Pages

Subscribe:

Ads 468x60px

Showing posts with label liver. Show all posts
Showing posts with label liver. Show all posts

Wednesday, 19 September 2012

కాలేయంలో రాళ్లు-ఆయుర్వేద చికిత్స

మన శరీరంలో కాలేయము శరీర క్రియలో ప్రధాన భూమిక నిర్వహిస్తుంది. అది రక్తవహ స్రోతస్సులకు ముఖ్యస్థానముగా ఆయుర్వేదం చెబుతుంది.

దోష, ధాతువులకు సంబంధించిన సక్రమ పోషణ క్రమాన్నికూడా నిర్వహిస్తుంది. సాధారణ ఆహారంలోని చక్కెరను గ్లైకోజెన్‌గా కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్ ఎంజైముల తయారీలోనూ ప్రముఖ క్రియను నిర్వహిస్తుంది.

కాలేయము (లేక) యకృత్‌లో తయారయిన పిత్తము (ఱనిజఉ) పిత్తాశయములో నిల్వ ఉంచబడి శరీర క్రియ కలాపములో పాల్గొంటుంది.

Sunday, 2 September 2012

ఫ్యాటీలివర్‌తో కాలేయానికి ముప్పు

మానవ శరీరంలో అతికీలకమైన అవయవం కాలేయం. ఈ అవయవంలో కొవ్వు అధికంగా చేరిపోతే ఫ్యాటీలివర్ సమస్య మొదలవుతుంది. నిర్లక్ష్యం చేస్తే లివర్ సిర్రోసిస్‌గా మారే అవకాశం ఉన్న ఈ సమస్యను ఆధునిక చికిత్సలతో సులభంగా తగ్గించవచ్చని అంటున్నారు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా. ఎమ్.ఎన్. పవన్‌కుమార్.

పై పొట్టలో నొప్పి వస్తుంటే ఎసిడిటీ అనుకుని తెలిసిన మాత్రలేవో వేసుకుని ఉండిపోతారు. చివరకు నొప్పి ఎక్కువయ్యాక ఆసుపత్రికి వెళితే అల్ట్రాసౌండ్ పరీక్షల్లో ఫ్యాటీలివర్ అని తేలుతుంది. నిర్లక్ష్యం చేస్తే ఈ సమస్య లివర్ సిర్రోసిస్‌కు దారితీసి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.