Pages

Subscribe:

Ads 468x60px

Showing posts with label cholesterol. Show all posts
Showing posts with label cholesterol. Show all posts

Sunday, 18 August 2013

కొలెస్ట్రాల్ అవసరమా-అనారోగ్యమా

కొలెస్ట్రాల్ పెరిగితేనే కాదు, తగ్గిపోయినా సమస్యలు తలెత్తుతాయి. పూర్తిగా వ్యర్థమైన భాగమంటూ శరీరంలో ఏదీ లేదు కాకపోతే ప్రతిదీ నిర్దిష్ఠ పాళ్లలోనే ఉండాలి. నిరంతరం నియమిత సూత్రాలకు అనుగుణంగా మసలుకుంటే కొలెస్ట్రాల్ తాలూకు సమస్యలు ఇంతగా ఉండవు. అయితే, కొలెస్ట్రాల్ కారకమైన ఆహార పదార్థాలు తినడం తగ్గించడమే కాదు. అవసరమైనంత శరీర వ్యాయామం కూడా తప్పనిసరి. కొలెస్ట్రాల్ మంచి చెడుల గురించి నిపుణులు తెలిపే కొన్ని వివరాలు.

Monday, 3 September 2012

ఎముకలను కాపాడే ఆలివ్‌ నూనె

ఆలివ్‌ నూనెతో ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయని కొత్త అధ్యయనం పేర్కొన్నది. స్పెయిన్‌లోని డాక్టర్‌ జోసెఫ్‌ ట్రుయెట హాస్పిటల్‌కు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. రెండేళ్లపాటు సమృద్ధిగా ఆలివ్‌ నూనె ఉన్న మెడిటేరియన్‌ ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఎముకల నిర్మాణ గుర్తులు పెరిగాయి. ఇవి ఎముకల మీద రక్షణ ప్రభావాన్నిచూపించాయి.

Sunday, 2 September 2012

ఫ్యాటీలివర్‌తో కాలేయానికి ముప్పు

మానవ శరీరంలో అతికీలకమైన అవయవం కాలేయం. ఈ అవయవంలో కొవ్వు అధికంగా చేరిపోతే ఫ్యాటీలివర్ సమస్య మొదలవుతుంది. నిర్లక్ష్యం చేస్తే లివర్ సిర్రోసిస్‌గా మారే అవకాశం ఉన్న ఈ సమస్యను ఆధునిక చికిత్సలతో సులభంగా తగ్గించవచ్చని అంటున్నారు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా. ఎమ్.ఎన్. పవన్‌కుమార్.

పై పొట్టలో నొప్పి వస్తుంటే ఎసిడిటీ అనుకుని తెలిసిన మాత్రలేవో వేసుకుని ఉండిపోతారు. చివరకు నొప్పి ఎక్కువయ్యాక ఆసుపత్రికి వెళితే అల్ట్రాసౌండ్ పరీక్షల్లో ఫ్యాటీలివర్ అని తేలుతుంది. నిర్లక్ష్యం చేస్తే ఈ సమస్య లివర్ సిర్రోసిస్‌కు దారితీసి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.

Thursday, 30 August 2012

ఓట్స్ తో స్థూలకాయానికి చెక్ చెప్పండి

ఓట్స్‌! ఇప్పుడు ఎక్కడవిన్నా ఇదే మాట! ఆరోగ్యంపట్ల శ్రద్ధ, స్థూలకాయాన్ని తగ్గించుకోవాలనే తాపత్రయం నేడు ఓట్స్‌కు ఎక్కడలేని ప్రాధాన్యతను సంతరింపజేసింది. ఓట్స్‌ తినడానికి మనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఆ సౌకర్యం ఉండటంకూడా దీని ప్రాచుర్యాన్ని పెంచింది. ఓట్స్‌ను పాలలో, మజ్జిగలోనూ తినొచ్చు. బెల్లం కలిపి పాయసంలా, కాదంటే పళ్ల ముక్కలు, కూరగాయల ముక్కలు, నట్స్‌తో సలాడ్‌లా తినొచ్చు. ఇవికాక ఇప్పుడు ఉప్మా, ఇడ్లీ, స్వీటు, హాటు... ఇలా అన్నిటా ఓట్స్‌దే హవాగా ఉంది. మరి ఇంతగా ఆదరణకు నోచుకున్న ఓట్స్‌లోని సద్గుణాలేంటో ఓసారి తరచిచూద్దాం.

Monday, 20 August 2012

కిడ్నీ సంబంధిత రోగాలను తగ్గించే దానిమ్మపండు

దానిమ్మ పండు జావతో కిడ్నీ రోగాలకు చెక్ పెట్టవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. దానిమ్మ పండులో యాంటియోయాక్సిడెంట్స్ ఉన్నందున కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఎంతగానో మేలు చేస్తుందని ఇజ్రాయేల్‌కు చెందిన వెస్టర్న్ గలిలీ మెడికల్ సెంటర్ నిర్వహించిన పరిశోధనలో తేలింది.

కిడ్నీ వ్యాధిగస్తులు దానిమ్మ పండు జ్యూస్‌ తీసుకోవడం ద్వారా రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గుముఖం పట్టడాన్ని నియంత్రిస్తుందని గలిలీ మెడికల్ సెంటర్ పరిశోధకులు తెలిపారు.