాల్ ఉండాల్సిందే. కాలేయం తయారుచేసే కొలెస్ట్రాల్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, కార్టిసోన్, ఆల్డోస్టిరాన్ లాంటి హార్మోనల తయారీకి అెసరం. కాబట్టి కొలెస్ట్రాల్ మోతాదు తక్కువైనా సమస్యలే. శరీరం సమతుల్యత కోల్పోతుంది. ఒత్తిడి పెరుగుతుంది. సోడియం సమతుల్యత దెబ్బతింటుంది. లైంగిక సామర్థ్యం కూడా తగ్గుతుంది. ప్రవర్తనాపరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. భావావేశాల్లో తేడాలొస్తాయి.
- కొలెస్ట్రాల్ ఎంత ఉన్నదీ తెలుసుకొనేందుకు లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలి.
- 40 ఏళ్ల వయసు దాటిన నాటి నుంచి ఏడాదికి ఓ సారి ఈ పరీక్షలు చేయించుకోవాలి.
- రక్తంలో మొత్తం కొలెస్ట్రాల్ 200 మిల్లీగ్రాములు మించకూడదు.
- మేలు చేసే హెచ్‌డిఎల్ కొలె స్ట్రాల్ - ఒక డిసీలీటర్ రక్తంలో 40 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ ఉండాలి.
- హాని చేసే ఎల్.డి.ఎల్ కొలె స్ట్రాల్ - డెసిలీటర్ రక్తంలో ఇది 130 మిల్లీ గ్రాములకంటే తక్కువ ఉండాలి.
కొలెస్ట్రాల్ పెరగడానికి, మెదడు పని తీరుకు కూడా సంబంధం ఉంది. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు నాళాల గోడలు దెబ్బతిని మెదడులో చిన్న చిన్న రక్తం గడ్డలు తయారవుతాయి. వీటి సంఖ్య పెరిగి క్రమంగా జ్ఞాపక శక్తి, ఏకాగ్రత తగ్గుతాయి. డిప్రెషన్ పెరిగి రోజువారీ కార్యక్రమాల పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. దీనివల్ల కార్య దక్షత, నిర్ణయాత్మక శక్తి లోపిస్తాయి. విషయాలను గ్రహించే శక్తి కూడా త గ్గిపోతుంది. మెదడు పనితనం తగ్గిపోవడమే ఇందుకు కారణం. డిప్రెషన్‌కు ఉన్న పలు కారణాల్లో ఇదీ ప్రధానమే.
నియంత్రణా లోపాలతో...
రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉండదు. సాధారణంగా ఇతర అవయవాల్లో ఉండే రక్తపోటు మెదడుకు చేరకుండా అదుపు చేసే ఒక సహజ యంత్రాంగం మెద డులో ఉంటుంది. అయితే, మెదడు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగినపుడు ఈ యంత్రాగమే దెబ్బతింటుంది. దీనివల్ల ఇతర అవయవాల్లో కనిపించే రక్తపోటు తేడాల ప్రభావం మెదడు మీద పడుతుంది. ఫలితంగా రక్తనాళాలు రాపిడికి గురై మూసుకుపోతాయి. ఒక్కోసారి నాళాలు చిట్లి మెదడులో రక్తస్రావం కూడా కావచ్చు.
అనువంశిక సమస్య
కొందరిలో కనిపించే ఫెమిలియల్ హైపర్ కొలెస్టీమియా అనువంశికంగా వచ్చే సమస్య. వీరిలో కొవ్వు ముక్కలుగా విడిపోవడంలోనూ పంపిణీలోనూ ఎంజైముల ఉత్పత్తిలోనూ లోపాలు ఉంటాయి. దీని వల్ల హెచ్‌డి ఎల్ కొలెస్ట్రాల్ ఉత్పత్తి మరీ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా 200 నుంచి 250 మధ్య ఉండవలసిన కొలెస్ట్రాల్ 600 కన్నా మించిపోతుంది. పుట్టుకతోనే వీరిలో ఎంజైములు తక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల కాలేయం తన సహజ క్రియలను సరిగా నిర్వర్తించకపోవడం వల్ల కొవ్వు సరిగా విభజన కాకుండానే రక్తంలో కలిసిపోతుంది. దీనివల్ల యుక్త వయసులోనే వీరిలో చెడు కొలెస్ట్రాల్ మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే 50 ఏళ్లు దాటిన వారిలో మతిమరుపు లాంటి సమస్యలు రావడం సాధారణమే. అందుకే థైరాయిడ్ పరీక్ష, రక్తంలో హీమోగ్లోబిన్ పరిమాణం, కొలెస్ట్రాల్‌తో పాటు ఇతర అంశాలను తెలిపే లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు తప్పనిసరిగా చే యించాలి.
సేకరణ: ఆంధ్రజ్యోతి, సకల







0 comments:
Post a Comment